AP Assembly and Legislative Council Whips finalized:శాసనసభ, శాసన మండలి చీఫ్ విప్, విప్‌లను ప్రభుత్వం నియమించింది. అసెంబ్లీలో ఒక చీఫ్ విప్, 15మంది విప్‌లు ఉండనున్నారు. శాసనసభలో చీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులుకు మండలిలో చీఫ్ విప్‌గా పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు.
కష్టపడే వారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది:సీఎం చంద్రబాబు తనకు అప్పగించిన గురుతర బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తానని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ అంజనేయులు తెలిపారు. చీఫ్ విప్‌గా నియమించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. చీఫ్ విప్‌గా అసెంబ్లీ సజావుగా సాగేందుకు తన బాధ్యతలు నిర్వర్తిస్తానని అన్నారు. కష్టపడే వారికి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని మరోసారి రుజువైందని వెల్లడించారు. విప్‌లుగా బాధ్యతలు దక్కిన వారందరికీ తన అభినందనలు తెలిపారు. అందరం కలిసి కట్టుగా సమన్వయం చేసుకుంటూ చట్టసభల గౌరవం పెంచుతామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక లక్ష్యంగా కలిసి పనిచేస్తామన్నారు
శాసనసభలో విప్‌లు వీరే:
- బెందాళం అశోక్ - ఇచ్ఛాపురం (టీడీపీ)
- బొండా ఉమామహేశ్వరరావు - విజయవాడ సెంట్రల్ (టీడీపీ)
- దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) - ముమ్మిడివరం (టీడీపీ)
- దివ్య యనమల - తుని (టీడీపీ)
- వి.ఎం.థామస్- గంగాధర నెల్లూరు (ఎస్సీ) (టీడీపీ)
- జగదీశ్వరి తోయక - కురుపాం (ఎస్టీ) (టీడీపీ)
- కాలవ శ్రీనివాసులు- రాయదుర్గం (టీడీపీ)
- మాధవి రెడ్డప్పగారి - కడప (టీడీపీ)
- పీజీవీఆర్ నాయుడు(గణబాబు) - విశాఖ వెస్ట్(టీడీపీ)
- తంగిరాల సౌమ్య - నందిగామ (ఎస్సీ) (టీడీపీ)
- యార్లగడ్డ వెంకట్రావు - గన్నవరం (టీడీపీ)
- అరవ శ్రీధర్, కోడూరు - ఎస్సీ (జనసేన)
- బొమ్మిడి నారాయణ నాయకర్ - నరసాపురం (జనసేన)
- బొలిశెట్టి శ్రీనివాస్ - తాడేపల్లిగూడెం (జనసేన)
- ఆదినారాయణరెడ్డి - జమ్మలమడుగు (బీజేపీ)