తెలంగాణ

telangana

ETV Bharat / photos

నిద్ర సరిగ్గా పట్టడం లేదా? ఈ టిప్స్​ పాటిస్తే డీప్ స్లీప్ పక్కా! - Tips to improve your sleep cycle - TIPS TO IMPROVE YOUR SLEEP CYCLE

Tips to Improve Your Sleep Cycle : మనిషికి ఆహారం ఎలాగో నిద్ర అలాంటిదే. ఒక్క రోజు సరిగ్గా నిద్రపోక పోయినా తర్వాత రోజు మీద ఆ ప్రభావం పడుతుంది. ఆంతేగాక మానవుని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో నిద్రది కీలక పాత్ర. రోజుకు తగినంత నాణ్యమైన నిద్ర చాలా ముఖ్యం. మరెందుకు ఆలస్యం నాణ్యమైన నిద్ర పట్టడానికి పాటించాల్సిన టిప్స్ ఏంటో తెలుసుకుందాం.

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 7:02 PM IST

ఆరోగ్యాన్ని కాపాడడంలో నిద్ర పాత్ర చాలా కీలకం. అయితే కొందరికి రాత్రి వేళ సరిగ్గా నిద్రపట్టదు. మరెందుకు ఆలస్యం నైట్ టైమ్ గాఢ నిద్ర పట్టాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం, నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల మంచి నిద్ర పడుతుంది. అలాగే గాఢ నిద్ర వస్తుంది.
నిద్రపోయే ముందు చదవడం, గోరు వెచ్చని నీటితో స్నానం, ధ్యానం వంటివి చేయండి. ఇలాంటివి చేయడం వల్ల మీకు హాయిగా నిద్ర పడుతుంది.
నిద్రపోయే ముందు కెఫిన్‌ ఉండే కాఫీ,టీ వంటివి తాగకండి. లేదంటే అవి మీ నిద్రపై ప్రభావం చూపుతాయి.
నిద్రపోయే ఒక గంట ముందు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్​కు (స్మార్ట్‌ఫోన్‌, టాబ్లెట్‌లు, కంప్యూటర్‌లు, టీవీ) దూరంగా ఉండండి. ఎందుకంటే అవి విడుదల చేసే బ్లూ లైట్ మెలటోనిన్ నిద్ర సరిగ్గా పట్టకుండా చేస్తుంది.
రోజు వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. దీంతో రాత్రి వేళ హాయిగా నిద్రపడుతుంది.
పగటి పూట వీలైనంతవరకు పడుకోకండి. ఒకవేళ పడుకున్నా తక్కువ సేపే నిద్రించండి. లేదంటే రాత్రి సరిగ్గా నిద్ర పట్టదు. ఒకవేళ నిద్రపట్టినా నాణ్యమైన నిద్రపట్టదు. రాత్రివేళ వీలైనంత త్వరగా నిద్రపోవడం మంచిది.

ABOUT THE AUTHOR

...view details