పటాన్‌చెరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు - గోడ దూకి లోపలి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు - CLASH BETWEEN CONGRESS LEADERS
పటాన్‌చెరు కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు - ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా హైవేపై ధర్నా చేసిన పార్టీలోని మరో వర్గం
![పటాన్‌చెరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు - గోడ దూకి లోపలి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు Clash Between Congress Leaders In patancheruvu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-01-2025/1200-675-23384479-thumbnail-16x9-jjjj.jpg)
Published : Jan 23, 2025, 12:49 PM IST
Clash Between Congress Leaders in Patancheruvu :హైదరాబాద్ పరిధిలోని పటాన్‌చెరు కాంగ్రెస్‌లో శనివారం వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పటాన్‌చెరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒక వర్గానికి చెందిన కార్యకర్తలు హైవేపై ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలోనే కార్యాలయ గేటు వద్ద ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. క్యాంప్ కార్యాలయం గోడదూకి లోపలికి వెళ్లిన ముగ్గురు కార్యకర్తలు ఆఫీస్‌లోని కుర్చీలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.