Pratidhwani : అది నదులు అయినా భాష అయినా జీవధారలుగా ప్రవహిస్తున్నంత వరకే వాటికి ఉనికి. ఆ ప్రవాహం, పరంపర ఎక్కడ ఆగిపోతుందో, చిక్కిపోతుందో అక్కడితో గడ్డురోజులు మొదలైనట్లే. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా వినుతికెక్కిన తెలుగుభాష కూడా అందుకు మినహాయింపు కాదు. శరవేగంగా మారుతోన్న ఆధునిక, సాంకేతిక యుగంలో మాతృభాషలు ఎదుర్కొంటున్న సవాళ్లే అందుకు కారణం. మరి ఏం చేస్తే మన భాష బతుకుతుంది? తెలుగు భాషా దినోత్సవం సందర్భంలో భాషా ప్రేమికులను కలవర పెడుతోన్న అంశమూ ఇదే.
ఆ సేవల్ని తెలుగులోనే అందించలేమా? :మరి తెలుగు భాష ఈరోజు ఎదుర్కుంటున్న సవాళ్లు ఏంటి? దేశంలో మిగతా మాతృభాషలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయా? వాటితో పోలిస్తే మనం ఎక్కడున్నాం? తెలుగు భాష కాలానుగుణంగా అభివృద్ధి చెందకపోవటానికి కారణం ఏంటి? ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా భాషలో పరిశోధనలు ఎందుకు జరగటం లేదు? సాంకేతికత, ఇంటర్నెట్ విస్తృతి, వినియోగం పెరుగుతున్న కొద్దీ కూడా చాలామంది ఇంగ్లిష్‌ను ఆశ్రయించక తప్పడం లేదు. దీనికి మరో మార్గమే లేదా? ఆ సేవల్ని తెలుగులోనే అందించలేమా?
Telugu Basha Dinotsavam 2024 : జపాన్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు సాంకేతికంగా ఎంతో ముందంజలో ఉంటూ కూడా వాటి మాతృభాషల్ని ఎలా కాపాడుకుంటున్నాయి? మనం కూడా అలా చేయాలంటే ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా? భారతీయ భాషలు ఉనికి, దేశంలోనే ఉద్యోగాల కల్పన అన్ని మాతృభాషలో బోధనతోనే సాధ్యమన్నది పెద్దల మాట. ఈ విషయంలో ప్రభుత్వాల కృషి, ప్రయత్నం ఎలా ఉంది?