AP Election Results 2024: తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు కలిసినా చివరకు వారి మధ్య వచ్చే సంభాషణ ఏపీ ఎన్నికల ఫలితాలు. ఎక్కడ చూసినా ఏపీలో ఎవరు గెలుస్తారనే అంశంపైనే చర్చ జరుగుతోంది. పార్టీ వీరాభిమానులు ఇప్పటికే మేము గెలుస్తామని బెట్టింగ్‌లు వేస్తూ ఎన్నికల ఫలితాలపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ ఉత్కంఠకు మరో 24 గంటల్లో తెరపడనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
AP Election Result 2024 : ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై చర్చ ఉదయం కప్పు కాఫీతో మొదలై, రాత్రి భోజనాలు ముగిసి నిద్రపోయేవరకూ కొనసాగుతున్నాయి. చివరకు రాత్రి పడుకునేటప్పుడు కూడా ఏపీలో ఎవరు గెలుస్తారంట అనే చర్చ వస్తోందంటే ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమైనవో అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్‌లో కొందరు ఈ ఫలితాలు ఎగ్జైట్మెంట్ను తట్టుకోలేక మంగళవారం రోజున ఓట్ల లెక్కింపు ఉండడంతో సొంత నియోజకవర్గాలకు బయల్దేరుతున్నారు. గతంలో ఓట్లు వేయడానికి వెళ్లి, ఫలితాల కోసం మీడియాలో తెలుసుకునేవారు. ప్రస్తుతం మాత్రం పరిస్థితులు వేరే లెవల్లో ఉన్నాయి. గెలుపు సంబురాలను తమ వారితో చేసుకోవాలని వాహనాలు, రైళ్లు, బస్సుల్లో సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు.
ఏపీలో మార్పు ఖాయం- కూటమికి పట్టం కట్టిన ఎగ్జిట్‌పోల్స్ - andhra pradesh exit polls 2024
Betting on AP Election Results : ఏపీలో కూటమి గెలుస్తుందని ఎంత ధీమాగా చెబుతున్నారో మరి కొంత మంది వైఎస్సార్సీపీ గెలుస్తుందని కూడా అంతే గట్టిగా వాదిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో కూడా సర్వే సంస్థలు రకరకాల లెక్కలు చెబుతుండడంతో ఎవరూ ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఇప్పటికే బెట్టింగ్‌లు కొంత మంది వేశారని, ప్రస్తుతం బెట్టు వేసేందుకు ఎవరు సాహసం చేయట్లేదని పలువురు చెబుతున్నారు. ఆంధ్రాలోని తన మిత్రులకు ఫోను చేసి ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశాలపై ఆరాతీస్తూ, బెట్టింగ్‌కు సరైన నమ్మకం లేక తికమక పడుతున్నారు హైదరాబాద్ వాసులు.
Discussion AP Election Result: ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం వారికి ఫోను చేసి వరసలు కలుపుతూ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని ఆరా తీస్తున్నారు. మీ వాళ్లు అక్కడ ఉన్నారు కదా ఫోను చేసి కనుక్కోండి అంటూ నెమ్మదిగా విషయాన్ని రాబడుతూ బెరుకు, బెరుకుగానే పందేలు కాస్తున్నవారు కొంతమంది అయితే ఆలోచిస్తూ సమయం దగ్గర పడిందని ఆందోళన చెందుతున్నవారు అంతే మంది ఉన్నారు. ఏది ఏమైనా ఫలితాల కోసం మరో 24 గంటలు వరకు వేచి చూడాల్సిందే.
ఏపీలో కూటమికి జైకొట్టిన యాక్సిస్ ఇండియా టుడే సర్వే