తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Apr 15, 2024, 7:58 AM IST

ETV Bharat / politics

మన పోరాటం బీఆర్ఎస్​పై కాదు బీజేపీపై - రాష్ట్ర నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం - LOK SABHA ELECTIONS 2024

Congress Mission 15 in Telangana Lok Sabha Elections : రాష్ట్రంలో అధికారంలోకి ఉన్నామని లోక్‌సభ ఎన్నికల్లో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. మిషన్‌-15 లక్ష్యం నిర్దేశించుకుని పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ బలహీన పడిందని బీజేపీపైనే ఎక్కువగా పోరాడాలని సూచించారు. ఉత్తరాదిన కమలం పార్టీ బలహీన పడిందని, అందువల్లే దక్షిణ భారత్‌పై దృష్టిపెట్టిందని ఇక్కడా అవకాశం ఇవ్వొద్దని తెలిపారు.

Congress Mission 15 in Telangana Lok Sabha Elections
Congress Mission 15 in Telangana Lok Sabha Elections

తెలంగాణలో కాంగ్రెస్‌ అత్యధిక స్థానాల్లో గెలవాలన్న కేసీ వేణుగోపాల్

Congress Mission 15 in Telangana Lok Sabha Elections : శంషాబాద్ నోవాటెల్‌ హోటల్‌లో కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ సమావేశమయ్యారు. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy on Lok Sabha Polls),ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపదాస్‌ మున్షీ, ఏఐసీసీ ఇంఛార్జ్‌ కార్యదర్శులు, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, లోక్‌సభ అభ్యర్థులు పాల్గొన్నారు.

KC Venugopal Meet Congress Leaders : తొలుత 17 పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నాయకులతో సమావేశమైన వేణుగోపాల్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు ముఖ్య నేతలకు వారి వారి నియోజకవర్గాల్లోని ప్రచార పురోగతి, పార్టీ స్థితిగతుల్ని వివరించారు. పార్టీ అధికారంలో ఉందనే కారణంతో కొందరు నాయకులు నిర్లక్ష్యంతో ఉన్నట్లుగా అధినాయకత్వం గుర్తించినట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు. వారు తమ వైఖరి మార్చుకోకుంటే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నెలరోజుల పాటు అందరూ కలిసికట్టుగా పనిచేసి మిషన్-15లో భాగంగా 15 లోక్‌సభ స్థానాలు గెలవాలని దిశానిర్దేశం చేశారు.

మెజార్టీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం - జాతీయ నాయకులతో బహిరంగ సభలు - Lok Sabha Elections 2024

బీఆర్ఎస్‌పై కాదు బీజేపీపై పోరాడాలి :రాష్ట్రంలో బీఆర్ఎస్ పూర్తిగా బలహీన పడిందని ఆ పార్టీపై ఎక్కువగా దృష్టి పెట్టొద్దని, బీజేపీపైనే పోరాడాలని కేసీ వేణుగోపాల్ ఉద్బోధించారు. గులాబీ పార్టీ, కమలం పార్టీలో నుంచి కాంగ్రెస్‌లో చేరేవారికి కొందరు డీసీసీ అధ్యక్షులు ఎందుకు అడ్డుతగులుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏ స్థాయి నాయకులైనా పార్టీలో చేర్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. హస్తం పార్టీలోకి వచ్చేందుకు ఆటంకాలు కలిగిస్తే, వారు భారతీయ జనతా పార్టీలో చేరి ఆ పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అభ్యంతరాలుంటే సంప్రదింపుల ద్వారా ఏకాభిప్రాయంతో చేరికలు కొనసాగించాలని కేసీ వేణుగోపాల్ సూచించారు.

Congress MP Candidates in Telangana 2024 :దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బాగా పుంజుకుందన్న వేణుగోపాల్‌, ఉత్తర భారతదేశంలో బీజేపీ ప్రభావం తగ్గిందని తెలిపారు. ఇందుకోసమే దక్షిణ భారత్‌ వైపు కమలం పార్టీ దృష్టి సారించిందని ఇక్కడా అవకాశం ఇవ్వొద్దని దిశానిర్దేశం చేశారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేన్యాయ్‌ మేనిఫెస్టో (Congress Lok Sabha Election Manifesto 2024 )సహా రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలును ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. గత బీఆర్ఎస్ సర్కార్‌ అక్రమాలను ప్రజలోకి తీసుకెళ్లాలని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు.

అప్పుడు షైన్​ ఇండియా - ఇప్పుడు వికసిత్​ భారత్​ - హిస్టరీ రిపీట్​ అవుద్ది : సీఎం రేవంత్‌ రెడ్డి - CM Revanth Reacts on BJP Manifesto

Lok Sabha Elections 2024 : నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, అవకాశం ఉన్న మేరకు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరవుతారని కేసీ వేణగోపాల్ పేర్కొన్నారు. సునీల్ కనుగోలు సర్వేల ద్వారా పార్టీ స్థితిగతులను తెలియజేస్తుంటారని లోటుపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాలని నేతలకు కేసీ వేణుగోపాల్‌ సూచించారు.

రాష్ట్ర నేతలంతా కష్టపడి పనిచేస్తే 15 సీట్లు గెలుస్తామని సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నాలుగు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అభ్యర్థుల విజయం కోసం నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు 24 గంటల్లో అభ్యర్థుల్ని ప్రకటిస్తామని కేసీ వేణుగోపాల్‌ తెలిపినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు.

"బీఆర్‌ఎస్‌, బీజేపీకి మధ్య లోపాయికారీ ఒప్పందం ఉంది. అందుకే బీఆర్ఎస్, బీజేపీ నేతలు పార్టీలోకి వస్తే చేర్చుకోవాలని చెప్పారు. ఏ స్థాయి నాయకులైనా పార్టీలో చేర్చుకోవాల్సిందేనని దిశానిర్దేశం చేశారు. సభలు, సమావేశాలపై ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. మిగిలిన మూడు స్థానాలకు 24 గంటల్లోగా అభ్యర్థుల్ని ప్రకటిస్తామని చెప్పారు." - కొండా సురేఖ, మంత్రి

ప్రజల హృదయాల నుంచి పుట్టిందే మా గ్యారంటీల పత్రం : రాహుల్‌ గాంధీ - Tukkuguda Congress Meeting 2024

ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టేందుకు రేవంత్ సైన్యం సిద్ధం - వాటికి ఆధారాలతో కూడిన కౌంటర్ - LOK SABHA ELECTIONS 2024

ABOUT THE AUTHOR

...view details