BAC Meeting on Assembly Management:అసెంబ్లీ నిర్వహణ, చర్చ చేపట్టాల్సిన అంశాలపై బీఏసీ సమావేశంలో చర్చించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, బేజీపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. బీఏసీ సమావేశానికి వైఎస్సార్సీపీ గైర్హాజరైంది. ఈ దఫా అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలనేదానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
గవర్నర్ని అసెంబ్లీకి దొడ్డిదారిన తెచ్చినట్లుగా చుట్టూ తిప్పి వెనుక వైపు నుంచి తీసుకొచ్చే సంస్కృతికి చెక్ పెట్టి ఈ సమావేశాలకు రాజమార్గంలో ముందు వైపు నుంచి తీసుకొచ్చామని అయ్యన్నపాత్రుడు తెలిపారు. అసెంబ్లీకి రాజమార్గం ఉండాలనే గోడ కూల్చి గేట్2 తలుపులు తీశామన్నారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో సభాపతి అయ్యన్నపాత్రుడు మీడియాతో ముచ్చటించారు.
"హాయ్ రఘురామ- హలో జగన్"- అసెంబ్లీలో ఆసక్తికరంగా ఆ ఇద్దరి సంభాషణ - ys jagan raghu rama conversation
నలుగురు ప్యానల్ స్పీకర్లను పెట్టుకోమని సీఎం సూచించారని అయ్యన్న తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరకు జరుగుతాయని, 2 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని వెల్లడించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లుతో పాటు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లు కూడా ఉంటుందని తెలిపారు.
ప్రభుత్వం కొన్ని శ్వేత పత్రాలు ప్రవేశపెట్టనుందని అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
88మంది మొదటిసారి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఉన్నందున వచ్చే సమావేశాల్లోపు వారికి శిక్షణ ఇస్తామన్నారు. అశోక్ గజపతి రాజు, వెంకయ్యనాయుడు లాంటి వారితో పాటు లోక్సభ స్పీకర్ తదితరులతో శిక్షణ ఇప్పించనున్నట్లు అయ్యన్న చెప్పారు. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు 80శాతం మేర పూర్తయి ఉన్నందున, 6నెలల్లోగా వాటిని సభ్యులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించామన్నారు. 9నెలల్లో అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్పారని అయ్యన్నపాత్రుడు స్పష్టంచేశారు.
కాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభయ్యాయి. తొలుత గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం సభ వాయిదా పడింది. తర్వాత శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం ఏర్పాటు చేశారు. గవర్నర్ ప్రసంగంపై మంగళవారం చర్చ జరగనుంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, ఎక్సైజ్ విధానం, రాష్ట్ర అప్పులు-ఆర్థిక స్థితికి సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేయనుంది. వీటిపై సభ్యులు చర్చించే అవకాశముంది.
కూటమి భేటీలో ఆసక్తికరమైన చర్చ-కక్ష సాధింపు కోసం మనల్ని గెలిపించలేదన్న సీఎం - NDA alliance meeting