Vijay Devarkonda Sreeleela : విజయ్ దేవరకొండతో యానిమల్ భామ త్రిప్తి దిమ్రి!. విజయ్ దేవరకొండ - డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన షూటింగ్ కొంత వరకు జరుపుకుంది.. అయితే ఈ చిత్రం నుంచి శ్రీలీల తప్పుకుందని టాక్ వినిపిస్తోంది. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్ల తప్పుకున్నట్ల తెలుస్తోంది.. ఆమె స్థానంలోయానిమల్ భామ త్రిప్తి దిమ్రిని తీసుకున్నట్లు సమాచారం. యానిమల్ చిత్రంలో రష్మిక హీరోయిన్ అయినప్పటికీ సెకండాఫ్‌లో కాసేపు కనిపించి అందరి మనసులను దోచేసింది త్రిప్తి దిమ్రి.. ఓవర్ నైట్‌లో కొత్త నేషనల్ క్రష్‌గా మారిపోయింది. సౌత్‌లోనూ ఫుల్ ఫేమస్ అయిపోయింది.. ఆమెకు పలు వరుస ఆఫర్స్ కూడా వస్తున్నాయట.. . ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ సరసన ఈ భామను తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ విషయంపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.. ఒకవేళ ఇదే కనుక నిజమైతే త్రిప్తి దిమ్రికి ఇదే తొలి తెలుగు చిత్రం అవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.