ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఇలా చేస్తే.. ఏపీలో ఆహార పరిశ్రమ రంగం పరుగులు - Food processing industry - FOOD PROCESSING INDUSTRY

FOOD PROCESSING INDUSTRY : కేంద్ర బడ్జెట్​ ఈ నెల 23న రానుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్​ కేటాయింపులకు అనుగుణంగా ఆయా రంగాల పరిస్థితిపై కేంద్రం అంచనాలు రూపొందిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమ మంత్రిత్వశాఖ ఏపీలోని పారిశ్రామిక సంఘాలతో భేటీ అయ్యింది. రాష్ట్రంలో ఈ రంగానికి ఉన్న అపార అవకాశాలపై ఆయా సంఘాల ప్రతినిధులు తమ ఆలోచనలను కేంద్ర అధికారులతో పంచుకున్నారు.

food_processing_in_ap
food_processing_in_ap (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 12, 2024, 8:03 PM IST

FOOD PROCESSING INDUSTRY :ఆహారశుద్ధి రంగంలో అవకాశాలు- ప్రోత్సాహకాలు- అంశంపై విజయవాడలో మూడు రోజుల సదస్సు నిర్వహిస్తున్నారు. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమ మంత్రిత్వశాఖ, ఫిక్కీ, డిక్కీ, సీఐఐ, ఏపీ ఛాంబరు, ఇన్వెస్ట్‌మెంట్‌ ఇండియాతోపాటు ఇతర పరిశ్రమ అనుబంధ విభాగాలు ఈ సదస్సులో భాగస్వామ్యం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చేయూత అందించేందుకు వీలుగా బడ్జెట్‌కు ముందే పరిశ్రమ ఏం ఆశిస్తోందనే వివరాలను సేకరిస్తోందని కేంద్ర ప్రభుత్వ సహకారం- రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఆంధ్రప్రదేశ్‌ ఖచ్చితంగా ఆహార శుద్ధి పరిశ్రమ రంగంలో మంచి పురోభివృద్ధి సాధించే అవకాశం ఉందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు.

పారిశ్రామిక వాడల అభివృద్ధికి కృషి : మంత్రి టీజీ భరత్ - TG Bharat on Industrial Parks in ap

ఆహార శుద్ధి పరిశ్రమ కోసం ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. విశాలమైన కోస్తా తీరం... అన్ని రకాల ఆహార ఉత్పత్తులు పండే ప్రాంతం కావడంతో ఇక్కడి పంట దిగుబడులకు సరైన విలువను జోడిస్తే ఖచ్చితంగా వేల మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి ఈ సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. నూజివీడు మామిడికి అంతర్జాతీయ గుర్తింపు ఉందని- దానికి ఓ ప్రత్యేక బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో పారిశ్రామిక రంగ పురోభివృద్ధికి, చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎంతో సానుకూలంగా ఉన్నారని- పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తగిన విధాన నిర్ణయాలు తీసుకుని ప్రోత్సహించేందుకు సర్కార్‌ సంసిద్ధంగా ఉందని తెలిపారు. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు సదస్సులో వివిధ అంశాలపై చర్చించి సమగ్రమైన నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏకైక లక్ష్యం, ఇరు ప్రభుత్వాల మధ్య సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఫుడ్​ ప్రాసెసింగ్​ పరిశ్రమ దిశగా వ్యాపార వేత్తలు ముందుకొస్తున్నారు. అనుమతులు, భూముల కేటాయింపు విషయంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం దిశగా ఈ సమావేశం దోహదపడుతుంది. ఏ రాష్ట్రంలో లేని అపార అవకాశాలు రాష్ట్రంలో ఉన్నాయి. నదులు, సముద్రం, సముద్ర తీర ప్రాంతం పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉంటుంది. తీరం వెంట ఫుడ్​ ప్రాసెసింగ్​, మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది.

- నర్రా రవికుమార్‌, డిక్కీ జాతీయ అధ్యక్షులు

పరిశ్రమల స్థాపనకు ఫండ్స్, బ్యాంకర్ల మద్దతు ఉంది. రైతుల నుంచి మద్దతు, అవగాహన కూడా ఉంది. అంతర్జాతీయ మార్కెట్​లో ధరల విషయం అనేది ప్రధాన సమస్య. దానిపై దృష్టి సారిస్తాం.

- డాక్టర్ లక్ష్మీప్రసాద్‌, ఏపీ సీఐఐ పూర్వ అధ్యక్షుడు

అన్ని వర్గాల ప్రజలు చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చామనే భావనలో ఉన్నారు. కష్టాల నుంచి సంతోషంలోకి వచ్చామనే భావనతో ఉన్నారు. పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, చిరు వ్యాపారులు కూడా తమకు మంచి రోజులు వచ్చాయని, మళ్లీ పుంజుకుంటామని నమ్ముతున్నారు. తాము పెట్టిన పెట్టుబడులపై ఆశాజనక రాబడి ఉంటుందని భావిస్తున్నారు. చంద్రబాబు దీర్ఘదృష్టి ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుంది.

- కొలుసు పార్ధసారధి, రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారశాఖల మంత్రి

జగన్‌ రాకతో పరిశ్రమలు పరార్‌ - ఐదేళ్ల పాలనలో విధ్వంసం తప్ప, కంటికి కానరాని ప్రగతి - NO Industrial Growth Under YCP GOVT

పారిశ్రామిక పార్కులను నాశనం చేసిన వైఎస్సార్సీపీ సర్కార్- గొప్పలుగానే మిగిలిపోయిన జగన్ మాటలు

ABOUT THE AUTHOR

...view details