BJP Kishan Reddy in Secunderabad Constituency : సిక్రిందాబాద్ నియోజకవర్గంలో వరుసగా రెండుసారి బీజేపీ జయకేతనం ఎగురవేసింది. పార్టీ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో వరుసగా మూడోసారి పార్టీ అభ్యర్థి విజయభేరీ మెగించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌ను ఓడించారు. 2014లో ఈ స్థానం నుంచి బండారు దత్తాత్రేయ గెలుపొందగా, 2019లో కిషన్ రెడ్డి విజయం సాధించారు. ఇప్పుడు రెండోసారి కిషన్ రెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
కిషన్ రెడ్డికి ఇక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్ తరఫున పద్మారావు గౌడ్, కిషన్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 6 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. ఖైరతాబాద్‌లో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో కిషన్ రెడ్డికి పోటీ తీవ్రంగా ఉంటుందని అంతా భావించారు కానీ కిషన్ రెడ్డి తన మార్క్ ప్రచారంతో సత్తా చాటారు.
ఓట్ల లెక్కింపు షురూ - మొదట సికింద్రాబాద్ చివర హైదరాబాద్ ఫలితం - telangana LOk sabha Results 2024
బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను ఏకం చేస్తూ : అధికారంలో ఉన్నాం ఇది కూడా మనకే వస్తుంది అనుకున్నారు కాంగ్రెస్ నేతలు. మొదట్లో బీజేపీకి ఇది సవాల్‌గా అనిపించినా మోదీ నినాదంతో ముందుకు కదిలారు. మరోసారి మోదీ పాలన అంటు సాగారు. కమలం నేతలు ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేశారు. బూత్‌స్థాయి నుంచి కార్యకర్తలను ఏకం చేస్తూ ప్రచారాన్ని సాగించారు. ఎటు వెళ్లినా మోదీ అభివృద్ధి, వారు అధికారంలోకి వస్తే చేసే కార్యక్రమాల గురించి వివరించారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ స్థానాన్ని గెలుచుకోలేదు. ఈసారి ఈ స్థానం గెలిచేందుకు స్థానిక నేత పద్మారావు గౌడ్‌ను బరిలో దింపింది.
మోదీ హ్యట్రిక్, రామమందిర నిర్మాణం :రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించింది. అందుకోసమే బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్‌ను రప్పించి ఆయనకు టికెట్ కట్టబెట్టింది. కార్పొరేటర్లు ఇతర నాయకులను హస్తం గూటికి వచ్చేలా రాజకీయం చేసింది. భాగ్యనగరంలో కాంగ్రెస్‌ను బలపరించింది. దీంతో ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేసింది. కానీ కమలానాథులు తమ మోదీ మంత్రం, ప్రచార వ్యూహంతో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చెక్ పెట్టారు. మోదీ హ్యట్రిక్ నినాదం, రామమందిర నిర్మాణంతో ప్రచారంలో సాగించి సికింద్రాబాద్ స్థానాన్ని కైవసం నిలబెట్టుకున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక లెక్కింపు ప్రారంభం - మధ్యాహ్నం 3 గంటలకు ఫలితం - Secunderabad Cantonment Result 2024
15 కేంద్రాలు - 240 టేబుళ్లు - 1000 మంది సిబ్బంది - జంట నగరాల్లో ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ - Hyderabad Lok Sabha Counting day