CBI Raids at Sandhya Aqua Exports Industry : కాకినాడ జిల్లా యు. కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ పరిశ్రమలో సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటల సమయం నుంచి ఏడుగురు సీబీఐ అధికారుల బృందం వివిధ భాగాల్లో తనిఖీలు చేపట్టింది. ఇప్పటికే పరిశ్రమలో పని చేస్తున్న సిబ్బంది, కూలీల వివరాలు సేకరించారు. ల్యాబ్‌ను పరిశీలించి ఫోరెనిక్స్ బృందాన్ని పిలిపించారు. వైజాగ్ నుంచి ఫోరెనిక్స్ బృందం పరిశ్రమకు చేరుకుంది. ల్యాబ్‌లో ఉన్న వివిధ కెమికల్స్ శాంపిల్స్ సేకరిస్తున్నారు. వీటిని వైజాగ్ తరలించినట్లు సమాచారం.
దేశంలో డ్రగ్స్ ఎక్కడ దొరికినా మూలాలు ఏపీలోనే: విజయ్‌కుమార్ - TDP Vijay Kumar on Vizag Drugs Case
విశాఖలో కంటైనర్ లో మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం స్పందించింది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూనం హరి కృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది కొత్త ఫీడ్ ఫ్యాక్టరీ ప్రారంభించడంతో డ్రైడ్ ఈస్ట్ ముడి పదార్థం బ్రెజిల్ నుంచి ఆర్డర్ చేసినట్టు చెప్పారు. జనవరి 14న ఆర్డర్ చేస్తే ఈ నెల 16న సరకు కంటైనర్‌లో విశాఖ చేరుకుందని వెల్లడించారు. అదే రోజు సీబీఐకి అందిన మెయిల్ సమాచారం వల్ల 19న సీబీఐ బృందం విశాఖ వచ్చి సరుకు పరిశీలించారని చెప్పారు. అందులో మాదక ద్రవ్యాలు ఉన్నట్టు చెప్పి సరకును పరీక్షకు తీసుకుని వెళ్లారని వివరించారు. శుక్రవారం మరోసారి పరీక్షలు నిర్వహించనున్నారని హరికృష్ణ వెల్లడించారు. అసలు ఏం జరిగిందో తెలియదని, ఇది ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాదు అని స్పష్టం చేశారు. సీబీఐ విచారణకు తాము సహకరిస్తున్నట్టు సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) కూనం హరి కృష్ణ తెలిపారు.