Police Arrested Masthan Sai : యువతుల ప్రైవేట్ వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యవహారంలో ఏపీలోని గుంటూరుకు చెందిన రావి మస్తాన్ సాయిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. యువతులు, వివాహితలకు మత్తు పదార్థాలు ఇచ్చి, లైంగికవాంఛ తీర్చుకుంటూ వీడియోలను చిత్రీకరిస్తున్నాడని విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య(32) ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాదాపు 80 నగ్న వీడియోలు, ఫొటోలున్న ఓ హార్డ్‌డిస్కును సైతం ఆమె పోలీసులకు అందజేశారు.
దీంతో సోమవారం మస్తాన్ సాయితోపాటు యూట్యూబర్ ఖాజాను అరెస్ట్ చేశారు. మస్తాన్‌సాయి గతంలో హైదరాబాద్, విజయవాడలో నమోదైన డ్రగ్స్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. సినీ నటుడు రాజ్‌తరుణ్ తనను పెళ్లి పేరిట మోసగించాడని లావణ్య గతంలో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదంలోనే మస్తాన్‌సాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లావణ్య సైతం రెండు డ్రగ్స్ కేసుల్లో నిందితురాలు.
హార్డ్‌డిస్కులో వీడియోలు : మస్తాన్‌సాయి బీటెక్ చదివి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడని లావణ్య తన ఫిర్యాదులో తెలిపారు. అతను ఉనీత్‌రెడ్డి అనే స్నేహితుడి ద్వారా 2022లో పరిచయమయ్యాడని చెప్పారు. యువతులు, వివాహితల్ని లక్ష్యంగా చేసుకుని ఫోన్లు హ్యాక్ చేస్తాడని పేర్కొన్నారు. గూగుల్, ఐ-క్లౌడ్‌లోని వారి వ్యక్తిగత చిత్రాలు సేకరించి బెదిరింపులకు పాల్పడినట్లు వివరించారు. బాధితులకు డ్రగ్స్ ఇచ్చి లైంగికవాంఛ తీర్చుకుంటాడని ఆ వీడియోలను చిత్రీకరించి హార్డ్‌డిస్కులో దాచేస్తాడని వెల్లడించారు.
గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టైన వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్‌రెడ్డి ఫోన్‌ను హ్యాక్ చేసి వీడియోలు సేకరించాడని లావణ్య పేర్కొన్నారు. నటుడు నిఖిల్ ఫోన్‌లోని ప్రైవేట్ పార్టీ వీడియోలు సైతం మస్తాన్ హార్డ్‌డిస్కులో ఉన్నాయని తెలిపారు. మస్తాన్‌సాయి తనకు తెలియకుండానే తన వ్యక్తిగత వీడియోలు తీసినట్లు వివరించారు. వీటి గురించి ప్రశ్నిస్తే లైంగిక దాడికి పాల్పడ్డాడని దీనిపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని చెప్పారు.
Lavanya Raj Tarun Case : మస్తాన్‌సాయి ఆకృత్యాలున్న హార్డ్ డిస్కును గతేడాది నవంబర్‌లో తాను తీసుకున్నట్లు వివరించారు. దాంతో తమ ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేసినట్లు తెలిపారు. తనను అంతం చేసి హార్డ్‌డిస్కు తీసుకుంటానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు మస్తాన్ సాయిపై హత్యాయత్నం, మహిళల ఏకాంత వీడియోల చిత్రీకరణ, ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి దాడి తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
రాజ్‌తరుణ్ నుంచి నాకు ప్రాణ భయం ఉంది : నటి లావణ్య - Lavanya on Hero Raj Tarun