తెలంగాణ

telangana

ETV Bharat / photos

జగన్ రెడ్డి రుషికొండ ప్యాలెస్​ ఇన్​సైడ్​ వ్యూ : పేదోడి ఇల్లు - పెత్తందారీ బాత్రూమ్​ - Vizag Rushikonda Palace view - VIZAG RUSHIKONDA PALACE VIEW

Rushikonda Palace : ఏపీలో ఎన్నికలు పేదోడికి, పెత్తందార్లకు మధ్య యుద్ధమని మాటలతో కలరింగ్ ఇచ్చిన జగన్​ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే విశాఖలోని రుషికొండలో నిర్మించిన భవనాలపై టెక్షన్ వీడింది. రుషికొండ మీద కట్టుకున్న జల్సా ప్యాలెస్‌లో ఫర్నీచర్​, బంగారు తొడుగులు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 16, 2024, 8:41 PM IST

రాష్ట్రవ్యాప్తంగా రూ.26 లక్షల విలువ చేసే బాత్​ టబ్​ సంచలనంగా మారింది. అధికారంలోకి వస్తే తన భార్యకి బీచ్​ సైడ్​ ప్యాలెస్​ గిఫ్ట్​గా ఇస్తానని చెప్పి, ప్రభుత్వ సొమ్ముతో ఇలా కట్టాడు. (ETV Bharat)
ఇంకా వెతికే కొద్దీ ఇటువంటి ప్రజల సొమ్ముతో వృథా చేసిన ఘోరాలు దారుణాలు ఇంకా బయటకు వస్తున్నాయి. (ETV Bharat)
విశాఖలో వైఎస్సార్సీపీ పాలనలో నిర్మించిన రుషికొండ భవనాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూటమి పార్టీల శ్రేణులతో కలిసి పరిశీలించారు. (ETV Bharat)
ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పూర్తి చేసిన ఆ నిర్మాణం దేనికోసమో ఆ శాఖ అధికారులు కాదు కదా వాటిని ప్రారంభించిన మంత్రులు కూడా చెప్పలేదు. (ETV Bharat)
వేంగి ఎ, వేంగి బి, కళింగ, గజపతి, విజయనగరం ఏ, బీ, సీ ఇలా మొత్తం ఏడు బ్లాకుల్లో ఉన్నాయి. (ETV Bharat)
రుషికొండపై పర్యాటక రిసార్టు నిర్మాణం పేరిట ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో ఇదేమైనా రాజకోట రహస్యమా అని విమర్శలు వినిపించాయి. (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details