AP Elections 2024 : ఇంటింటికీ రాజకీయ పార్టీల నేతల రాక, ప్రచార కాక, సభల హోరు, ర్యాలీల జోరు దాదాపు రెండు నెలల ఎన్నికల ప్రచారం ఊళ్లను ముంచెత్తిన సునామీని తలపించింది. నేతల మాటల తూటాలు, పరస్పర విమర్శనాస్త్రాలు, ఆరోపణల బాణాలు, మండుటెండల్లో వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ఐదేళ్లకోసారి వచ్చే రాజకీయ తుపాను ఈ సారి రాష్ట్రాన్ని బెంబేలెత్తించింది. పల్నాడు జిల్లాలో తీరం దాటిందా! అన్నట్లు ఆ జిల్లా వ్యాప్తంగా దాడులు, దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలు పోలీసులకూ చుక్కలు చూపించాయి.
జన జాతరను తలపించిన ఎన్నికలు చలికాలపు సంక్రాంతి ఎండాకాలంలో వచ్చినట్టు, రంజాన్, క్రిస్మస్ పండుగలన్నీ ఒక్క ముహూర్తానికే వచ్చాయా?! అన్నట్లు తండోపతండాలుగా తరలి వచ్చిన ప్రజలు. హైదరాబాద్ ఆంధ్రాకు వలస వెళ్లిందా అనిపించేలా విజయవాడ దాకా బారులు దీరిన వాహనాలు.
అర్ధరాత్రి వరకు పోలింగ్, చీకట్లో ఓటింగ్... ఇప్పటికీ లెక్కలు తేల్చే పనిలో అధికార గణం. భారీగా ఖర్చు చేసిన నల్లధనం, పంచిన మద్యం, ఎరవేసిన తాయిలాలు, ఎవరికెన్ని ఓట్లు పడ్డాయో? అంచనాల్లో రాజకీయ నేతలు. కోడి పందేలను మించిన బెట్టింగులు. కానీ, ఇది గుడివాడ కాదు గురూ! ఫలితం వచ్చాక చూడాలి మరి సత్తెనపల్లి శ్యాంబాబు నృత్యాలు!!
ఓటేసి హైదరాబాద్ బాట పట్టిన జనం -కిక్కిరిసిన మెట్రో, బస్సులు - Voters Returned To Hyderabad
ఎన్నికల పండుగ ముగిసింది. ఇక మిత్రులెవరో! శత్రువు లెవరో పదహారొద్దుల (జూన్ 4) పండగ నాటికి గానీ తేలదు. ఫలితం చూడాలనుకుంటే అప్పటి వరకూ ఆందోళన వద్దు. ఆయాస పడొద్దు. కాస్త విశ్రాంతినిస్తేనే కదా గుండె దడ తగ్గేది.