ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

పోలీసు వైఫల్యంపై గులకరాళ్ల రాజకీయాలు- సీఎం సభలో మద్యం ఏరులైపారుతోంది: సీపీఐ నారాయణ - CPI Narayana on CM Jagan

CPI Narayana Comments on CM Jagan Stone Attack: ఎన్నికలు వస్తున్న తరుణంలో రాష్ట్రంలో ప్రధాన, ప్రతిపక్ష పార్టీలు గులకరాళ్ల రాజకీయాలు చేస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్సి మండిపడ్డారు. గతంలో ఫ్యాక్షనిస్టులు చేసే పనులను ఇప్పుడు రాష్ట్రంలో పోలీసులు చేస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో మద్యం, డబ్బు ఏరులై పారుతున్నా ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తుందని ఆగ్రహీంచారు.

narayana_on_cm_jagan
narayana_on_cm_jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 21, 2024, 5:00 PM IST

Updated : Apr 21, 2024, 7:41 PM IST

CPI Narayana Comments on CM Jagan Stone Attack:గతంలో ఎన్నికలు వస్తుంటే బాంబులతో దాడులు చేసుకునే వారని ఇప్పడు ఆ బాంబులు పోయి గురకరాళ్లతో దాడులు చేసుకుంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI National Secretary Narayana) అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో నారాయణ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పాటల సీడీ ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధాన, ప్రతిపక్ష పార్టీలు గులకరాళ్ల రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. గతంలో ఫ్యాక్షనిస్టులు చేసే పనులను ఇప్పుడు రాష్ట్రంలో పోలీసులు చేస్తున్నారని రామకృష్ణ విమర్శించారు.

అవినాష్ రెడ్డి నేర చరిత్రపై ఈసీకి ఎందుకు నివేదించలేదు?: వైఎస్ సునీత రెడ్డి - Avinash Reddy criminal history

విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ముఖ్యమంత్రిపై గులకరాళ్ల దాడిపై ఓ చెత్త రిపోర్టు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయి విసిరితే అది కుట్ర హత్యాయత్నం ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. జెడ్ కేటగిరి సెక్యూరిటీ ఉన్నా కూడా దాడి జరిగిందంటే అది కచ్చితంగా పోలీసులు వైఫల్యమేనని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో మద్యం, డబ్బు ఏరులై పారుతున్న ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తుందని రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ సిద్ధం సభలకు మద్యం విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నా ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడలో ఎందుకు విఫలమవుతుందని ప్రశ్నించారు. పారదర్శక ఎన్నికల కోసం మద్యం డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

గలకరాయి దాడి కేసులో కీలక విషయాలు వెల్లడించిన దుర్గారావు - Stone Attack Accused Durga Rao

జగన్​పై ప్రజలకు ఏమాత్రం సానుభూతి లేదు:సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇంకా పిల్ల చేష్టలు ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబులేసు (CPI State Executive Committee Members Obulesu) ఆరోపించారు. రాయితో దాడి చేశారో లేక చేయించారో తెలియదు కానీ విద్యుత్ పోయిన సమయానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలో ఎందుకు ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు ఇలాంటి చిన్న రాయితో దాడి చేయించుకోవడం ఏమిటని ఓబులేసు ప్రశ్నించారు.

సీఎం నమ్మక ద్రోహం - జగన్‌ దెబ్బకు విలవిల్లాడుతున్న ఆర్టీసీ ఉద్యోగులు - cm ys jagan cheated rtc employees

అసలు జగన్మోహన్ రెడ్డిపై ప్రజలకు ఏమాత్రం సానుభూతి లేదని ఆయన కడప ప్రెస్ క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. ఒకే రాయి ఇద్దరికి తగిలింది అనడం విడ్డూరంగా ఉందని ఖండించారు. జగన్మోహన్ రెడ్డి గాయపడిన దెబ్బతోనే ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓట్లు గడించాలని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఇదొక నాటకం ఆడుతున్నారని విమర్శించారు. జగన్ ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. జగన్ గద్దె దిగే రోజు త్వరలోనే ఉందని ప్రజలు తమ ఓటుతో బద్ది చెప్తారని ఓబులేసు విమర్శించారు.

పోలీసు వైఫల్యంపై గులకరాళ్ల రాజకీయాలు- సీఎం సభలో మద్యం ఏరులైపారుతోంది: సీపీఐ నారాయణ
Last Updated : Apr 21, 2024, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details