Girls hostel Hidden cameras Row:గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారన్న ప్రచారం కలకలం రేపింది. అధికారులు, కళాశాల యాజమాన్యం, పోలీసులు ఎంత వెతికినా ఎక్కడా రహస్య కెమెరాల ఆచూకీ మాత్రం దొరకడం లేదు. కానీ విద్యార్ధుల్లో నెలకొన్న ఆందోళన తగ్గకపోగా రోజు రోజుకూ అనుమానాలు పెరుగుతూ లేనిపోని అపోహలకు దారితీస్తోంది. కాకినాడు జేఎన్‌టీయూ విభాగం శాఖా పరంగా విచారణ కూడా చేస్తోంది.
ప్రభుత్వానికి నివేదిక: ఈనెల 3న ఈ అంశంపై నివేదిక ప్రభుత్వానికి అందించనున్నారు. దాదాపు 300 వీడియోలు బయటకు వచ్చాయని ఒక విద్యార్థిని చేసిన ప్రచారం ఇంత దుమారానికి కారణమైంది. ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అమ్మాయిల మధ్య సాగిన ప్రేమ వ్యవహారం, ఆపై వారిమధ్య ఏర్పడిన పొరపొచ్చాల మూలంగానే హిడెన్ కెమెరాల ప్రచారం సాగిందన్న విషయాన్ని విచారణ బృందం దాదాపుగా నిర్థారించింది. గుడివాడ సీసీఎస్ సీఐ రమణమ్మ నేతృత్వంలో ఎస్సై మాధురితో కలిపి ఐదుగురు బృందంతో సాంకేతిక కమిటీని విచారణ చేసింది. ఇప్పటికే బాంబు స్క్వాడ్‌లోని సాంకేతిక బృందం సోదాలు చేసి ఎలాంటి పరికరాల ఆచూకీ లేదని తేల్చారు.
రహస్య కెమెరాల ప్రచారం - వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కొనసాగుతున్న దర్యాప్తు
ఒక స్నానాల గది షవర్‌లో ఏర్పాటు చేశారని ఒక విద్యార్థిని మరో విద్యార్థిని ఆరోపణలు చేసింది. విద్యార్ధులను విచారించినప్పుడు ఎవరూ హిడెన్ కెమెరాలను చూసినట్లుగానీ, వీడియోలు చూసినట్లు కానీ చెప్పలేదు. ఒకరిద్దరు విద్యార్ధులు మాట్లాడుకునేటప్పుడు తీసుకున్న స్క్రీన్ షాట్స్ మాత్రం విచారణ బృందం దృష్టికి వచ్చాయి. ఈ స్క్రీన్ షాట్‌ను చూసిన ఐదుగురు విద్యార్ధులు బృందంలోని ఒక విద్యార్ధి హిడెన్ కెమెరాలంటూ ప్రచారం చేశారు. ఇది నమ్మిన మిగిలిన విద్యార్థులు మాత్రం ఎవరో చెబితే విన్నామని విచారణలో సమాధానం ఇస్తున్నారు. ఐదుగురు అల్లిన 'ప్రేమ'కథా చిత్రమ్ - 'హిడెన్ కెమెరాల' వ్యవహారంలో క్రేజీ ట్విస్ట్