KTR petition in Supreme Court:ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు రిజిస్ట్రీలో కేటీఆర్ న్యాయవాది మోహిత్ రావు పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసు నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ నిబంధనలకు విరుద్ధంగా నిధుల బదలాయింపు జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ(Enforcement Directorate) సైతం రంగంలోకి దిగి కేటీఆర్కు మరోసారి నోటీసులిచ్చింది. ఈ నెల 16న విచారణకు రావాలని అందులో పేర్కొంది. అయితే ఏసీబీ కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ప్రభుత్వ వాదనలు కూడా వినాలి: మరో వైపు తెలంగాణ హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనను కూడా వినాలని ముందస్తుగానే పిటిషన్
పిటీషన్ కొట్టివేత: ఫార్ములా- ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో నేరపూరిత కుట్ర జరిగిందని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు చేశారని అతను సాధారణ వ్యక్తి కాదని బాధ్యతగల హోదాలో ఉన్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అని హైకోర్టు తెలిపింది. కేటీఆర్ హెచ్‌ఎండీఏ నిధులను అక్రమంగా వినియోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారన్న ఉన్నత న్యాయస్థానం నిధుల దుర్వినియోగం జరగడంలేదని పిటిషనర్ వాదించడాన్ని నమ్మడం లేదని తెలిపింది.
మచిలీపట్నంలోని గ్రీన్ కో ఎనర్జీ కార్యాలయంలో తెలంగాణ ఏసీబీ సోదాలు