Student Free Laptop Scheme : కేంద్ర ప్రభుత్వం ఉచిత లాప్టాప్ పథకాన్ని తిసుకవచ్చిందా? కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) 'వన్ స్టూడెంట్ వన్ ల్యాప్‌టాప్ యోజన' (One Student One Laptop Yojana 2024) పథకం నిర్వహణ బాధ్యతలు చూస్తోందా? ఈ పథకం ఎప్పుడు, ఎవరు ప్రారంభించారు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? తదితర సమాచారం తెలుసుకుందామా!
"నాన్నా కష్టంగా ఉంది డబ్బు పంపండి ప్లీజ్" - విద్యార్థుల ఫోన్ కాల్స్!
డిగ్రీ, బీటెక్ తదితర ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ల్యాప్‌టాప్ తప్పనిసరి అవసరమైపోయింది. కాస్త మంచి కాన్ఫిగరేషన్ ఉన్న ల్యాప్‌టాప్ ధర కనీసం రూ.40వేలు ఉంటోంది. ఇంకా మంచి ఫీచర్స్ ఉండాలంటే రూ.70వేలకు పైమాటే. ఈ నేపథ్యంలో పేద, మధ్య తరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఫ్రీ లాప్టాప్ పథకానికి శ్రీకారం చుట్టిందని వార్తలు వస్తున్నాయి. పథకం వివరాలు, ఎవరెవరు అర్హులు, దరఖాస్తు విధానం వివరాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో కొంత అస్పష్టమైన సమాచారం కనిపిస్తోంది.
లింకులు క్లిక్ చేస్తే
మోదీ ప్రభుత్వం సాంకేతిక విద్య అభ్యసించే విద్యార్థులందరికీ ఉచితంగా లాప్ టాప్ స్కీం ప్రవేశపెట్టిందని వార్తలు ఈ మధ్యకాలంలో చాలా సైట్లలో దర్శనమిస్తున్నాయి. కానీ, అదంతా అవాస్తవం. కొన్ని కొంత మంది వ్యూస్ పెంచుకోవడానికి చేస్తున్న దుష్ప్రచారమని స్పష్టం అవుతోంది. అంతే కాదు ఫ్రీ లాప్ టాప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటూ మీ మొబైల్‌కు ఏవైనా మెసేజ్, లింకులు వచ్చినపుడు అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ లింకులు క్లిక్ చేసి మీ సమాచారాన్ని షేర్ చేసుకోవద్దు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) అధికారిక వెబ్‌సైట్ (https://www.aicte-india.org)కి వెళ్లాలి.
12% వడ్డీ అంటే ఒక్క రూపాయి - బ్యాంకు లోన్లపై వడ్డీ సింపుల్‌గా ఎలా లెక్కించాలంటే!
పథకాల అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే
కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. జిల్లా జిల్లా యూనిట్ గా అమలవుతుంటాయి. కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఈ పథకాలను నిర్వహిస్తారు. కేంద్రం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ స్కీం (MREGS) సైతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే అమలవుతోంది.
గతంలో అమలు చేసిన తమిళనాడు
కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు విద్యార్థులకు కొన్ని పథకాలు ప్రవేశపెట్టాయి. తమిళనాడులో గత ప్రభుత్వం "ఒక విద్యార్థి ఒక ల్యాప్‌టాప్" పథకాన్ని అమలు చేయగా ప్రస్తుతం ఆ పథకం నిలిపేశారు. ప్రస్తుతం కేంద్రం ఫ్రీ ల్యాప్‌టాప్(Free laptop) పథకాన్ని అమలు చేయడం లేదు. కానీ, సాంకేతిక విద్య అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు డిజిటల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా కొన్ని పరికరాలను అందించే పథకాలు, కార్యక్రమాలు ఉన్నాయి. డిజిటల్ విద్యలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) విద్యార్థులకు ప్రోత్సహించడానికి కొన్ని కార్యక్రమాలను చేపడుతోంది.
రైతులకు రూ.5లక్షల రుణం - 'కిసాన్ క్రెడిట్ కార్డ్' దరఖాస్తు ఇలా!
ధర తక్కువ ఫోన్లతో బుక్ చేస్తే తక్కువ ఛార్జీలు? - ఓలా, ఉబర్‌కు కేంద్రం నోటీసులు