CM Chandrababu Kanuma Wishes : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కనుమ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. కమ్మని విందుల కనుమ పండుగ అందరి కుటుంబంలో సంతోషం నింపాలని ఆకాంక్షించారు. రైతుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకొన్న పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని ఈ పర్వదినం మనకు బోధిస్తుందని చెప్పారు. కాలం మారినా తరగని అనుబంధాల సంపద మనదని పేర్కొన్నారు. ఆ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వివరించారు.
అన్నదాతలకు అత్యంత ప్రీతిపాత్రమైనది కనుమ అని లోకేశ్ అన్నారు. ఇళ్లు ధాన్యరాశులతో నిండుగా, పాడిపంటలతో పచ్చగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ పండగ అన్ని ప్రయత్నాల్లోనూ విజయం చేకూర్చాలని, ప్రజలంతా కుటుంబసభ్యులంతా కలిసి గొప్పగా కనుమ జరుపుకోవాలన్నారు. ఈ కనుమ పండుగ మీ అన్ని ప్రయత్నాలలో విజయాన్ని, ఆనందాన్ని తీసుకురావాలని కోరుతూ లోకేశ్ ట్వీట్ చేశారు.