Pratidwani :భారతదేశం గత వైభవ చరిత్ర, ఘనమైన భవిష్యత్ ఆకాంక్షలకు ప్రతి రూపంగా వినిపించే పదం 'విశ్వగురు'. దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇదే స్ఫూర్తిని ప్రముఖంగా ప్రస్తావించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. లక్షల మంది భారతీయ యువత ఉన్నత విద్య కోసం విదేశాల బాట పట్టడం కాదు వారికి ఇక్కడే మెరుగైన అవకాశాలు అందించడంతో పాటు విద్యావసరాల కోసం ప్రపంచాన్ని భారత్ వైపు చూసేలా చేయాలని పిలుపు నిచ్చారు. ప్రాచీన భారత మేధో కీర్తికి నిదర్శనంగా తిరిగి నిలబెట్టిన నలందా విశ్వవిద్యాలయం బాటలో ఉన్న విద్యను మెరుగుపరచాలన్నారు. మరి ప్రధానమంత్రి కోరుకుంటున్నట్లు మన విద్యార్థులు ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లే రోజులు పోవాలంటే ఏం చేయాలి? ఇదీ నేటి ప్రతిధ్వని అంశం.
చర్చలో పాల్గొంటున్న వారు యూజీసీ మాజీ సభ్యుడు, జేఎన్టీయూ మాజీ వీసీ ప్రొఫెసర్ డీఎన్ రెడ్డి. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ నుంచి వీసీ వరకు పలు హోదాల్లో సేవలందించారు. AICTE దక్షిణ మధ్య విభాగానికి ప్రాంతీయ ఛైర్మగా వ్యవహరించారు. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన విద్యావేత్తగా ఉన్నారు. మరొకరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) విశ్రాంత డైరెక్టర్ డా. వీఎస్‌ఆర్‌కే ప్రసాద్. ఈయన IIPE డైరెక్టర్‌తో పాటు దాదాపు 4 దశాబ్దాలుగా సాంకేతిక విద్యారంగంలో ఆచార్యునిగా, సంచాలకుడిగా పని చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సహా జాతీయ స్థాయి సంస్థల్లోనూ విదేశీ విద్యాసంస్థల్లోనూ సేవలందించిన ప్రముఖ విద్యావేత్త వీఎస్‌ఆర్‌కే ప్రసాద్.
సప్తసముద్రాలు దాటివెళ్తున్న యువత - విదేశీ విద్యకు ఉన్న అవకాశాలేంటి? - Youngsters Foreign Education