ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

బీజేపీ చేతుల్లో వైసీపీ - ప్రత్యేక హోదా మర్చిపోయిన జగన్: షర్మిల - షర్మిల

APCC President YS Sharmila : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) రాష్ట్రంలో తన తొలి పర్యటనను సిక్కోలులో ప్రారంభించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్​ పాలన, వైసీపీ నేతలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు.

sharmila_srikakulam_tour
sharmila_srikakulam_tour

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 3:21 PM IST

ఒక్క ఎమ్మెల్యే లేకున్నా బీజేపీ చేతుల్లో ఏపీ - ప్రత్యేక హోదా మర్చిపోయిన జగన్​ : షర్మిల

APCC President YS Sharmila: వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందో వైవీ సుబ్బారెడ్డి చెప్పాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సీఎం జగన్​ని జగన్ రెడ్డి గారూ అని తాను పిలవడమే వాళ్లకి (వైసీపీ నేతలు) నచ్చలేదని షర్మిల చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడాలని హితవు పలికారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆమె కంచిలి నుంచి ప్రజా ప్రస్థానం పైలాన్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అగిడి తెలుసుకున్నారు.

ఏపీలో కాంగ్రెస్​ ఉనికి లేదు - షర్మిల సోనియా పెంపుడు కూతురు : రాచమల్లు

శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఇచ్ఛాపురంలో ‘ప్రజా ప్రస్థానం’ విజయస్థూపాన్ని షర్మిల సందర్శించి నివాళులర్పించారు. అనంతరం స్థానిక నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్‌ తదితర పథకాలు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిర్వహించిన ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర నుంచి పుట్టినవేనని అన్నారు. వైఎస్‌ఆర్‌ పోరాటానికి కొనసాగింపుగా పేదల పక్షాన నిలబడేందుకే తాను వచ్చానన్నారు.

వైసీపీ, టీడీపీకి వేసే ప్రతి ఓటు బీజేపీకే పోతుంది - ఆ పార్టీల ఉచ్చులో పడొద్దు: షర్మిల

ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగించిన వైఎస్సార్ ప్రజల కష్టాలను చూసి ఒక్క అవకాశం అడిగారని షర్మిల గుర్తు చేశారు. సీఎం అయ్యాక 46 లక్షల మందికి పక్కా ఇళ్లు కట్టించారని తెలిపారు. రాష్ట్ర ప్రజల మేలు కోసం తాను కూడా ఇచ్ఛాపురం నుంచి ప్రస్థానం ప్రారంభించానని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. వైఎస్‌ఆర్‌కి కాంగ్రెస్‌ ఎంత బలమో ఆయనకీ కాంగ్రెస్‌ అంతే బలం అని పేర్కొన్నారు. రాజశేఖర్‌రెడ్డిని అవమానించిన పార్టీ అని కొందరు విమర్శల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ అంటే పార్టీ అధిష్ఠానానికి ఇప్పటికీ అభిమానం ఉందన్న విషయాన్ని స్వయంగా సోనియా గాంధీ తనకు చెప్పారని వెల్లడించారు.

పిల్ల కాంగ్రెస్ వదిలిన బాణం షర్మిల - ఆంధ్రా ప్రజలు తస్మాత్ జాగ్రత్త : దినకర్

వైఎస్సార్​ జీవించినంత కాలం బీజేపీకి వ్యతిరేకమేనని, కానీ, ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందని షర్మిల అన్నారు. బీజేపీకి ఇక్కడి పార్టీలు తొత్తులుగా మారాయని, ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ప్రభుత్వం వాళ్ల చేతుల్లో ఉందని ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వం కీలుబొమ్మలా మారిందని మండిపడ్డారు. 25 మంది ఎంపీలను ఇస్తే ‘హోదా’ తెస్తానన్న జగన్​ ఒక్క రోజు కూడా ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని ప్రశ్నించలేదని విమర్శించారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయితే మొదటి సంతకం ప్రత్యేక హోదా పైనే పెడతానని చెప్పాడని, రాష్ట్రం గురించి ఆలోచించే కాంగ్రెస్‌ పార్టీ, వైఎస్‌ఆర్‌ ఆశయాలను అందరం బతికిద్దాం అని షర్మిల కోరారు. ఈ సందర్భంగా తమను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ బెంతొరియా ప్రతినిధులు షర్మిలకు వినతిపత్రం అందజేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు మెళియాపుట్టిలో తమ సామాజిక వర్గం ఉన్నా కులం పరంగా ఎలాంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పార్టీ శ్రేణులు మంగళవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఘనంగా స్వాగతం పలికారు. ఇచ్చాపురం పర్యటనకు వెళ్తున్న ఆమెకు జాతీయ రహదారిపై తామరపల్లి గ్రామం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుప్పట్ల మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

బీజేపీ ప్రభుత్వం ప్రశాంతంగా ఒక యాత్ర కూడా చేయనివ్వదా !: షర్మిల

ABOUT THE AUTHOR

...view details