ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / opinion

వార్‌జోన్​లో అడుగు పెట్టిన మోదీ - ప్రపంచం చూపు ప్రధాని ఉక్రెయిన్ పర్యటన వైపు - Pratidhwani on Modi Tour to Ukraine - PRATIDHWANI ON MODI TOUR TO UKRAINE

Prathidhwani : దాదాపు 30 ఏళ్ల తర్వాత వార్‌జోన్‌లో ఉన్న ఉక్రెయిన్‌లో భారతదేశ ప్రభుత్వాధినేతగా అడుగు పెట్టారు ప్రధానమంత్రి. దౌత్యపరంగా నరేంద్రమోడీ పర్యటనకున్న ప్రాధాన్యత ఏమిటి? రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం నుంచీ భారత్‌పై ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయి. అయితే ప్రధాని మోదీ ఇప్పుడే ఉక్రెయిన్‌కు వెళ్లడానికి ప్రత్యేకమైన కారణాలేమైనా ఉన్నాయా? అనే పలు అంశాల గురించి నేటి ప్రతిధ్వని కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం.

MODI TOUR IMPACT ON UKRAINE WAR
MODI TOUR IMPACT ON UKRAINE WAR (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2024, 12:04 PM IST

Prathidhwani : ప్రపంచం ఆసక్తి, ఉత్కంఠగా గమనిస్తున్న వేళ యుద్ధభూమి ఉక్రెయిన్‌లో అడుగు పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ. చిరకాల మిత్రదేశం రష్యా పర్యటన ముగిసిన సరిగ్గా ఆరు వారాలకే ఆ దేశంతో భీకరయుద్ధంలో ఉన్న కీవ్‌లో మోదీ దౌత్య యాత్ర సహజంగానే దృష్టినీ ఆకర్షిస్తోంది. మరి మాస్కోతో ఉన్న మైత్రీబంధాన్ని, ఇటు నాటో కూటమికి మధ్య ప్రాధాన్యతల్ని ఇప్పుడెలా సమన్వయం చేసుకోనున్నారు? అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గకుండా భారత్ ఇంతకాలంగా అనుసరిస్తోన్న తటస్థ వైఖరిని నిపుణులు ఎలా విశ్లేషిస్తున్నారు? వీటన్నింటికంటే పెద్ద ప్రశ్న ప్రధాని మోదీ ఇప్పుడే అక్కడికి ఎందుకు వెళ్లారు? రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న ఎదురుచూపులకు మోదీ పర్యటన రూపంలో ఏమైనా సానుకూల సంకేతాలు వచ్చే అవకాశం ఉందా? ఇదీ నేటి ప్రతిధ్వని.

చర్చలో పాల్గొంటున్న వారు ఉక్రెయిన్‌లో భారత మాజీ రాయబారి టి. సురేష్‌. ఈయన భారతవిదేశాంగ శాఖలో సుదీర్ఘకాలం పని చేశారు. నాటి సోవియట్‌ యూనియన్‌లోని పలుదేశాల్లో భారత రాయబారిగా సేవలందించారు. అయిదుగురు భారత ప్రధానమంత్రులు, రష్యా అధ్యక్షులకు మధ్య అనువాదకులుగా పని చేశారు. మరొకరు విశ్రాంత సైనికాధికారి మేజర్ జనరల్ కందుకూరి ఉమామహేశ్వర్. ఈయన సియెర్రాలియోన్ లో యునైటెడ్ నేషన్స్ మిలటరీ ఆపరేషన్స్ అబ్జర్వర్ గా పనిచేశారు. సైనిక, అంతర్జాతీయ అంశాల్లో నిపుణులు.

'మణిపుర్‌ వెళ్లని ప్రధాని, ఉక్రెయిన్‌ అధ్యక్షుడిని కౌగిలించుకున్నారు'- మోదీపై కాంగ్రెస్ ఫైర్

భారత్‌కు మాస్కోతో ఎప్పట్నుంచో చిరకాల మైత్రీబంధం ఉంది. అదే సమయంలో అమెరికాతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. చాలాకాలంగా రష్యాకి అమెరికాకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరు దేశాలతో రిలేషన్స్‌ను ఇండియా ఎలా బాలెన్స్ చేసుకుంటూ వస్తోంది? రష్యా - ఉక్రెయిన్ యుద్ధాన్ని ఇకనైనా ఆపడానికి భారత ప్రధాని శాంతిదూతగా ఈ పర్యటన చేస్తున్నారా అన్నది చాలామందిలో ఉన్న అభిప్రాయం. దానికి తగినట్లే కీవ్‌కు వెళ్ళడానికి ముందే యుద్ధభూమిలో పరిష్కారాలు దొరకవంటూ ఆ రెండుదేశాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి మోదీ. దానిని ఎలా అర్థం చేసుకోవచ్చు?

రష్యాతో చిరకాల స్నేహం, ఉక్రెయిన్‌తో వాణిజ్య బంధం ఇండియా చాలా కాలంగా కొనసాగిస్తోంది. అంతర్జాతీయ సమాజం ఒత్తిళ్లకు తలొగ్గకుండా భారత్ అనుసరించిన తటస్థ వైఖరిని మీరెలా విశ్లేషిస్తారు?రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై రెండున్నర సంవత్సరాలు అయింది. దీని ద్వారా ఆ రెండు దేశాలు ఏం సాధించినట్టు? ఈ యుద్ధం నుంచి అన్ని దేశాలు నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? కొంతకాలంగా ఉన్న పరిణామాలపై మీ పరిశీలన ప్రకారం రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ఎప్పటి లోపు ఏ రూపంలో ఉండొచ్చు అని? ఆ దిశగా ఆలోచించడానికి అనువైన సంకేతాలేమైనా కనిపిస్తున్నాయా? వీటన్నింటి గురించిన సమగ్ర సమాచారం ప్రతిధ్వని ద్వారా తెలుసుకుందాం.

ఉక్రెయిన్​లో మోదీ శాంతి సందేశం- రెండు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు - Modi Ukraine Visit

ABOUT THE AUTHOR

...view details