CM Revanth Reddy Chit Chat: భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం తథ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ విలీనం తర్వాత కేసీఆర్‌కు గవర్నర్, కేటీఆర్‌కు కేంద్ర మంత్రి, హరీశ్‌రావుకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి ఇస్తారన్నారు. దిల్లీలో పాత్రికేయులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన రేవంత్, బీఆర్ఎస్రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనం కాగానే కవితకు బెయిల్ వస్తుందని పేర్కొన్నారు. 4 రాజ్యసభ సీట్లకు సమానంగా బెయిల్ ఇస్తారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే తన కుటుంబసభ్యులకు ప్రభుత్వం, పార్టీలో ఎలాంటి పదవులు ఇవ్వలేదని రేవంత్ తెలిపారు.
తన కుటుంబసభ్యులు ఎన్నో ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఏడుగురు సోదరులున్నారని, తాను సీఎం అయినంత మాత్రాన వారంతా ఇంట్లో కూర్చోరు కదా? అని రేవంత్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే వారు వ్యక్తిగతంగా విదేశీ పర్యటనకు వెళ్లినా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క పథకం కూడా ఆగలేదని, ప్రతి నెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని సీఎం గుర్తు చేశారు.
పరిశ్రమలు, సేవారంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్‌కు ఉంది : ఫాక్స్‌కాన్ ఛైర్మన్ - CM Revanth with Foxconn Chairman
పీసీసీపై నిర్ణయం నా చేతిలో లేదు : గతంలో కేసీఆర్ నిధులన్నీ కాంట్రాక్టర్లకే ఇచ్చారని, తమ ప్రభుత్వం ప్రాధాన్యత ప్రకారం రుణమాఫీ చేసిందని తెలిపారు. దిల్లీ వారికి రాజ్యసభ ఎలా ఇస్తారని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను పట్టించుకోవడం లేదన్నారు. ఈ క్రమంలోనే భారత రాష్ట్ర సమితి పార్టీ నేతలు కంటి నొప్పి, పంటి నొప్పికి కూడా దిల్లీకే వస్తారు కదా? అని విమర్శించారు. ఆ మాత్రం వైద్యం చేసేవారు తెలంగాణలో లేరా? అని ప్రశ్నించారు. దిల్లీలో ప్రత్యేక ప్రతినిధి, దిల్లీలో మీడియా సలహాదారు ఎవరికి ఇచ్చారో కేసీఆర్ గుర్తు చేసుకోవాలన్నారు. మరోవైపు పీసీసీపై నిర్ణయం తన చేతిలో లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని పునరుద్ఘాటించారు. తన అభిప్రాయం ఎప్పుడో అధిష్టానానికి చెప్పానని స్పష్టం చేశారు.
ఇలా వచ్చి - అలా వెళ్లారు : విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గురువారం రోజున మళ్లీ రాష్ట్రాన్ని వీడి దిల్లీ పర్యటనకు వెళ్లారు. నేడు దిల్లీలో ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం పార్టీ అధిష్ఠానంతో భేటీ అవనున్నారు. ఈ భేటీలో రాష్ట్ర నూతన పీసీసీ చీఫ్ ఎన్నిక, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణపై పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో చర్చిస్తారు. అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు సోనియా గాంధీని, వరంగల్ రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు.
త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ - ఆ నలుగురికే ఛాన్స్ - నామినేటెడ్ పదవుల భర్తీపైనా ఫోకస్ - TELANGANA CABINET EXPANSION 2024