Chandrababu criticizes YCP irregularities: రాష్ట్రంలో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. అవినీతి వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమన్నారు. వ్యక్తం చేశారు. అధికారం ఉందని విర్రవీగిన వ్యక్తి.. జగన్ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. 2047లో వికసిత్ భారత్ మోదీ లక్ష్యమన్న ఆయన.. వికసిత్ ఆంధ్రప్రదేశ్ పవన్ లక్ష్యం, తన లక్ష్యమని చెప్పారు. కూటమి మేనిఫెస్టో ముందు వైసీపీ మేనిఫెస్టో వెలవెలబోయిందన్నారు.
మనకు మోదీ గ్యారంటీ ఉంది, సూపర్ సిక్స్ ఉన్నాయని చంద్రబాబు వెల్లడిచారు. 25 లోక్‌సభ, 160 శాసనసభ సీట్లలో కూటమిదే విజయం. శుక్రవారం వస్తే పొక్లెయిన్లు వస్తాయి.. పోలీసులు గోడలు దూకుతారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కూటమి కలయిక.. పోలవరం పూర్తి చేసేందుకు, అమరావతి నిర్మాణం కోసమని, మా కలయిక.. తెలుగుభాషను కాపాడేందుకు, మా కలయిక.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసేందుకోసమని చంద్రబాబు పేర్కొన్నారు.
ఏపీ అభివృద్ధికి మోదీ భరోసా ఇచ్చారన్న చంద్రబాబు, రాష్ట్రానికి ఇక అన్నీ మంచి రోజులే అని పేర్కొన్నారు. కూటమిగా ఎందుకు ఏర్పడ్డామో మోదీ, అమిత్ షా చెప్పారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలని పవన్ చెప్పారు. గతంలో విశాఖ వచ్చినప్పుడు పవన్‌ను అడ్డుకున్నారు.పవన్‌ను అవమానించారు.. వ్యక్తిగత విమర్శలు చేశారు. నేను జైలులో ఉన్నప్పుడు పవన్ వచ్చి పరామర్శించారు. నిజ జీవితంలోనూ పవన్ కల్యాణ్ హీరోనే అని చంద్రబాబు వెల్లడిచారు.
ప్రధాని నరేంద్ర మోదీ విశ్వజీత్- దేశం దశ, దిశ మార్చారు : నారా లోకేశ్ - Nara Lokesh Praises PM Modi
ప్రజలు, రైతుల భూముల పత్రాలపై జగన్ ఫొటో ఎందుకని ప్రశ్నించారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా జగన్ పనైపోయిందని ఎద్దేవా చేశారు. మోదీ గ్యారంటీలు, మన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. కేంద్రం సాయంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. బాబాయిని ఎవరు చంపారో ఇంకా జగ్గూ భాయ్‌కు అర్థం కాలేదని ఎద్దేవా చేశారు.
గత ఎన్నికల్లో విశాఖలో నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించారని, ప్రస్తుతం విశాఖ వైసీపీకి దోపిడీకి అడ్డాగా మార్చారన్నారు. స్టిక్కర్ ముఖ్యమంత్రి, అసమర్థ ముఖ్యమంత్రి.. ఈ జగన్ అంటూ దుయ్యబట్టారు. మహిళలను గౌరవించిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. ఉద్యోగాలు కావాలంటే కూటమి రావాలన్నారు. జగన్.. జాబ్ క్యాలెండర్ పెట్టారా? అని ప్రశ్నించారు. మోదీ, నన్ను చూసి పెట్టుబడులు వస్తాయని, ఉద్యోగం వచ్చే వరకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ నేతలు ఉత్తరాంధ్ర ద్రోహులని విమర్శించారు. మనం అధికారంలో ఉంటే పోలవరం పూర్తి అయ్యేదన్నారు. పెంచిన పింఛన్‌ను ఏప్రిల్ నుంచే ఇస్తామని తెలిపారు. ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనమెంటని చంద్రబాబు ప్రశ్నించారు.
చంద్రబాబు హయాంలో అభివృద్ధిలో నెంబర్ వన్- జగన్ పాలనలో అప్పుల ఊబిలో రాష్ట్రం: మోదీ - PM MODI speech
ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనమెంటి?: చంద్రబాబు (Etv Bharat)