ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

దిల్లీలో దీక్షకు సిద్ధమైన షర్మిల - విభజన హామీలపై ప్రధాని మోదీకి లేఖ

APCC Chief YS Sharmila Reddy : కేంద్ర మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 17వ లోక్ సభ చివరి సమావేశాలు ఇవే కావడంతో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ పార్టీ పలు కార్యక్రమాలు రూపొందించింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరుతూ పీసీసీ చీఫ్ షర్మిల దిల్లీలో దీక్షకు సిద్ధమయ్యారు.

sharmila_letter_modi
sharmila_letter_modi

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 1, 2024, 3:56 PM IST

APCC Chief YS Sharmila Reddy : కేంద్ర మధ్యంతర బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో ఏపీసీసీ (APCC) చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం 2014, విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం బాగు, భవిత కోసం అంటూ నాటి కాంగ్రెస్ సర్కారు పొందుపరిచిన వాగ్దానాలను అమలుపరచాలని కోరారు. రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, అసంపూర్ణ వాగ్దానాలను పార్లమెంటు బడ్జెట్ సెషన్లోని రాష్ట్రపతి ఉపన్యాసంలో పొందుపర్చాలని, వాటిపై ఎన్నికల ముందే చర్యలు తీసుకోవాలని కోరారు. నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఒక చారిత్రక అవసరంగా గుర్తించిన కాంగ్రెస్ పార్టీ.. అటు ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కూడా ఎన్నో వాగ్దానాలను చట్టంలో పొందుపరిచిందని తెలిపారు.

"జగన్​ను నమ్మి ఓటేస్తే ఇచ్చిన హామీలన్నీ పక్కనపెట్టారు"

కానీ, పది సంవత్సరాల్లో ప్రజలను తీవ్ర నైరాశ్యంలోకి తోసేస్తూ, అటు కేంద్ర, ఇటు రాష్ట్ర సర్కారులు వాగ్దానాల అమలుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఈ రెండు అత్యంత ప్రముఖమైన వాగ్దానాలని ఉదహరించారు. సాక్షాతూ పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని ఇచ్చిన హామీని తదుపరి ప్రభుత్వాలు పట్టించుకోలేదని, దాంతో ఆంధ్ర ప్రదేశ్ కు అన్నిరంగాల్లో తీవ్ర నష్టం కలిగిందని తెలిపారు. దుగరాజపట్నం పోర్ట్ రాలేదని, వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ అమలు కాలేదని, విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ ఇంకా ఆచరణలోకి రాలేదని పేర్కొన్నారు. కలహండి-బలంగీర్, బుందేల్‌ఖండ్ తరహాలో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందని తెలిపారు. వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మాణం పెండింగ్​లో ఉందని వెల్లడించారు. కొత్త రాజధాని నిర్మాణానికి సపోర్ట్ చేయాల్సి ఉందని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించుకోవాలని కోరారు. ఆయా అంశాలని పార్లమెంట్​ బడ్జెట్ సమావేశాల్లోని రాష్ట్రపతి ఉపన్యాసంలో పొందుపరిచాలని ప్రధాని మోదీకి షర్మిల విజ్ఞప్తి చేశారు.

అన్నపై పోటీకి సిద్ధం! - సునీత కాంగ్రెస్​లో చేరేందుకు డేట్ ఫిక్స్​!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంతో పాటు విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరుతూ కేంద్రంపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఒత్తిడి పెంచనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాసిన షర్మిల దిల్లీలో శుక్రవారం దీక్ష చేపట్టనున్నారు. ఆమెతో పాటు రాష్ట్రానికి చెందిన పార్టీ సీనియర్‌ నేతలు దిల్లీ వెళ్లి సీపీఐ, సీపీఎం సహా జాతీయ పార్టీల నాయకుల్ని కలిసి దీక్షకు మద్దతు కోరనున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోం, ఆర్థిక శాఖల మంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌ అపాయింట్‌మెంట్‌ కోరినట్లు తెలిసింది. ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు బుధవారమే దిల్లీ చేరుకోగా, మాజీ మంత్రులు పల్లంరాజు సహా జేడీ శీలం, రఘువీరారెడ్డి, ఎన్‌.తులసిరెడ్డి తదితర సీనియర్‌ నేతలు దిల్లీ వెళ్లారు.

5 నుంచి రోడ్డు షోలు.. సభలు

దిల్లీలో దీక్ష ద్వారా ప్రజా మద్దతు కూడగట్టాలని భావిస్తోన్న షర్మిల తిరిగి వచ్చిన వెంటనే రోడ్​షోలు, సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 5 నుంచి 11 వరకు వివిధ జిల్లాల్లో నిర్వహించే రోడ్‌ షోలు, సభల్లో షర్మిల పాల్గొననుండగా 5న మడకశిరలో కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన బస్సులో 6న మాచర్ల, 7న బాపట్ల, 8న జంగారెడ్డిగూడెం, 9న తుని, 10న పాడేరు, 11న నగరిలో షర్మిల రోడ్డు షోలు నిర్వహించి ప్రసంగించనున్నారు.

ఫిబ్రవరి 5నుంచి వైఎస్‌ షర్మిల రాజీవ్ పల్లెబాట కార్యక్రమం : రఘువీరారెడ్డి

ABOUT THE AUTHOR

...view details