ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే అరటిపళ్లను మన ఆహారంలో చేర్చుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం.. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి. మెదడు పనితీరుకు విటమిన్ బి6. జీర్ణఆరోగ్యానికి ఫైబర్. రక్తపోటు. గుండె ఆరోగ్యానికి పొటాషియం వంటి విటమిన్లు. ఖనిజాలు అరటిపండులో అధికంగా ఉంటాయి.. అరటిలో పొటాషియం అధిక మోతాదులో ఉంటుంది. ఇది గుండె. కండరాల పనితీరు. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.. అరటిపండులో గ్లూకోజ్. ఫ్రక్టోజ్. సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.. అరటిపండులో ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. జీర్ణ సమస్యలు ఉన్నవారు అరటిపండ్లు తింటే ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.. అరటిపండులో ఉండే పొటాషియం గుండెకు మేలు చేస్తుంది.