ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

లక్షకు 5లక్షలు-ఆంధ్రప్రదేశ్‌లో గెలుపుపై జోరుగా బెట్టింగ్స్, పవన్‌ కల్యాణ్‌ మెజారిటీపై రెండున్నర కోట్ల పందెం - Bettings on ap election

Bettings on ap election results 2024 : ఆంధ్రప్రదేశ్‌ ఫలితాలపై కోట్లలో బెట్టింగ్‌లు, ఈ పందేల కోసం కోకొల్లలుగా బెట్టింగ్‌ యాప్‌లు వెబ్‌సైట్లో దర్శనమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ తోపు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయ్, మ్యాజిక్ మార్క్‌ ఎవరు దాటుతారు? పిఠాపురం పాలకులెవరు? మంగళగిరి, పులివెందులలో గెలుపు గుర్రాలు ఎవరు? కడప ఎంపీ విజేత ఎవరు? ఎవరికి ఎంతెంత మెజారిటీ వస్తుంది?అన్నఅంశాలే ప్రాతిపదికగా లక్ష పందెం కాస్తే రూ.5లక్షల ఇచ్చేలా పందేలు వేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో గెలుపుపై జోరుగా బెట్టింగ్స్
ఆంధ్రప్రదేశ్‌లో గెలుపుపై జోరుగా బెట్టింగ్స్ (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 12:20 PM IST

Bettings on ap election: పందెం రాయుళ్లు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆరు కేటగిరీల్లో పందేలు కాస్తున్నారు. అభ్యర్థుల అనుచరులు, కీలక నేతలు, కార్యకర్తలు, ఆయా పార్టీల అభిమానులు పోలింగ్‌ ముగిసిన మరుక్షణం నుంచి ఇదే పనిలో తలమునకలైయ్యారు. ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు? గెలిచిన అభ్యర్థికి ఎంత ఆధిక్యం? కీలక నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తోంది? ఎక్కువ సీట్లుఎవరు సాధిస్తారు? ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుంది? అన్న అంశాలపై జోరుగా పందేలు సాగుతున్నాయి. కార్యకర్తల స్థాయిలో లక్షల్లో పందేలు వేస్తుంటే, నాయకుల స్థాయిలో కోట్లలో బెట్టింగ్‌ చేస్తున్నారు.

ఏపీ ఎన్నికలపై పందెంరాయుళ్ల చూపు - కూటమి వైపే మొగ్గు

కోడిపందేల తరహాలో బెట్టింగ్‌: ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలో ఎటు చూసినా బెట్టింగ్‌ చర్చలే నడుస్తున్నాయి. పందేలపై ఆసక్తి ఉన్నవాళ్లు వివిధ సర్వే సంస్థల అంచనాలు, లెక్కలను పరిగణనలోకి తీసుకుని బెట్టింగ్‌ యాప్‌ల్లో వాలిపోతున్నారు. కొంతమంది భూములను బెట్టింగ్‌ల్లో పెట్టడం గమనార్హం. రాష్ట్రంలో ఈసారి పోలింగ్‌ శాతం బాగా పెరగడంతో ఎక్కడ చూసినా ఇదే సీన్‌ కనిపిస్తోంది. సంక్రాంతి సమయంలో కోడిపందేల తరహాలో ఈ బెట్టింగ్స్‌ సాగుతున్నాయి. 1:5 రేసియోలో పందేలు వేస్తున్నారు.

ఏపీలో గెలిచేదెవరో తెలుసా?- భారీ పోలింగ్​ వెనుక కారణాలేంటి?

బెట్టింగ్‌ సీట్స్‌ ఇవే: జోరుగా పందేలు సాగుతున్న టాప్‌ 10 అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాలో మంగళగిరి, పిఠాపురం, గుడివాడ, గన్నవరం, ఉండి, ధర్మవరం, కాకినాడ సిటీ, రాజోలు, విజయవాడ తూర్పు, నగరి ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో నెల్లూరు రూరల్‌, దర్శి, చీరాల, గుంటూరు వెస్ట్, విజయవాడ సెంట్రల్‌, రాజానగరం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం ఈస్ట్, అవనిగడ్డ, మచిలీపట్నం, సత్తెనపల్లి, గురజాల, ఆళ్లగడ్డ, నందిగామ, మైలవరం, పోలవరం నియోజకవర్గాల్లో టీడీపీ-వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపోటములపై లక్షల రూపాయల పందేలు కాస్తున్నారు. పిఠాపురంలోపవన్‌ కల్యాణ్‌ 50 వేలకు పైగా మెజారిటీ సాధిస్తారని కాకినాడకు చెందిన ఒక వ్యాపారి రెండున్నర కోట్ల రూపాయలు దళారి వద్ద ఉంచినట్టు తెలుస్తోంది. ఉండి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు విజయంపై 1:2 లెక్కన బెట్టింగ్ సాగుతోంది. కుప్పంలో చంద్రబాబు మెజారిటీ తగ్గుతుందని ఒకరు పందెం పెడితే, గతంలో కంటే పెరుగుతుందని మరికొందరు బెట్టింగ్‌ కాస్తున్నారు. పులివెందులలో జగన్‌ మోహన్ రెడ్డి రికార్డు మెజారిటీలపై 1:3 చొప్పున పందేలు సాగుతున్నాయి.

గెలుపుపై జనసేన ధీమా - పవన్ మెజారిటీపై భారీ అంచనాలు

యాప్‌ల్లో ప్రత్యేక బెట్టింగ్‌: తెలుగుదేశం, వైఎస్సార్సీపీలకు వచ్చే సీట్లు, ఎంపీల సీట్లపైనే ప్రధానంగా పందేలు వేస్తున్నారు. ఐపీఎల్‌ నుంచి ఎన్నికల బెట్టింగ్‌లు ఉన్నాయి. మామూలుగా జరిగే పందేలతోపాటు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లే ఎక్కువగా నడుస్తున్నాయి. నేషనల్‌ ఎక్సేంజ్‌, సెవన్‌హిల్స్‌, కవర్స్‌, పొలిటికల్ బెట్టింగ్‌.కామ్‌, బుకీష్‌.కామ్‌ వంటి వెబ్‌సైట్లలో ఫంటర్లు ఆప్షన్లు ఇస్తున్నారు. భీమవరం ,కడప బెట్టింగ్ బ్యాచ్‌లు సొంతంగా సర్వేలు చేసుకుని వాటి ఆధారంగా సత్తా మార్కెట్‌లో ట్రెండ్స్ నడుపుతున్నాయి. బెట్టింగ్‌ యాప్స్‌ అన్నీ తెలుగుదేశం కూటమి మ్యాజిక్‌ మార్క్‌దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న అంచనాకు వచ్చాయి. తదనుగుణంగా కీలక నియోజకవర్గాలపై బెట్టింగ్స్‌ నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రిజల్ట్స్‌ కోసం ప్రత్యేకంగా కొన్ని యాప్‌లు సైతం ఆవిర్భవించాయి. తెలుగు బెట్టింగ్ యాప్స్‌ పేరిట గూగుల్‌లో దర్శనమిస్తున్నాయి.

రాష్ట్రంలో 81.76 శాతం పోలింగ్​ నమోదు - గతంలో కంటే పెరిగిన ఓటింగ్

దేశవ్యాప్తంగా ఉన్న బెట్టింగ్‌ యాపేల కాకుండా వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల్లో గ్రూపులు క్రియేట్‌ చేసి బెట్టింగ్‌ చేస్తున్నారు. మామూలుగా జరుగుతున్న బెట్టింగ్‌లు లక్షల నుంచి కోట్ల వరకు ఉండగా, యాప్‌ల్లో మాత్రం పైసల్లో చూపిస్తున్నారు. పోలీసుల చిక్కినా తమ బెట్టింగ్‌లు పైసల్లో ఉన్నాయని చెప్పుకోవడానికి వీలుగా ఈ విధంగా చేస్తున్నారని తెలుస్తోంది. వాస్తవ బెట్టింగ్‌ మాత్రం లక్షల్లో ఉంటోంది. ఈ బెట్టింగ్‌లు ఎవరిని కుబేరులను చేస్తాయో, ఎవరిని బిచ్చాధికారిని చేస్తాయో వచ్చే జూన్‌ 4న తేలిపోతుంది.

ఇవీ చదవండి: జూన్ 2తో ముగియనున్న ఉమ్మడి రాజధాని కాలపరిమితి

ఏపీ ఊపిరి పీల్చుకో - పల్నాడులో తీరం దాటిన రాజకీయ తుపాను !

ABOUT THE AUTHOR

...view details