CPI Narayana Comments on YSR Family Disputes : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల గొడవ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జగన్ ఆస్తుల వివాదంలో తల్లి, చెల్లిపై కోర్టుకెక్కారు. సరస్వతీ పవర్ కంపెనీలోని తమ షేర్లను షర్మిల, విజయమ్మ అక్రమంగా బదిలీ చేసుకున్నారని తెలిపారు. ఈ మేరకు జగన్, భారతీ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్కి ఫిర్యాదు చేశారు. దీనిపై వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు.
Sharmila vs YS Jagan : వైఎస్సార్ సంపాదించిన ఆస్తుల్లో తనకు, తన పిల్లలకు దక్కాల్సిన వాటా ఇవ్వకుండా సోదరుడు జగన్ తమకు అన్యాయం చేశారని షర్మిల తీవ్ర ఆవేదన చెందారు. అరకొర ఆస్తులు ఇచ్చి వెళ్లగొట్టాలని చూడటమే కాకుండా, పంపకాలపై చేసుకున్న ఒప్పందాన్నీ తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిపైనా, చెల్లిపైనా కేసు పెట్టి, కుటుంబాన్ని కోర్టుకీడ్చేంత నీచానికి ఒడిగట్టారని ఆమె ఉద్వేగానికి లోనయ్యారు.
ఈ పరిణామాలన్ని జరుగుతున్న క్రమంలో సడెన్గా వైఎస్ విజయమ్మ వైఎస్ అభిమానులకు బహిరంగ లేఖ రాయడం కలకలం రేపింది. రాజశేఖర్రెడ్డి బతికి ఉండగా ఆస్తుల పంచలేదని జగన్, షర్మిల తల్లి విజయమ్మ స్పష్టం చేశారు. అన్నీ కుటుంబ ఆస్తులేనని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆస్తులు ఇద్దరికీ సమానమనేది నిజమని మనవడు, మనవరాళ్లు నలుగురికీ ఆస్తులు సమానంగా ఉండాలన్న వైఎస్సార్ ఆజ్ఞ అంతే వాస్తవమని తెలిపారు. జగన్, షర్మిల పేరిట రాజశేఖరరెడ్డి కొన్ని ఆస్తులు పెట్టారని, అది పంపకం ముమ్మాటికీ కాదని పేర్కొన్నారు. ఒక బిడ్డకు మరో బిడ్డ అన్యాయం చేస్తున్నందునే ఈ వాస్తవాలన్నీ చెప్పాల్సి వచ్చిందని విజయమ్మ తేల్చేశారు.