Pratidhwani on Digital Respect : ఔనన్నా కాదన్నా నడుస్తున్న డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ పిల్లల జీవితంలో ఒక భాగమైపోయింది. ఈ డిజిటల్ ప్రపంచంలో అపార అవకాశాలతో పాటు, అనేక సవాళ్లు, ఆపదలు పొంచి ఉన్నాయి. మరి చిన్నారులను ఆ ప్రమాదాల నుంచి ఎలా కాపాడుకోవాలి? ఆ విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాలసిన జాగ్రత్తలు ఏమిటి? పిల్లలు ఇంటర్నెట్‌లో ఏం చూస్తున్నారు? ఏం చేస్తున్నారు? వారికి డిజిటల్ భద్రత, టెక్నాలజీ, ఇంటర్నెట్ వినియోగంలో పాటించాల్సిన మంచి, మర్యాదల గురించి ఏం నేర్పించాలి?
పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్‌లు సర్వసాధారణంగా మారిన తరుణంలో ఆందోళన కలిగిస్తున్న అంశాలు ఏమిటి? ఇంటర్నెట్‌లో బాల్యానికి ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతున్నాయి? మన చిన్నారులు ఆన్‌లైన్ ప్రపంచంలో ఏం చూస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఈ విషయంలో అసలు ఏమైనా పర్యవేక్షణ ఉంటోందా? దీని ప్రభావాలు ఎలా ఉంటున్నాయి? ఈ డిజిటల్ యుగంలో పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై కన్నేసి ఉంచడం ఎలా అసలు సాధ్యమేనా? అందుకు ఉన్న అవకాశాలు ఏమిటి?
అది డిజిటల్ సేఫ్టీ కావొచ్చు. డిజిటల్ ప్రపంచం కావొచ్చు. అక్కడ ఏది మంచి, ఏది చెడు, అనేవి చిన్నప్పట్నుంచే నేర్పించాల్సిన అవసరం ఏమిటి? చిన్నారులకు చెప్పాలంటే ముందు ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లకు కూడా స్పష్టమైన అవగాహన ఉండాలి. అది జరుగుతోందా? డిజిటల్ లిటరసీలో అసలు మనం ఎక్కడున్నా? చిన్నపిల్లలకు ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగంపై ఆదర్శంగా ఉన్న దేశాలు, విధానాలు ఏమైనా ఉన్నాయా? వాటి నుంచి మనం ఏం స్వీకరించవచ్చు?