ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

వారి కోసం మూడు కుర్చీలు - కాకినాడ సెజ్​పై చర్చకు రాని వైఎస్సార్సీపీ నేతలు - SVSN VARMA OPEN DISCUSSION

కాకినాడ సేజ్ వ్యవహారంపై మాజీమంత్రి కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, కాకినాడ మాజీ ఎంపీ వంగా గీతలకు సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ - బహిరంగ చర్చ కోసం కుర్చీలు ఏర్పాటు

SVSN Varma Arranged Chairs for open Discussion with YSRCP Leaders
SVSN Varma Arranged Chairs for open Discussion with YSRCP Leaders (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2024, 8:35 PM IST

SVSN Varma Arranged Chairs for open Discussion with YSRCP Leaders : కాకినాడ సేజ్ వ్యవహారంపై పిఠాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన మాజీమంత్రి కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, కాకినాడ మాజీ ఎంపీ వంగా గీతలకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ సవాల్ విసిరారు. కాకినాడ సేజ్​పై బహిరంగ చర్చకు రావాలని వైఎస్సార్సీపీ నేతలకు నిన్న(ఆదివారం) సవాల్ విసిరిన వర్మ అన్నట్టుగానే భారీగా కార్యకర్తలతో పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ వద్ద ర్యాలీగా బయలుదేరారు.

అనంతరం మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, వంగా గీతలు చర్చలో పాల్గొనేందుకు కుర్చీలను ఏర్పాటు చేయించారు. వైఎస్సార్సీపీ నేతలు రాక కోసం పిఠాపురం నడిబొడ్డున వర్మ, టీడీపీ కార్యకర్తలు ఎదురుచూశారు. అయితే వర్మ సవాల్​ను వైఎస్సార్సీపీ నేతలు స్వీకరించలేదు. బహిరంగ చర్చకు రాని వైఎస్సార్సీపీ నేతలు వారు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అని ఒప్పుకున్నట్టే అని మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం చేశారు.

Varma Challenged YSRCP Leaders on Kakinada SEZ :కాకినాడ ఎస్‌ఈజడ్‌పై బహిరంగ చర్చకు రావాలంటూ వైఎస్సార్సీపీ నేతలకు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ బుధవారం సవాల్‌ విసిరారు. వైఎస్సార్సీపీ నేతలు, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీత నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు కౌంటరుగా వర్మ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. కాకినాడ ఎస్‌ఈజడ్‌ వ్యవహారంలో వైఎస్సార్సీపీ నేతల్లో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు. రైతులపై తెలుగుదేశం ప్రభుత్వం కేసులు పెట్టిందని విమర్శిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు కాకినాడ ఎస్‌ఈజడ్‌ పెట్టింది ఎవరో తెలుసుకోవాలని వర్మ అన్నారు.

జగన్ హయాంలోనే రైతులకు తీవ్ర అన్యాయం: సెజ్‌ను ఎవరు ప్రారంభించారు? ఎవరెవరు బినామీలు ఉన్నారనే విషయాలను సోమవారం 3 గంటలకు ఉప్పాడ సెంటర్లో నిర్వహించే బహిరంగ చర్చకు రావాలని వర్మ సవాలు విసిరారు. వైఎస్సార్సీపీ నేతలు బహిరంగ చర్చకు రాకపోతే అన్యాయం చేసింది మీరేనని అంగీకరించినట్టేనని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని వ్యవహారాలపైనా విచారణ చేస్తుందని చెప్పారు.

రాజశేఖర్ రెడ్డి, జగన్ హయాంలోనే రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. రిజిస్ట్రేషన్ భూములకు కూడా సీఎం చంద్రబాబు 160 కోట్ల రూపాయలు చెల్లించారని చెప్పారు. మొత్తం వ్యవహారాలపై వైఎస్సార్సీపీ నాయకులు రావాలని వర్మ డిమాండ్ చేశారు.

కాకినాడ సెజ్​పై బహిరంగ చర్చకు సిద్ధమా - వైఎస్సార్సీపీకి వర్మ సవాల్‌

'ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు'- వంగా గీతపై వర్మ సంచలన ఆరోపణలు - SVSN Varma Fires on Vanga Geetha

ABOUT THE AUTHOR

...view details