Tirumala Ratha Saptami : జగతికి వెలుగులు పంచే దినకరుడి పండుగ రథసప్తమి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. దీంతో దేవాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. తిరుమలలో ఈ వేడుకలు కనులపండువగా సాగుతున్నాయి. ఇవాళ సప్త వాహనాలపై శ్రీవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో మలయప్ప స్వామిని ఊరేగించారు.
ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీటీడీ : అంతకుముందు టీటీడీ అధికారులు వాయువ్య దిశలో సూర్యప్రభ వాహనాన్ని నిలిపి సూర్య కిరణాలు తాకిన వెంటనే వాహన సేవలను ప్రారంభించారు. తిరుమలేశుడ్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. చలి, ఎండ, వర్షానికి ఇబ్బంది లేకుండా గ్యాలరీల్లో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు. 130 గ్యాలరీల్లో ప్రత్యేకంగా ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తులకు నిరంతరాయంగా టీ, కాఫీ, పాలు, మజ్జిగ, మంచినీరు, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగలి అందిస్తున్నారు . గ్యాలరీల్లోకి చేరుకోలేక బయట ఉన్నవారి కోసం ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మాడవీధుల్లోని గ్యాలరీల్లో సౌకర్యాల పర్యవేక్షణకు సీనియర్ అధికారులకు విధులు కేటాయించారు.
Ratha Saptami in Arasavalli : శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి నుంచే ఆదిత్యుడి దర్శనం కోసం భక్తులు పొటెత్తారు. స్వామివారికి దేవాలయశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వినయ్ చంద్ పట్టు వస్త్రాలను సమర్పించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, గౌతు శిరీష తదితరులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం నాలుగు వరకు భక్తులకు నిజరూప దర్శనం కల్పించనున్నారు. అరసవల్లి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం అరసవల్లిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతను గుర్తించి రథసప్తమిని రాష్ట్ర పండగగా జరపాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ సందర్భంగా మా జిల్లా ప్రజలన తరఫున సీఎం చంద్రబాబుకు ధన్యావాదాలు తెలియజేస్తున్నాం. మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాం. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశాం." - రామ్మోహన్ నాయుడు, కేంద్రమంత్రి
అరసవల్లి ఆలయంలో రథ సప్తమి వేడుకలు- ఒక్కసారి దర్శిస్తే సకల పాపాలు నశించడం ఖాయం!
RathaSapthami in Yoga Village: 'యోగా'లో ఘనంగా రథసప్తమి వేడుకలు..108మందితో సూర్య నమస్కారాలు