మరోసారి కలసికట్టుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రచారం-శ్రేణుల్లో ఉత్సాహం - Chandrababu and Pawan Campaign - CHANDRABABU AND PAWAN CAMPAIGN
Chandrababu and Pawan Kalyan Joint Election Campaign: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లు మరోసారి ఉమ్మడిగా ప్రచారం చేపట్టనున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో చంద్రబాబు - పవన్ కల్యాణ్ కలిసి ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 7, 2024, 5:15 PM IST
Chandrababu and Pawan Kalyan Joint Election Campaign:తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఉమ్మడిగా ప్రచారం చేయనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఈ నెల 10, 11వ తేదీల్లో జరిగే మూడో విడత ప్రజాగళంలో చంద్రబాబు- పవన్ కలిసి పాల్గొననున్నారు. 10న తణుకు, నిడదవోలు, 11వ తేదీన పి. గన్నవరం, అమలాపురంలో చంద్రబాబు, పవన్ కలిసి ఉమ్మడిగా ప్రచారం చేయనున్నట్లు ఇరు పార్టీల వర్గాల వెల్లడించాయి. ఈ నిర్ణయంతో రెండు పార్టీల శ్రేణుల్లో ఉత్తేజం కలుగుతోందని వారు అభిప్రాయం పడుతున్నారు.