Rushikonda Palace : "ఒక్క అవకాశం" అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. తాను మరో 30ఏళ్లపాటు సీఎం పదవిలో ఉంటానని కలలుగన్నాడు. అధికారం శాశ్వతం కాదని తెలిసీ.. ప్రజలను యాచకులుగా మార్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే మెజార్టీ ప్రజలను ఆకర్శించే పథకాల వల విసిరాడు. అనతి కాలంలోనే జగన్ మోసాన్ని పసిగట్టిన జనం.. సమయం కోసం వేచి చూసి ఓటు అనే ఆయుధంతో జగన్ అహంకారాన్ని అంతం చేశారు.
ఏడు భవనాలు, మూడు ఇళ్లు, 12 పడక గదులు- 'నిరుపేద జగన్ నివాసానికి అనుకూలమట' - Jagan Rushikonda Palace
రిషికొండపై ప్రభుత్వ భవనాలే నిర్మించామంటూ వైఎస్సార్సీపీ నాయకులు మూలాలు మరిచి మాట్లాడుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి బాత్రూంలు నిర్మించడం, అత్యంత విలువైన విదేశీ ఫర్నిచర్ వినియోగించడం ఎంత వరకు సమంజసమని మీడియా ప్రశ్నిస్తోంది. ప్రజా ధనానికి రక్షకుడిగా ఉండాల్సిన వ్యక్తి ఎథిక్స్, మోరల్స్ విస్మరించారని దుమ్మెత్తిపోస్తోంది.
ఒక్కో బాత్టబ్ ఖర్చు రూ.36లక్షలు కాగా, ల్యాండ్ స్కేప్ వ్యయం రూ.50 కోట్లు, రూ.30కోట్లు లైటింగ్, రూ.80 కోట్లు ఇంటీరియర్ డిజైన్, రూ.100 కోట్లు డ్రైనేజీ సిస్టమ్ కోసం ఖర్చు చేసినట్లు సమాచారం. మంచాలు, కుర్చీలు, పరుపులు, బల్లలన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. ప్యాలెస్లో ముఖం చూసుకునే అద్దం మొదలుకొని స్నానాల తొట్టి, కమోడ్లు, విండో, డోర్ కర్టెన్ల వరకు అన్నీ వివిధ దేశాల నుంచి తెప్పించినవే.
చివరకు మరుగుదొడ్లలో వినియోగించిన వాల్‌షీట్లు కూడా విదేశాలవే కావడం విశేషం. మొత్తం ఐదు దేశాల గ్రానైట్, మార్బుల్స్‌తో తీర్చిదిద్దారు. రూ.60 వేల విలవైన విద్యుత్ దీపాలను వందల సంఖ్యలో ఏర్పాటు చేయడంపై ఐశ్వర్యవంతులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రజాధనంతో ఇంత జల్సానా? అని ముక్కున వేలేసుకుంటున్నారు.