EC letter to AP Govt on DBT Schemes :నగదు బదిలీ పథకాలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఇవాళే నగదు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించింది. జనవరి 24 నుంచి మార్చి 24 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తమ ముందు ఉంచాలని ఆదేశించింది. ఒకరోజే నిధుల బదిలీ అవసరం ఎందుకొచ్చిందో తెలుసుకోవడానికేనని వ్యాఖ్యానించింది.
ఇప్పటివరకు నగదు బదిలీ ఎందుకు చేయలేకపోయారో పోలింగ్ తేదీకి ముందు ఎందుకు ఇవ్వాలనుకుంటారో వివరించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరణ ఇవ్వాలని ఈసీ తేల్చిచెప్పింది. ఈ ఐదేళ్లలో బటన్ నొక్కిన సమయానికి నిధుల బదిలీకి మధ్య వ్యవధిని కోరింది. 'బటన్ నొక్కి చాలా వారాలైంది, ఇవాళే నిధులు జమ చేయకపోతే ఏమవుతుంది' అని ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ప్రశ్నించింది.
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ అనుమతి కోరిన సీఎం జగన్ - YS Jagan court permission on Abroad