Congress Vamshichand Reddy Challenges KCR : నీళ్లు, నిధులు, నియమాకాల పేరుతో పదవి పొందిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) రాష్ట్రాన్ని దివాళ తీయించారని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాలతో పాలమూరు జిల్లాలను సస్యశ్యామలం చేశామని, కేసీఆర్ కుటుంబం తప్పుడు ప్రచారం చేసిందని విమర్శించారు. పాలమూరుకు రావాల్సిన కృష్ణా జలాలు, ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంటే కేసీఆర్ ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.
AICC Vamshichand Reddy Fires on BRS :కేసీఆర్ అసమర్థ నాయకత్వంతో కృష్ణా నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం జరిగిందని వంశీచంద్‌రెడ్డి(AICC Vamshichand Reddy) దుయ్యబట్టారు. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజల కన్నీటి గాథలు చెప్పుకుంటే పోతే చాంతాడంత ఉందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌కు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన మహబూబ్‌నగర్ ప్రజలను ఆయన మోసం చేశారని మండిపడ్డారు. తాను తప్పు చేయలేదని చెప్పే దమ్ము ధైర్యం ఉంటే, కేసీఆర్ మహాబూబ్‌నగర్ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఎవరు చెప్పేది నిజమో ప్రజలే తేల్చుతారని అన్నారు.
AICC Vamshichand Reddy Letters to KCR :తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి, కల్వకుంట్ల కుటుంబం బాగుపడిందని వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరును పండబెట్టి మేడిగడ్డను(Medigadda) బొందపెట్టిందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు మరోసారి మోసం చేయడానికే మేడిగడ్డ పర్యటన చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు కేటాయించిన కృష్ణా నీటిని బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకోలేదన్నారు. పాలమూరు అంటే కేసీఆర్‌కు పగ ఉందని తెలిపారు.