CM CBN Meeting with NITI AAYOG Representatives : 2047 నాటికి రాష్ట్రాన్ని 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అందుకోసమే ఏపీ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశమైన సీఎం వికసిత్ ఏపీ - 2047 (Viksit AP - 2047) డాక్యుమెంట్ రూపకల్పనపై చర్చించారు.
జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్లు సిద్ధం :నీతి ఆయోగ్ ప్రతినిధులతో చంద్రబాబు సచివాలయంలో భేటీ అయ్యారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీపై చర్చించారు. విజన్ - 2047 డాక్యుమెంట్ రూపకల్పనపై నీతి ఆయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. 12 అంశాలతో వికసిత్ ఏపీ డాక్యుమెంట్ రూపకల్పనపై వివరించారు. 2047 నాటికి ఏపీని 2 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని నీతి ఆయోగ్ ప్రతినిధులకు సీఎం స్పష్టం చేశారు. అందుకోసమే ఏపీ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఐదేళ్లకు జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
పేదరిక నిర్మూలనకు చంద్రబాబు కొత్త ఫార్ములా- నీతి అయోగ్ సమావేశంలో ప్రతిపాదన - CHANDRABABU POLICY
అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి :రాష్ట్రాన్ని ఆహారశుద్ధి పరిశ్రమల కేంద్రంగా రూపొందించే అంశంపై ప్రణాళికలను సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ ప్రతినిధులకు వివరించారు. విద్యతో పాటు పారిశ్రామికంగా యువతలో నైపుణ్యం పెంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. దేశ తూర్పు తీర ప్రాంతానికి లాజిస్టిక్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దనున్నట్లు సీఎం వెల్లడించారు. పరిశ్రమలు, పునరుత్పాదక విద్యుదుత్పత్తి కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ఏపీని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు సీఎం నీతి ఆయోగ్ ప్రతినిధులకు తెలిపారు. ఏపీలోని వివిధ నగరాలను గ్రోత్ సెంటర్లుగా మార్చేలా ప్రణాళిక తయారుచేస్తున్నట్లు వివరించారు. అందరికీ అత్యాధునిక వైద్యం కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
పర్యావరణ అనుకూల అభివృద్ధిపై దృష్టి పెట్టేలా రూపొందించిన ప్రణాళికలను నీతి ఆయోగ్ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించారు. డిజిటల్ గవర్నెన్స్, ఆర్థికాభివృద్ధికి ఏపీని ఓ నమూనాగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు.
'పరిశ్రమలు వినూత్న ఆలోచనలతో రావాలి' - కంపెనీల సీఈవోలతో సీఎం చంద్రబాబు - AP CM Chandrababu Sri City Visit