రాష్ట్రంలోని పోలీసులు కరుడగట్టిన వైసీపీ నాయకుల్లా పనిచేస్తున్నారు: సీఎం రమేశ్ Anakapalli BJP MP Candidate CM Ramesh Nomination:రాష్ట్రంలోని పోలీసులు కరుడగట్టిన వైసీపీ నాయకుల్లా పనిచేస్తున్నారని అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ధ్వజమెత్తారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా వైసీపీపై స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం రమేశ్ కూటమి నాయకులు, శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, దాడి వీరభద్రరావు, వంగలపూడి అనిత, పీలా గోవింద్, ఎమ్మెల్యేలు, తదితరులు ర్యాలీలో పాల్గొని సీఎం రమేశ్‌కు అభినందనలు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల బరిలో ముఖ్యమంత్రుల వారసులు- ఆ ఆరుగురు ఎవరో తెలుసా? - AP ELECTIONS 2024
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రమేశ్ కేంద్రంలో ప్రకటించే ప్రతి పథకం మొదట అనకాపల్లిలో అమలు చేస్తామన్నారు. అనకాపల్లి పరిసర ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి కల్పన, రైతుల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తామని తెలిపారు. కోడ్ అమల్లోకి వచ్చినా ఇంకా చాలా మంది అధికారులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు.
జగన్ లాంటి ఒక ఆర్థిక నేరస్థుడు ఏ విధంగా ఎంట్రప్రెన్యూర్ అవుతాడు?: తిరునగరం జ్యోత్స్న - TDP Tirunagari Jyothsna on CM Jagan
కార్యకర్త కటా రమేష్ ఉన్న చోట సోదాలు చేసి భయబ్రాంతులకు గురిచేశారని, దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. సినీ నటుడు చిరంజీవి తనకు చిరకాల మిత్రుడని, ఆ అభిమానంతో ఒక స్టేట్మెంట్ ఇచ్చారని, అయితే ఆయన మాటనీ వైసీపీ నేతలు, సజ్జల వక్రీకరించి మాట్లాడుతున్నారని అన్నారు. సినిమా రంగాన్ని అవమానపరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ కూటమి పొత్తు కోసం కృషి చేశారన్నారు. ఈ క్రమంలో పవన్‌కు సీఎం రమేశ్ ధన్యవాదాలు చెప్పారు.
"రాష్ట్రంలోని పోలీసులు కరుడగట్టిన వైసీపీ నాయకుల్లా పనిచేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అధికార పార్టీపై స్వామి భక్తి ప్రదర్శిస్తూ వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. అధికారంలోకి రాగానే చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం." - సీఎం రమేశ్, అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి