ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

జగన్‌ మళ్లీ సీఎం అయితే రాష్ట్రం డ్రగ్స్‌ మాఫియా కేంద్రంగా మారుతుంది: ఆనం - Anam Allegations on CM Jagan - ANAM ALLEGATIONS ON CM JAGAN

Anam Venkataramana Reddy Allegations on CM Jagan: ఎన్నికల్లో జగన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్‌ మాఫియా ఆర్థికసాయం చేస్తోందని ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. మళ్లీ జగన్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రం డ్రగ్స్‌ మాఫియా కేంద్రంగా మారుతుందని అన్నారు.

anam_on_jagan
anam_on_jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 6:56 PM IST

జగన్‌ మళ్లీ సీఎం అయితే రాష్ట్రం డ్రగ్స్‌ మాఫియా కేంద్రంగా మారుతుంది: ఆనం

Anam Venkataramana Reddy Allegations on CM Jagan:జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం డ్రగ్స్​కు కేంద్రంగా మారుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి పాలనా తీరును ఆనం తీవ్రంగా విమర్శించారు. కొలంబియా, మెక్సికో నుంచి డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలోకి దిగిందని తెలిపారు. జగన్ రెడ్డి వారికి సహకరిస్తున్నాడని అన్నారు. మళ్లీ గెలిపిస్తే రాష్ట్రం డ్రగ్స్ సరఫరా కేంద్రంగా రాష్ట్రం మారుతుందని విమర్శించారు.

ప్రభుత్వ ఉద్యోగులు మాస్కులు ధరించి మరీ ఎన్నికల ప్రచారం - చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ - Election Code Violation

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక, రౌడీ, గంజాయి మాఫియాకు సహకరిస్తున్నాడని తెలిపారు. అనూప్​ రెడ్డి అనే వ్యక్తి రెడ్ కార్నర్ నోటిస్ ఉన్న వ్యక్తని అన్నారు. ఇమిగ్రేషన్​లో రెడ్ నోట్ ఉన్న వ్యక్తి అరెస్ట్ కాకుండా లోపలికి ఎలా ప్రవేశించాడని ప్రశ్నించారు. కావలి సిద్ధం సభలో జగన్ మోహన్ రెడ్డితొ సెల్ఫీ తీసుకున్నాడని అన్నారు. అనూప్ రెడ్డికి జగన్ అండదండలు ఉన్నాయని అనూప్ రెడ్డి పేర్లు మార్చుకొని తిరుగుతున్నాడని తెలిపారు.

మద్యం, బిర్యానీ ఇచ్చి జనం తరలింపు - అయినా సీఎం జగన్​ ప్రసంగిస్తుండగానే సభ ఖాళీ - NO Public in Jagan Meeting

విజయసాయి రెడ్డి ఇంట్లోనే అనూప్ రెడ్డి దాక్కొని తిరుగుతున్నాడని అన్నారు. ఒక నేరస్థుడిని ఇంట్లో పెట్టుకుంటే విజయసాయి నేరస్థుడు కాదా అని పోలీసులను ప్రశ్నించాడు. నేరస్థుడిని ఇంట్లో పెట్టుకున్న విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విజయసాయి రెడ్డిని ఎన్నికల్లో అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. ఆయన ఇంటిని వెంటనే పోలీసులు తనిఖీ చెయ్యాలని కోరారు. పోలీసులు చేయాల్సిన పనులు మేము చేస్తుంటే పోలీసులు సిగ్గుతో తలదించుకోవాలని ఆనం అన్నారు.

'శివ అన్నపురెడ్డి’ ఫేస్‌బుక్‌ ఖాతా - మొన్న కనిపించింది - నిన్న మాయమైంది - shiva annapureddy facebook

ఆంధ్ర రాష్ట్రంలో అంతర్జాతీయ డ్రగ్స్​ మాఫియా దిగింది. జరగబోయే ఎన్నికల్లో జగన్‌కు ఆ అంతర్జాతీయ డ్రగ్స్‌ మాఫియా ఆర్థికసాయంతో పాటు అన్ని రకాలుగా సాయం చేస్తోంది. ఇంత సులువుగా రాష్ట్రంలోకి వచ్చి ఎన్నికల్లో జగన్​ను ఏ విధంగా గెలిపించాలి. జగన్​ గెలిస్తే మళ్లీ డ్రగ్స్​ సరఫరా చేసుకోవచ్చు. చంద్రబాబు గెలిస్తే ఈ డ్రగ్స్​ అమ్మడం కుదరదు అనే ఒక్క కారణంతో డ్రగ్స్ మాఫియా వైసీపీకి సపోర్ట్ చేస్తుంది. - ఆనం వెంకటరమణా రెడ్డి, టీడీపీ నేత

ABOUT THE AUTHOR

...view details