Andhra Pradesh Elections 2024 Voting Live Updates :
07:55PM
తంగెడలో దాడి ఘటనపై మా దృష్టికి వచ్చింది: సీఈవో
- ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది: సీఈవో
- ఓటర్లు పెద్దఎత్తున వచ్చి ఓటు వేశారు: సీఈవో
- సాయంత్రం 5 వరకు 68 శాతం పోలింగ్ జరిగింది: సీఈవో
- తుది పోలింగ్ వివరాలు పరిశీలించిన తర్వాత వెల్లడిస్తాం: సీఈవో
- రీపోల్‌కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు: సీఈవో
- రేపు ఫిర్యాదులపై ఆర్‌వోలు, పర్యవేక్షకులు సమీక్షిస్తారు: సీఈవో
- పార్టీల నాయకులతో ఆర్‌వోలు, పర్యవేక్షకులు సమీక్షిస్తారు: సీఈవో
- తంగెడలో దాడి ఘటనపై మా దృష్టికి వచ్చింది: సీఈవో
- తంగెడలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది: సీఈవో
- పోలింగ్ జాప్యం జరగడానికి అవకాశం లేదు: సీఈవో
- సాంకేతిక సమస్య వల్ల పోలింగ్ జాప్యం కావచ్చు: సీఈవో
7:40PM
600 వీవీ ప్యాట్‌లకు సంబంధించి సమస్యలు వచ్చాయి: సీఈవో
- ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది: సీఈవో
- ఓటర్లు పెద్దఎత్తున వచ్చి ఓటు వేశారు: సీఈవో
- సాయంత్రం 5 వరకు 68 శాతం పోలింగ్ జరిగింది: సీఈవో
- తుది పోలింగ్ వివరాలు పరిశీలించిన తర్వాత వెల్లడిస్తాం: సీఈవో
- పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు: సీఈవో
- ఈవీఎంలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయి: సీఈవో
- 275 బీయూలకు సంబంధించి సమస్యలు వచ్చాయి: సీఈవో
- 217 సీయూలకు సంబంధించి సమస్యలు వచ్చాయి: సీఈవో
- 600 వీవీ ప్యాట్‌లకు సంబంధించి సమస్యలు వచ్చాయి: సీఈవో
- పోలింగ్ కేంద్రాల వద్ద 20 వేల యంత్రాలు అధికంగా ఉంచాం: సీఈవో
- గుర్తింపు కార్డు లేకుండా పోలింగ్ కేంద్రాల వద్దకు తక్కువగా వచ్చారు: సీఈవో
- పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరుగుతాయని ముందే సమాచారం: సీఈవో
- అనంతపురం, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో హింసాత్మక ఘటనలపై సమాచారం: సీఈవో
- హింసాత్మక ఘటనలు జరిగే చోట్ల ఏర్పాట్లు చేశాం: సీఈవో
- పల్నాడు జిల్లాలో 12 ఘటనలపై సమాచారం అందింది: సీఈవో
- మాచర్ల కేంద్రంలో ఈవీఎం యంత్రాలు దెబ్బతిన్నాయి: సీఈవో
- ఇంజినీర్లు యంత్రాలు పరిశీలించి డేటా వస్తుందని చెప్పారు: సీఈవో
- మాచర్లలో 8 కేంద్రాల్లో యంత్రాలు మార్చి మళ్లీ పోలింగ్ నిర్వహించాం: సీఈవో
- కోడూరులో 2 ఈవీఎంలు దెబ్బతిన్నాయి: సీఈవో
- దర్శిలో 2 చోట్ల ఈవీఎంలు దెబ్బతిన్నాయి: సీఈవో
- మాచర్ల, తెనాలి ఘటనలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు: సీఈవో
- పలుచోట్ల సాయంత్రం 6 తర్వాత క్యూలో ఉన్నవారు ఓటు వేస్తున్నారు: సీఈవో
- 300 మందికిపైగా క్యూలో ఉన్న చోట్ల రాత్రి 10 వరకు పోలింగ్ జరగవచ్చు: సీఈవో
7.20PM
వైకాపా కార్యకర్తల బెదిరింపులు
- ప్రకాశం: వీరభద్రపురంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సుధాకర్‌బాబు బెదిరింపులు
- పోలింగ్ బూత్ వద్ద బెదిరింపులకు దిగిన చెవిరెడ్డి, సుధాకర్‌బాబు
- బెదిరింపుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఆర్‌వో శ్రీలేఖ
- ప్రకాశం: ఆర్‌వో శ్రీలేఖపైనా బెదిరింపులకు దిగిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
- ప్రకాశం: ఆర్‌వో శ్రీలేఖను దూషించిన వైకాపా కార్యకర్తలు
7.13PM
నాటు బాంబు దాడులు
- పల్నాడు: దాచేపల్లి మండలం తంగెడలో బాంబు దాడులు
- ఓటు విషయంలో పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా, తెదేపా వర్గీయుల ఘర్షణ
- నాటు బాంబులు, పెట్రోల్ సీసాలతో పరస్పర దాడులు
- తంగెడ వద్ద ఘర్షణలో రెవెన్యూ సిబ్బంది బైకు దగ్ధం
7.08PM
వర్షంలోనే కొనసాగుతున్న పోలింగ్
- నెల్లూరు: ఉదయగిరిలో వర్షంలోనే కొనసాగుతున్న పోలింగ్
- నెల్లూరు: ఉదయగిరిలో విద్యుత్ లేక ఓటర్ల ఇబ్బందులు
7.04PM
పోలింగ్ కేంద్రాల్లో కిటికీలు లేక ఊపిరాడక కింద పడిన మహిళలు
- నెల్లూరు: పోలింగ్ కేంద్రం వద్ద సొమ్మసిల్లిన ఏడుగురు మహిళలు
- ఆత్మకూరు పరిధి నెల్లూరుపాలెంలో సొమ్మసిల్లిన ఏడుగురు మహిళలు
- ఒకేచోట 2 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతో ఇరుకుగా మారిన మార్గం
- పోలింగ్ కేంద్రాల్లో కిటికీలు లేక ఊపిరాడక కింద పడిన మహిళలు
- సొమ్మసిల్లి పడిన మహిళలకు చికిత్స అందించిన వైద్యులు
7.00PM
ఓటు వేశాక వృద్ధురాలి మృతి
- అనకాపల్లి: గాంధీ గ్రామంలో ఓటు వేశాక వృద్ధురాలి మృతి
- అంకుపాలెం పాఠశాలలో ఓటు వేసిన నాగాయమ్మ (88)
- ఓటు వేసి బయటకు వచ్చాక సొమ్మసిల్లి పడి నాగాయమ్మ
6.51PM
పోలింగ్ కేంద్రం వద్దకు భారీగా చేరుకున్న వైకాపా, తెదేపా శ్రేణులు
- గుంటూరు తూర్పు పరిధి అంజుమన్ పాఠశాల వద్ద ఉద్రిక్తత
- పోలింగ్ కేంద్రం వద్దకు భారీగా చేరుకున్న వైకాపా, తెదేపా శ్రేణులు
- తెదేపా శ్రేణులపై కవ్వింపు చర్యలకు దిగిన వైకాపా కార్యకర్తలు
- పోలింగ్ కేంద్రానికి వచ్చిన వైకాపా అభ్యర్థి నూరి ఫాతిమా
- పోలింగ్ సమయం ముగిశాక ఎలా అనుమతిస్తారని తెదేపా శ్రేణుల ఆందోళన
6.42PM
దాడి
- చిత్తూరులో తెదేపా అభ్యర్థి జగన్మోహన్ అనుచరుడు పవన్‌పై రాడ్లతో దాడి
- పవన్‌పై దాడికి దిగిన వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డి అనుచరుల దాడి
- జగన్మోహన్ అనుచరుడు పవన్‌ను ప్రభుత్వాస్పత్రికి తరలింపు
6.32PM
తెదేపా శ్రేణుల ఆగ్రహం
- సత్తెనపల్లి: ముప్పాళ్లలో కన్నా లక్ష్మీనారాయణను అడ్డుకున్న వైకాపా శ్రేణులు
- సత్తెనపల్లి: వైకాపా శ్రేణుల దౌర్జన్యంపై తెదేపా శ్రేణుల ఆగ్రహం
- సత్తెనపల్లి: వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం
6.29PM
పోలింగ్ నిలిపివేత
- వినుకొండ: శావల్యాపురం మం. కారుమంచిలో అధికారుల నిర్వాకం
- వినుకొండ: పోలింగ్ బూత్ 136లో 200 ఓట్లు మిగిలి ఉన్నా పోలింగ్ నిలిపివేత
- వీవీ ప్యాట్లు అయిపోయాయని, ఛార్జింగ్ లేదని చెబుతున్న అధికారులు
దాడులు
- తూ.గో.: గోకవరం మం. కృష్ణునిపాలెంలో తెదేపా వర్గీయులపై దాడి
- తెదేపా వర్గీయులపై కర్రలు, రాళ్లతో దాడులకు దిగిన వైకాపా కార్యకర్తలు
- ఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
6.26PM
వైకాపా మూకల దాడి
- పల్నాడు జిల్లా: నకరికల్లు మం. కుంకలగుంటలో తెదేపా నాయకుడిపై దాడి
- కనుమూరి బాజి చౌదరిపై దాడి చేసిన వైకాపా మూకలు
- దాడిలో బాజిచౌదరి, ఆయన అన్న కుమారుడికి తీవ్రగాయాలు
తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి చేసిన వైకాపా మూకలు - పోలింగ్ కేంద్రం వద్ద విధ్వంసానికి పాల్పడిన వైకాపా నాయకులు
- గతంలోనూ పలుమార్లు బాజి చౌదరి లక్ష్యంగా వైకాపా శ్రేణుల దాడులు
- ఘటనాస్థలికి వెళ్లి బాజి చౌదరిని పరామర్శించిన కన్నా లక్ష్మీనారాయణ
- ఉద్రిక్తత
- కర్నూలు: పాణ్యం బీసీ కాలనీలో ఉద్రిక్తత
- పాణ్యం: తెదేపా ఏజెంట్‌పై చేయిచేసుకున్న ఎమ్మెల్యే కాటసాని కుమారుడు
- కాటసాని కుమారుడిపై కేసు పెట్టాలని గౌరు దంపతుల డిమాండ్
06:22PM
పోలింగ్ పూర్తయ్యాక విచారణ చేస్తాం: ఎస్పీ నయూమ్ అజ్మి
- పెనమలూరు: పోరంకి హైస్కూల్‌కు చేరుకున్న ఎస్పీ నయూమ్ అజ్మి
- పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది: ఎస్పీ నయూమ్ అజ్మి
- పోరంకిలో జరిగిన ఘర్షణపై విచారణ చేస్తాం: ఎస్పీ నయూమ్ అజ్మి
- పార్టీల తరఫున బాధ్యులపై కేసులు నమోదు చేస్తాం: ఎస్పీ నయూమ్ అజ్మి
- ఘర్షణలో పోలీసుల వైఫల్యం ఉంటే విచారణ జరుపుతాం: ఎస్పీ నయూమ్ అజ్మి
- పోలింగ్ పూర్తయ్యాక విచారణ చేస్తాం: ఎస్పీ నయూమ్ అజ్మి
దాడి
- సత్యసాయి: తలుపుల, గాండ్లపెంట మండలాల్లో తెదేపా వర్గీయులపై దాడి
- తెదేపా నాయకులు, కార్యకర్తలపై వైకాపా మూకల దాడి
- గాండ్లపెంట మం. రెక్కమానులులో తెదేపా సానుభూతిపరుడిపై దాడి
- కొండారెడ్డిపై వైకాపా నాయకులు ఖలీల్, ఈశ్వరమ్మ, గంగాధర్ దాడి
- తలుపుల మం. పెద్దన్నవారిపల్లెలో తెదేపా నాయకుడిపై దాడి
- విజయారెడ్డిపై వైకాపా నాయకుడు శ్రీనివాసరెడ్డి వర్గీయుల దాడి
- విజయారెడ్డి కారు అద్దాలు ధ్వంసం చేసిన వైకాపా శ్రేణులు
06:18PM
తెదేపా ఆఫీసుపై దాడి చేసిన వైకాపా శ్రేణులు
- పల్నాడు: నరసరావుపేట తెదేపా కార్యాలయం వద్ద లాఠీఛార్జ్
- నరసరావుపేట: తెదేపా శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
- నరసరావుపేట: మధ్యాహ్నం తెదేపా ఆఫీసుపై దాడి చేసిన వైకాపా శ్రేణులు
- వైకాపా దాడితో పార్టీ ఆఫీసు వద్ద రక్షణగా ఉన్న తెదేపా శ్రేణులు
- నరసరావుపేట: తెదేపా శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
- గుంటూరు లిటిల్ ఫ్లవర్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ
- ఓటర్లను గేట్ వద్ద నిలిపివేయడంపై ఎంపీ అభ్యర్థి పెమ్మసాని అభ్యంతరం
- లిటిల్ ఫ్లవర్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం
- గుంటూరు: ఇరు వర్గాలపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులు
- కాలువలో పడిన తెదేపా కార్యకర్తకు తలకు తీవ్రగాయం
కర్రలు, రాళ్లతో వైకాపా శ్రేణుల దాడులు
- పల్నాడు జిల్లా: దాచేపల్లి మం. ఇరికేపల్లి, నడికుడిలో ఘర్షణ
- ఇరికేపల్లికి వచ్చి ఘర్షణపడిన నడికుడికి చెందిన వైకాపా నేతలు
- తెదేపా కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో వైకాపా శ్రేణుల దాడులు
- పల్నాడు: వైకాపా నేతల దాడిలో ధ్వంసమైన ద్విచక్రవాహనాలు
- ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
పోలింగ్ కేంద్రంలోపల దాక్కున్న ఓటర్లు
- పల్నాడు జిల్లా: నకరికల్లు మం. చీమలమర్రిలో వైకాపా మూకల అరాచకం
- పోలింగ్ కేంద్రంపై దాడి చేసిన అంబటి రాంబాబు అనుచరులు
- తెదేపా సానుభూతిపరులపై దాడికి పాల్పడిన వైకాపా శ్రేణులు
- 20 మంది తెదేపా కార్యకర్తలకు గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
- పల్నాడు జిల్లా: పోలింగ్ కేంద్రంలోపల దాక్కున్న ఓటర్లు
06:00 PM
ముగిసిన పోలింగ్
- రాష్ట్రవ్యాప్తంగా ముగిసిన పోలింగ్ సమయం
- రాష్ట్రంలో అనేక పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
- సాయంత్రం 6 వరకు క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం
- అనేక కేంద్రాల్లో రాత్రి వరకు కొనసాగనున్న పోలింగ్
- గ్రామీణంతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున పోలింగ్
- రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 వరకు 67.99 శాతం పోలింగ్
- అసెంబ్లీ స్థానాల్లో సా.5 వరకు అత్యధికంగా జీడీ నెల్లూరులో 79.90 శాతం పోలింగ్
- అసెంబ్లీ స్థానాల్లో సా.5 వరకు అత్యల్పంగా కురుపాంలో 52 శాతం పోలింగ్
- లోక్‌సభ స్థానాల్లో సా.5 వరకు అత్యధికంగా చిత్తూరులో 75.60 శాతం పోలింగ్
- లోక్‌సభ స్థానాల్లో సా.5 వరకు అత్యల్పంగా అరకులో 58.20 శాతం పోలింగ్
లోక్‌సభ స్థానాల వారీగా సాయంత్రం 5 వరకు పోలింగ్
- లోక్‌సభ స్థానాల వారీగా సాయంత్రం 5 వరకు పోలింగ్
- అమలాపురం 73.55
- అనకాపల్లి 64.14
- అనంతపురం 67.71
- అరకు 58.20
- బాపట్ల 72.57
- చిత్తూరు 75.60
- ఏలూరు 71.10
- గుంటూరు 65.58
- హిందూపురం 66.89
- కడప 72.85
- కాకినాడ 65.01
- కర్నూలు 64.08
- మచిలీపట్నం 73.53
- నంద్యాల 70.58
- నరసాపురం 68.98
- నరసరావుపేట 69.10
- నెల్లూరు 69.55
- ఒంగోలు 70.44
- రాజమహేంద్రవరం 67.93
- రాజంపేట 68.47
- శ్రీకాకుళం 67.10
- తిరుపతి 65.91
- విజయవాడ 67.44
- విశాఖ 59.39
- విజయనగరం 67.74
జిల్లాల వారీగా సాయంత్రం 5 వరకు పోలింగ్
- రాష్ట్రంలో సాయంత్రం 5 వరకు 67.99 శాతం పోలింగ్
- జిల్లాల వారీగా సాయంత్రం 5 వరకు పోలింగ్
- అల్లూరి 55.17
- అనకాపల్లి 65.97
- అనంతపురం 68.04
- అన్నమయ్య 67.63
- బాపట్ల 72.14
- చిత్తూరు 74.06
- కోనసీమ 73.55
- తూ.గో. 67.93
- ఏలూరు 71.10
- గుంటూరు 65.58
- కాకినాడ 65.01
- కృష్ణా 73.53
- కర్నూలు 64.55
- నంద్యాల 71.43
- ఎన్టీఆర్ జిల్లా 67.44
- పల్నాడు జిల్లా 69.10
- పార్వతీపురం మన్యం జిల్లా 61.18
- ప్రకాశం 71
- నెల్లూరు 69.95
- సత్యసాయి 67.16
- శ్రీకాకుళం 67.48
- తిరుపతి 65.88
- విశాఖ 57.42
- విజయనగరం 68.16
- ప.గో. 68.98
- వైఎస్‌ఆర్ జిల్లా 72.85
ఇబ్బందులుపడుతున్న ఓటర్లు
- రాష్ట్రవ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాల్లో బారులుతీరిన ఓటర్లు
- మంచినీటి సౌకర్యం కూడా కల్పించని పోలింగ్ అధికారులు
- కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులుపడుతున్న ఓటర్లు
5.30PM
రాష్ట్రంలో సాయంత్రం 5 వరకు 67.99 శాతం పోలింగ్
5.25PM
యార్లగడ్డ వెంకట్రావు కారు అద్దాలు ధ్వంసం చేసిన వంశీ అనుచరులు
- కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలులో వివాదం
- తెదేపా అభ్యర్థి యార్లగడ్డ కారుపై వైకాపా అభ్యర్థి వంశీమోహన్ అనుచరుల దాడి
- యార్లగడ్డ వెంకట్రావు కారు అద్దాలు ధ్వంసం చేసిన వంశీ అనుచరులు
5.24PM
- తాడిపత్రిలో అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి పర్యటన
- అనంతపురం ఎస్పీ, డీఐజీ వేర్వేరుగా పోలింగ్ బూత్‌ల పర్యవేక్షణ
- ఎస్పీ అమిత్ బర్దర్, డీఐజీ షిమోషి మొబైల్ టీమ్‌లుగా ఏర్పడి పర్యవేక్షణ
- జేసీ ప్రభాకర్‌రెడ్డి, వైకాపా అభ్యర్థి పెద్దారెడ్డికి షాడో టీమ్‌లను ఏర్పాటు చేసిన డీఐజీ
తెదేపా, వైకాపా నేతల ఘర్షణ
- పెనమలూరు: పోరంకి హైస్కూల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
- బోడె ప్రసాద్, ఆయన వర్గీయులపై జోగి రమేష్ వర్గీయుల రాళ్ల దాడి
- పెనమలూరు: లాఠీఛార్జ్ చేస్తూ అదుపు చేస్తోన్న పోలీసులు
- కృష్ణా: పెడన పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా, వైకాపా నేతల ఘర్షణ
- వైకాపా నేతలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని తెదేపా నేతల ఆగ్రహం
ఉద్రిక్తత
- పల్నాడు జిల్లా: నరసరావుపేట పట్టణంలో ఉద్రిక్తత
- నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా శ్రేణుల హల్‌చల్
- మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద చదలవాడ కారుపై వైకాపా శ్రేణుల దాడి
- పలువురు ఓటర్లపై దాడి చేసిన వైకాపా మూకలు
- భయాందోళనకు గురై పరుగులు తీసిన ఓటర్లు
- నరసరావుపేట: పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీఛార్జ్
- తెదేపా కార్యాలయంపై దాడికి యత్నించిన వైకాపా శ్రేణులు
- వైకాపా దాడిని తిప్పికొట్టిన తెదేపా శ్రేణులు
మహిళా ఓటర్లు, మహిళా నేతలపై దాడులు దుర్మార్గం: చంద్రబాబు
- వైకాపా ఓటమి భయంతో దాడులకు తెగబడుతోంది: చంద్రబాబు
- అరాచకాలను నమ్ముకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు: చంద్రబాబు
- ప్రతి ఒక్కరూ ఓటేసేలా చర్యలు తీసుకోవాలి: చంద్రబాబు
- ప్రజల తిరుగుబాటుతో వైకాపా నేతలు ఫ్రస్టేషన్‌లో ఉన్నారు: చంద్రబాబు
- మహిళా ఓటర్లు, మహిళా నేతలపై దాడులు దుర్మార్గం: చంద్రబాబు
- కూటమి నేతలు, మీడియా, పోలీసులపైనా దాడులు: చంద్రబాబు
- మాచర్లలో బ్రహ్మారెడ్డిపై వైకాపా రౌడీలు దాడి చేశారు: చంద్రబాబు
- నరసరావుపేటలో కృష్ణదేవరాయలపై దాడిచేసి కార్లు ధ్వంసం చేశారు: చంద్రబాబు
- తాడిపత్రిలో తెదేపా నేతలపై పెద్దారెడ్డి, ఆయన కుమారుడు దాడి: చంద్రబాబు
- గుంటూరులో రోశయ్య మహిళలను కారుతో తొక్కించేందుకు యత్నించారు: చంద్రబాబు
- చీరాలలో యం.యం.కొండయ్యపై దాడికి పాల్పడ్డారు: చంద్రబాబు
- శ్రీకాకుళంలో గొండు శంకర్‌పై పోలింగ్ బూత్ వద్దే దాడి: చంద్రబాబు
- తిరువూరులో కేశినేని చిన్ని బృందంపై దాడి చేసి, కార్లు ధ్వంసం: చంద్రబాబు
- తెనాలిలో ఓటరుపై అన్నాబత్తుని , కుమారుడు దాడి చేశారు: చంద్రబాబు
05:15PM
తెదేపా నేతల ఆగ్రహం
- పెనమలూరు: పోరంకి హైస్కూల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
- బోడె ప్రసాద్, ఆయన వర్గీయులపై జోగి రమేష్ వర్గీయుల రాళ్ల దాడి
- పెనమలూరు: లాఠీఛార్జ్ చేస్తూ అదుపు చేస్తోన్న పోలీసులు
- కృష్ణా: పెడన పొలింగ్ కేంద్రం వద్ద తెదేపా, వైకాపా నేతల ఘర్షణ
- వైకాపా నేతలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని తెదేపా నేతల ఆగ్రహాం
4.57PM
భయాందోళనకు గురై పరుగులు తీసిన ఓటర్లు
- పల్నాడు జిల్లా: నరసరావుపేట పట్టణంలో ఉద్రిక్తత
- నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా శ్రేణుల హల్‌చల్
- మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద చదలవాడ కారుపై వైకాపా శ్రేణుల దాడి
- పలువురు ఓటర్లపై దాడి చేసిన వైకాపా మూకలు
- భయాందోళనకు గురై పరుగులు తీసిన ఓటర్లు
- పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీఛార్జ్
- అనంతరం తెదేపా కార్యాలయంపై దాడికి యత్నించిన వైకాపా శ్రేణులు
- వైకాపా దాడిని తిప్పికొట్టిన తెదేపా శ్రేణులు
4.53PM
అరాచకాలను నమ్ముకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు: చంద్రబాబు
- వైకాపా ఓటమి భయంతో దాడులకు తెగబడుతోంది: చంద్రబాబు
- అరాచకాలను నమ్ముకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు: చంద్రబాబు
రాళ్ల దాడి
- తాడిపత్రి: పెదపప్పూరు మం. వరదాయపల్లిలో తెదేపా వర్గీయులపై రాళ్ల దాడి
- తాడిపత్రి: తెదేపా వర్గీయులపై వైకాపా మూకల రాళ్ల దాడి
- మద్యంతాగి వచ్చిన వైకాపా ఏజెంట్లును నిలదీసిన తెదేపా నేతలు
- తమను ప్రశ్నిస్తారంటూ తెదేపా నేతలపై వైకాపా మూకలు రాళ్ల దాడి
4.45PM
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గృహనిర్బంధం
- పల్నాడు: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గృహనిర్బంధం
- మాచర్ల: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం
- మాచర్ల: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసుల చర్యలు
- పెనమలూరు నియోజవర్గంలో పేట్రేగుతున్న వైకాపా శ్రేణులు
- పోరంకి, కానూరు, తాడిగడప పోలింగ్ కేంద్రాల్లో జోగి రమేష్ అనుచరుల మోహరింపు
- దొంగ ఓట్లు వేసేందుకు పెనమలూరులోని పోలింగ్ కేంద్రాలకు జోగి అనుచరులు
- ఇబ్రహీంపట్నం, పెడన నుంచి దొంగ ఓట్లు వేసేందుకు వస్తోన్న జోగి అనుచరులు
- భారీగా పెనమలూరు నియోజకవర్గంలోని వివిధ పోలింగ్ కేంద్రాలకు జోగి అనుచరులు
- పోరంకిలో దొంగ ఓట్లు వేసేవారిని అడ్డుకున్న బోడె ప్రసాద్ అనుచరులు
- కానూరులోనూ దొంగ ఓట్లు వేసేవారిని అడ్డుకున్న తెలుగుదేశం శ్రేణులు
- దొంగ ఓట్లు వేస్తున్నా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు
- ఇరువర్గాల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు
- ఘటనాస్థలానికి చేరుకున్న బోడె ప్రసాద్, జోగి రమేష్
- పెద్ద ఎత్తున ఇరు పార్టీల శ్రేణులు మోహరింపు
- పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బోడె అనుచరుల మండిపాటు
4.38PM
నిలిచిన పోలింగ్
- పల్నాడు జిల్లా: బొల్లాపల్లి మం. రేమిడిచర్లలో రెండు గంటలుగా నిలిచిన పోలింగ్
- పోలింగ్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న వైకాపా కార్యకర్తలు
- వంద మందికి పైగా వైకాపా మూకలు రావడంతో చేతులెత్తేసిన పోలీసులు
- పల్నాడు జిల్లా: పోలింగ్ కేంద్రాన్ని వదిలి వెళ్లిపోయిన పోలీసులు
- పోలింగ్ కేంద్రంలో బిక్కుబిక్కుమంటూ సాయం కోసం పోలింగ్ సిబ్బంది ఎదురు చూపులు
నత్తనడకన పోలింగ్
- ప్రత్తిపాడు పరిధి పల్లపాడు పోలింగ్ బూత్ 152లో నత్తనడకన పోలింగ్
- ఉదయం నుంచి పల్లపాడులో క్యూలైన్లలో బారులు తీరిన వృద్ధులు, దివ్యాంగులు
- పోలింగ్ అధికారి అత్యంత నిదానంగా విధులు నిర్వర్తించడంపై గ్రామస్థుల ఆగ్రహం
- ఓపిక లేకపోయినా ఓటేసేందుకు అలాగే నిలబడి నిరీక్షిస్తున్న సీనియర్ సిటిజన్లు
- పోలింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగించాలని ఈసీని కోరుతున్న పల్లపాడు ప్రజలు
- ఇంకా క్యూలో నిలబడి ఉన్న 250 మందికి పైగా గ్రామస్థులు
- ఇదే గ్రామంలోని 153 పోలింగ్ బూత్‌లో త్వరగా సాగుతున్న పోలింగ్
6 వరకు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం
- రాష్ట్రంలో ముమ్మరంగా కొనసాగుతున్న పోలింగ్
- రాష్ట్రంలో సాయంత్రం 6 గం.కు ముగియనున్న పోలింగ్
- సాయంత్రం 6 వరకు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం
ఏపీలో నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా చూడాలని కోరిన భాజపా
- రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై ఈసీకి ఫిర్యాదు చేసిన భాజపా
- వైకాపా ఆధ్వర్యంలో ఏపీ ఎన్నికల్లో హింస జరుగుతోందని ఫిర్యాదు
- ప్రజాస్వామ్యాన్ని కాలరాసేందుకు వైకాపా కుట్ర చేస్తోందని ఫిర్యాదు
- వైకాపా చర్యలతో చాలామంది ఓటు వేయకుండానే వెళ్లిపోయారని ఫిర్యాదు
- అరాచకాలతో ఎన్నికల్లో గెలవాలని వైకాపా భావిస్తున్నట్లు స్పష్టమవుతోందన్న భాజపా
- హింసాత్మక ఘటనలతో ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారన్న భాజపా
- మాచర్లలో ఎన్డీఏ నేత హత్యకు గురైనా పోలీసులు పట్టించుకోలేదన్న భాజపా
- ఏపీలో నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా చూడాలని కోరిన భాజపా
04:28PM
ఓటు వేసే అవకాశం
సాయంత్రం 6 వరకు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం
లా అండ్ ఆర్డర్, బెటాలియన్ పోలీసుల మధ్య వాగ్వాదం
- మంగళగిరిలో ఆరో బెటాలియన్ పోలీసుల ఆందోళన
- ఆర్‌వో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన ఆరో బెటాలియన్ పోలీసులు
- పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని పోలీసుల డిమాండ్
- ఎన్నికల విధులకు వెళ్లి ఇవాళ మహారాష్ట్ర నుంచి వచ్చిన పోలీసులు
- మహారాష్ట్రలో విధులకు వెళ్లి వచ్చాక పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తామని గతంలో చెప్పిన అధికారులు
- తహశీల్దార్‌తో వాగ్వాదానికి దిగిన 143 మంది ఆరో బెటాలియన్ పోలీసులు
- లా అండ్ ఆర్డర్, బెటాలియన్ పోలీసుల మధ్య వాగ్వాదం
- తమకు ఓటు హక్కు కల్పించాలని పోలీసుల డిమాండ్
04:20PM
పలుచోట్ల పోలింగ్ నిలిపివేయడంపై తెదేపా ఆందోళన
- కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు
- కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన తెదేపా అధినేత చంద్రబాబు
- చంద్రబాబు రాసిన లేఖను ఈసీ అధికారులకు అందించిన కనకమేడల
- చంద్రబాబు లేఖతో పాటు మరో 11 ఫిర్యాదులు ఈసీకి ఇచ్చిన కనకమేడల
- రాష్ట్రంలో 120కి పైగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదు
- అన్ని చోట్లా వైకాపా నేతలు హింసకు పాల్పడినట్లు ఫిర్యాదు
- తెదేపా శ్రేణులపై దాడి చేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఫిర్యాదు
- పోలీసులు వైకాపా కార్యకర్తలకు సహకరిస్తున్నారని ఫిర్యాదు చేసిన తెదేపా
- కోడ్ ఉల్లంఘించిన వైకాపా నాయకులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
- తెనాలి, తాడిపత్రి, నరసరావుపేట వైకాపా అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
- పల్నాడు, తాడిపత్రి, పులివెందుల, ఇతరచోట్ల హింసాత్మక ఘటనలపై ఫిర్యాదు
- ఎన్నికల వేళ శాంతిభద్రతలు విఫలమయ్యాయని ఈసీ దృష్టికి తెచ్చిన కనకమేడల
- పలుచోట్ల పోలింగ్ నిలిపివేయడంపై తెదేపా ఆందోళన
- హింసాత్మక ఘటనలు జరిగిన చోట మరోసారి పోలింగ్ చేపట్టాలని కోరిన తెదేపా
04:00PM
మూడుచోట్ల ముగిసిన పోలింగ్
- అరకు, పాడేరు, రంపచోడవరంలో ముగిసిన పోలింగ్
- సాయంత్రం 4లోపు క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం
- 169 నియోజకర్గాల్లో సాయంత్రం 6 వరకు పోలింగ్
03:40 PM
పోలింగ్ శాతం
దాడి 3.53PM లక్ష్మీప్రసాద్
- అనంతపురం: కుందుర్పి మం. బెస్తరపల్లిలో తెదేపా అభ్యర్థిపై దాడి
- తెదేపా అభ్యర్థి సురేంద్రబాబు అల్లుడు ధర్మతేజపై వైకాపా మూకల తాడి
- కారు అద్దాలు ధ్వంసం చేసిన వైకాపా మూకలు
03:40 PM
పోలింగ్ శాతం
- రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా పోలింగ్
- రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 3 వరకు 55.49 శాతం పోలింగ్
- అసెంబ్లీ స్థానాల్లో మ.3 వరకు అత్యధికంగా ఒంగోలులో 69.05 శాతం పోలింగ్
- అసెంబ్లీ స్థానాల్లో మ.3 వరకు అత్యల్పంగా విశాఖ నార్త్‌లో 40 శాతం పోలింగ్
- లోక్‌సభ స్థానాల్లో మ.3 వరకు అత్యధికంగా చిత్తూరులో 61.43 శాతం పోలింగ్
- లోక్‌సభ స్థానాల్లో మ.3 వరకు అత్యల్పంగా విశాఖలో 47.66 శాతం పోలింగ్
- మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు అదే జోరు
- వేల సంఖ్యలో ఓటర్లతో పోలింగ్ బూత్‌లు కిటకిట
- ఉత్సాహంగా ఓటు వేయడానికి వస్తున్న అన్ని వర్గాల ప్రజలు
- గ్రామీణంతో పాటు ఈసారి పట్టణ ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున పోలింగ్
- మాచర్ల, పుంగనూరు వంటి చోట్ల దాడులు జరిగినా పోలింగ్‌పై కనిపించని ప్రభావం
- తెనాలిలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం
- వర్షం సైతం లెక్కచేయకుండా ఓటు వేసేందుకు వస్తోన్న ఓటర్లు
03:29 PM
కారు ధ్వంసం
- పల్నాడు జిల్లా: తెదేపా అభ్యర్థి చదలవాడ అరవింద బాబు కారుపై దాడి
- నరసరావుపేట హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా మూకల దాడి
- వైకాపా నేత వరవకట్ట బాబు ఆధ్వర్యంలో దాడికి పాల్పడిన రౌడీ మూకలు
- వైకాపా మూకల దాడిలో అరవిందబాబు కారు ధ్వంసం
విడదల రజిని ప్రచారం
- గుంటూరు: ఓటర్లను ప్రభావితం చేసేలా వైకాపా అభ్యర్థి విడదల రజిని ప్రచారం
- ఐవీఆర్ కాలింగ్, వాట్సప్‌లలో ఓటర్లకు ఫోన్లు
- ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తున్నా పట్టించుకోని యంత్రాంగం
03:23 PM
- సత్యసాయి జిల్లా: రిగ్గింగ్ జరిగిన ప్రాంతానికి వెళ్లిన తెదేపా నేతలు
- నల్లమాడ మం. నల్లసింగయ్యగారిపల్లి వెళ్లిన తెదేపా నేతలు
- రిగ్గింగ్ జరిగిన పోలింగ్ బూత్ వద్దకు వెళ్లిన తెదేపా అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి
- రిగ్గింగ్ జరిగిన పోలింగ్ బూత్ వద్దకు వెళ్లిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి
- తెదేపా అభ్యర్థి సింధూరరెడ్డిపై దాడికి యత్నించిన వైకాపా మూకలు
- తమ ఎమ్మెల్యే అభ్యర్థి స్వగ్రామానికి మీరెలా వస్తారంటూ దాడికి యత్నం
- వైకాపా మూకల దాడిని అడ్డుకున్న పల్లె రఘునాథరెడ్డి, అనుచరులు
- సింధూరరెడ్డి, రఘునాథరెడ్డిని వైకాపా దాడి నుంచి తప్పించిన భద్రతా సిబ్బంది
- సింధూరరెడ్డి, రఘునాథరెడ్డిని వాహనంలో పంపించిన భద్రతా సిబ్బంది
03:13 PM
సీఆర్‌పీఎఫ్ బలగాల భద్రత మధ్య కొనసాగుతున్న పోలింగ్
- తిరుపతి: రామచంద్రాపురం మం. బ్రాహ్మణకాలువలో ఉద్రిక్తత
- దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వైకాపా కార్యకర్తలను అడ్డుకున్న తెదేపా శ్రేణులు
- తెదేపా శ్రేణులపై దాడి చేసిన వైకాపా కార్యకర్తలు
- పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు
- ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
- సీఆర్‌పీఎఫ్ బలగాల భద్రత మధ్య కొనసాగుతున్న పోలింగ్
రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 2 వరకు 50 శాతం పోలింగ్
- రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా పోలింగ్
- రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 2 వరకు 50 శాతం పోలింగ్
- మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు అదే జోరు
- వేల సంఖ్యలో ఓటర్లతో పోలింగ్ బూత్‌లు కిటకిట
- ఉత్సాహంగా ఓటు వేయడానికి వస్తున్న అన్ని వర్గాల ప్రజలు
- గ్రామీణంతో పాటు ఈసారి పట్టణ ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున పోలింగ్
- మాచర్ల, పుంగనూరు వంటి చోట్ల దాడులు జరిగినా పోలింగ్‌పై కనిపించని ప్రభావం
- తెనాలిలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం
- వర్షం సైతం లెక్కచేయకుండా ఓటు వేసేందుకు వస్తోన్న ఓటర్లు
03:03 PM
ఎన్నికల సంఘం ఆగ్రహం
- ఓటరును కొట్టిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యేను తిరిగి కొట్టిన ఓటర్
- తెనాలి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్‌పై ఎన్నికల సంఘం ఆగ్రహం
- గుంటూరు: శివకుమార్‌ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశం
- పోలింగ్ పూర్తయ్యే వరకూ శివకుమార్‍ను గృహ నిర్భంధంలో ఉంచాలని ఆదేశాలు
02:53 PM
- రాష్ట్రంలో కొనసాగుతున్న పోలింగ్
- ఎండలను సైతం లెక్కచేయకుండా బారులు తీరిన ఓటర్లు
- ఎంత ఆలస్యమైనా ఓటు వేశాకే వెళ్తామంటున్న ఓటర్లు
చంద్రబాబు ట్వీట్
- పోలింగ్ రోజున వైకాపా హింస బాగా పెరిగింది: చంద్రబాబు
- పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయింది: చంద్రబాబు
- తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనంపైనే దాడి చేశారు: చంద్రబాబు
- తెదేపా అభ్యర్థిపైనే దాడికి దిగడం హింసా రాజకీయాలకు పరాకాష్ఠ: చంద్రబాబు
- ప్రజలంతా నిర్భయంగా తరలివచ్చి ఓటు వేయాలి: చంద్రబాబు
- అత్యధిక ఓటు శాతంతో హింసా రాజకీయాలకు ముగింపు పలకాలి: చంద్రబాబు
ఆందోళన
- మాచర్ల: రెంటచింతల మండలం తాళవాయి గేటు వద్ద ఉద్రిక్తత
- ఎమ్మెల్యే పిన్నెల్లి కాన్వాయ్‌లోని కారు అద్దాలు పగలగొట్టిన తెదేపా కార్యకర్తలు
తెదేపా ఫిర్యాదు దిల్లీ అరుణ్
- తాడిపత్రి, పులివెందుల, ఇతరచోట్ల హింసాత్మక ఘటనలపై ఈసీకి తెదేపా ఫిర్యాదు
- ఎన్నికల వేళ శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయన్న తెదేపా
- పలుచోట్ల పోలింగ్ నిలిపివేయడంపై తెదేపా నేతల ఆందోళన
- ఈవీఎంల ధ్వంసం, ఓటర్లను బెదిరించిన చోట్ల మళ్లీ పోలింగ్ జరపాలన్న ఈసీ
- కొందరు అధికారుల వైఖరిపైనా ఈసీకి ఫిర్యాదు చేయనున్న కనకమేడల
02:39 PM
కారుకు నిప్పు
- మాచర్ల: వెల్దుర్తి మం. లచ్చంబాయి వద్ద తెదేపా అభ్యర్థి బ్రహ్మారెడ్డి కాన్వాయ్‌పై దాడి
కాన్వాయ్‌లోని కారుకు నిప్పు పెట్టిన వైకాపా కార్యకర్తలు
వైకాపా నేతల రిగ్గింగ్
- సత్యసాయి జిల్లా: ధర్మవరం పార్థసారథినగర్‌లో వైకాపా నేతల రిగ్గింగ్
- సమాచారం తెలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన భాజపా అభ్యర్థి సత్యకుమార్
- అరగంటపాటు పోలింగ్ నిలిపివేయించిన సత్యకుమార్
- రిగ్గింగ్ జరుగుతున్న తీరుపై పోలింగ్ అధికారులను నిలదీసిన సత్యకుమార్
శివాపురంలో ఉద్రిక్తత
- జగ్గయ్యపేట: పెనుగంచిప్రోలు మండలం శివాపురంలో ఉద్రిక్తత
- కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్న తెదేపా, వైకాపా నేతలు
- వెంటనే చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
02:24 PM
రాళ్లతో దాడి
- కోనసీమ: కాట్రేనికోన మండలం పల్లంలో వైకాపా, తెదేపా వర్గాల కొట్లాట
- రాళ్లతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు, పలువురికి గాయాలు
- పరిస్థితి ఉద్రిక్తం, హుటాహుటిన పల్లం చేరుకున్న బలగాలు
02:05 PM
వాగ్వాదం
- విశాఖ: మధురవాడలో ఏఆర్ సీఐతో వైకాపా అభ్యర్థి అవంతి వాగ్వాదం
- తన అనుచరులను పంపలేదని భీమిలి వైకాపా అభ్యర్థి అవంతి వాగ్వాదం
- ఏఆర్ సీఐ విద్యాసాగర్‌తో వాగ్వాదానికి దిగిన వైకాపా అభ్యర్థి అవంతి
01:55 PM
ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు
- నెల్లూరు: అల్లూరులో తెదేపా, వైకాపా నేతల మధ్య తోపులాట
- రామకృష్ణ జూనియర్ కాలేజీ ఆవరణలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
- తెదేపా, వైకాపా నేతలు బీద రవిచంద్ర, మల్లిమాల సుకుమార్‌రెడ్డి మధ్య వాగ్వాదం
- నెల్లూరు: ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు
01:45 PM
కుప్పం వైకాపా అభ్యర్థి భరత్ బెదిరింపులు
- కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలోని పలు కేంద్రాల్లో వైకాపా బెదిరింపులు
- పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి తెదేపా ఏజెంట్లను బెదిరించిన వైకాపా అభ్యర్థి భరత్
- ననియాల పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తల దాడి
- సింగసముద్రంలోని పోలింగ్ బూత్‌కు వెళ్లి తలుపులు మూసిన వైకాపా అభ్యర్థి భరత్
- భరత్‌కు ఎదురుతిరిగి మూసిన తలుపులను తెరిచిన తెదేపా కార్యకర్తలు
01:34 PM
ఈనాడు కంట్రిబ్యూటర్‌కు బెదిరింపులు
- ఈనాడు కంట్రిబ్యూటర్ ప్రవీణ్‌ను చంపుతానంటూ వైకాపా నేత సుధాకర్‌రెడ్డి బెదిరింపులు
- పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం పోలింగ్ కేంద్రం వద్ద సుధాకర్‌రెడ్డి బెదిరింపులు
- కుమారుడితో కలిసి వచ్చి బెదిరించిన వైకాపా మండల కన్వీనర్ సుధాకర్‌రెడ్డి
- ప్రవీణ్‌ను సుధాకర్‌రెడ్డి బెదిరిస్తున్నా పక్కనే ఉన్నా స్పందించని పోలీసులు
ఏజెంట్లను బెదిరిస్తూ పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లిన డీసీసీబీ ఛైర్మన్ కామిరెడ్డి
- సూళ్లూరుపేట నియోజకర్గం రోశనూరు రాజపాలెం పోలింగ్ కేంద్రంలోకి చొరబడిన వైకాపా నేత
- ఏజెంట్లను బెదిరిస్తూ పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లిన డీసీసీబీ ఛైర్మన్ కామిరెడ్డి
- పోలీసుల ఎదుటే పోలింగ్ కేంద్రంలోకి చొరబడిన కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి
- పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్నా కామిరెడ్డిని నిలువరించని పోలీసులు
- రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు 36 శాతం పోలింగ్
రోశయ్యపై తిరగబడిన మహిళలు
- గుంటూరు వైకాపా ఎంపీ అభ్యర్థి రోశయ్యపై తిరగబడిన మహిళలు
- పెదకాకర మం. తక్కెళ్లపాడులో ఎస్సీ మహిళ పట్ల ఎంపీ అభ్యర్థి దురుసు ప్రవర్తన
- పలు అంశాలపై వైకాపా ఎంపీ అభ్యర్థి రోశయ్యను ప్రశ్నించిన మహిళలు
- ప్రశ్నించిన మహిళలపై ఆవేశంతో ఊగిపోయిన వైకాపా ఎంపీ అభ్యర్థి రోశయ్య
- ప్రశ్నించిన మహిళలపై దాడిచేయాలని అనుచరులకు చెప్పిన రోశయ్య
- మహిళలపైకి కారుతో దూసుకెళ్లిన వైకాపా ఎంపీ అభ్యర్థి రోశయ్య
- వైకాపా ఎంపీ అభ్యర్థి రోశయ్య తీరుపై మహిళల ఆగ్రహం
తిరువూరు నియోజకవర్గం కోకిలంపాడులో..
- తిరువూరు నియోజకవర్గం కోకిలంపాడులో వైకాపా దౌర్జన్యం
- కోకిలంపాడులో వైకాపా సర్పంచ్ భర్త గంగధారి కోటేశ్వరరావు దాడి
- తెదేపా సానుభూతిపరుడిపై చేయిచేసుకున్న కోటేశ్వరరావు
- తిరువూరు: కోటేశ్వరరావుపై తిరగబడిన తెదేపా శ్రేణులు
- తిరువూరు: ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
తాడిపత్రి నియోజకర్గం ఓంశాంతి నగర్‌లో...
- తాడిపత్రి నియోజకవర్గం ఓంశాంతి నగర్‌లో వైకాపా, తెదేపా వర్గీయుల రాళ్లదాడి
- రాళ్లదాడికి భయపడి ఇళ్లలోకి దూరి తలుపులేసుకున్న పోలీసులు
- రాళ్లదాడిలో తెదేపా కార్యకర్త, కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు
- తెదేపా, వైకాపా అభ్యర్థులకు సంబంధించిన వాహనాలు ధ్వంసం
- తాడిపత్రి: ఘటనాస్థలికి చేరుకున్న ఎస్పీ అమిత్ బర్దర్
- తాడిపత్రి మెయిన్ బజార్ గాంధీకట్ట వద్ద అదుపులోకి వచ్చిన పరిస్థితి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో...
- గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైకాపా కార్యకర్తల అసభ్య ప్రవర్తన
- పోలింగ్ కేంద్రం పరిసరాల్లో ఇష్టారాజ్యంగా తిరుగుతున్న వైకాపా నేతలు
- అసభ్య ప్రవర్తనను నిరసిస్తూ ఆందోళనకు దిగిన తెదేపా కార్యకర్తలు
- వైకాపా నేతలను పంపించివేయాలని డిమాండ్ చేసిన తెదేపా అభ్యర్థి మాధవి
- ఆందోళనకు దిగిన తెదేపా శ్రేణులనే లాఠీలతో చెదరగొట్టిన పోలీసులు
- పోలింగ్ కేంద్రం పరిసరాల్లో ఇష్టారాజ్యంగా తిరుగుతున్న వైకాపా నేతలు
12:55 PM
భీమిలి నియోజకవర్గం కొత్త మూలకుద్దులో..
- భీమిలి నియోజకవర్గం కొత్త మూలకుద్దులో కొరవడిన పోలీసు నిఘా
- భీమిలి: 158వ పోలింగ్ కేంద్రం వద్దే వైకాపా ఎన్నికల ప్రచారం
మార్కాపురం నియోజకవర్గం నందిపాలెంలో..
- మార్కాపురం నియోజకవర్గం నందిపాలెం పోలింగ్ బూత్ వద్ద ఘర్షణ
- ప్రకాశం: 211వ పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా కార్యకర్తల దౌర్జన్యం
- తెదేపా అభ్యర్థి నారాయణరెడ్డి కుమారుడు విగ్నేష్‌రెడ్డి వాహనంపై రాళ్లదాడి
- ముగ్గురు తెదేపా కార్యకర్తలకు గాయాలు, కారు అద్దాలు ధ్వంసం
గన్నవరం నియోజకవర్గం ముస్తాబాద్..
- గన్నవరం నియోజకవర్గం ముస్తాబాద్ వద్ద ఉద్రిక్తత
- వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట
- గన్నవరం: చెప్పులు, రాళ్లతో ఒకరిపై ఒకరు పరస్పర దాడులు
- వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వారి కార్లలో ఉన్న సమయంలోనే ఘర్షణ
- గన్నవరం: ఇరువర్గాలకు సర్దిచెప్పి వెనక్కి పంపిన పోలీసులు
12:47 PM
వైకాపా కార్యకర్తల దౌర్జన్యం
- మార్కాపురం నియోజకవర్గం నందిపాలెం పోలింగ్ బూత్ వద్ద ఘర్షణ
- ప్రకాశం: 211వ పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా కార్యకర్తల దౌర్జన్యం
- తెదేపా అభ్యర్థి నారాయణరెడ్డి కుమారుడు విగ్నేష్‌రెడ్డి వాహనంపై రాళ్లదాడి
- ముగ్గురు తెదేపా కార్యకర్తలకు గాయాలు, కారు అద్దాలు ధ్వంసం
వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట
- గన్నవరం నియోజకవర్గం ముస్తాబాద్ వద్ద ఉద్రిక్తత
- వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట
- గన్నవరం: చెప్పులు, రాళ్లతో ఒకరిపై ఒకరు పరస్పర దాడులు
- వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వారి కార్లలో ఉన్న సమయంలోనే ఘర్షణ
- గన్నవరం: ఇరువర్గాలకు సర్దిచెప్పి వెనక్కి పంపిన పోలీసులు
12:40 PM
మాచర్లలో నిలిచిన పోలింగ్...
- మాచర్ల 216, 205, 206, 207 పోలింగ్ కేంద్రాల్లో నిలిచిన పోలింగ్
- మాచర్ల: ఈవీఎంలను ధ్వంసం చేసిన వైకాపా కార్యకర్తలు
- పోలింగ్ నిలిపివేసి భయంతో బయటకు వెళ్లిపోయిన సిబ్బంది