Government Prepared anganwadi Termination Orders:అంగన్వాడీల తొలగింపునకు టెర్మినేషన్ ఆర్డర్లు సిద్ధమయ్యాయి. దాదాపు 80 వేల మందికి పైగా అంగన్వాడీలను తొలగిస్తూ జిల్లా కలెక్టర్లు టెర్మినేషన్ ఆర్డర్లు జారీ చేశారు. ప్రభుత్వ బెదిరింపులు, నోటీసుల జారీతో 20 శాతం మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు విధుల్లో చేరారు. మొత్తం లక్షా 4 వేల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు విధుల్లో చేరాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో కొత్త వారిని నియమించుకునేందుకు 26న దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్లు నిర్ణయించారు. ఈ నెల 24 తేదీన అంగన్వాడీల టెర్మినేషన్కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ చేయాలని నిర్ణయించారు. జనవరి 25న కొత్త వారిని నియమించుకునేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రవ్యాప్తంగా అర్థరాత్రి వేళ అంగన్వాడీల అరెస్టులు - దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్లకు తరలింపు
Government Send Terminate Orders in District Collectors: విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటల లోపు విధుల్లో చేరిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను విధుల్లో తీసుకోవాలని ఆదేశించారు. మిగిలిన వారికి టర్మినేషన్ ఆర్డర్లు జారీ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో చేరిన అంగన్వాడీ హెల్పర్ లకు వర్కర్లు గా పదోన్నతులు కల్పించాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో నూ టర్మినేషన్ ఉత్తర్వులు జారీ చేసేందుకు కలెక్టర్లు సిద్ధం చేశారు.
అంగన్వాడీలపై పోలీసుల ఉక్కుపాదం - ఎక్కడికక్కడ అరెస్టులు, ఉద్రిక్తత