YSRCP Anarchy Rule in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మీడియాపై, ప్రతిపక్షాలపై జరుగుతున్న దాడులకు కారణం ఏంటి? తమ అరాచకాల గురించి ఎవరూ మాట్లాడకూడదనా? ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? జగన్‌పై డజన్ల కొద్దీ కేసులు ఉన్నాయి. ఏడాదిన్నర జైలులో ఉన్నారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు నాటి సీఎం చంద్రబాబును కాల్చి చంపాలి. నడిరోడ్డున ఉరేయాలి అని హింసను ప్రేరేపించారు. అలాంటి నేరస్వభావికి ఒక్క ఛాన్స్ అన్నాడు కదా అని ప్రజలు అధికారం ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి అరాచక పాలనను చూస్తున్నాం.
ప్రజలు ఎవరికన్నా అన్యాయం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అక్కడ న్యాయం జరగకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళతారు, ఇప్పుడు వారిద్దరూ కలిసిపోయి సామాన్యులను, ప్రతిపక్షాలను, మీడియాను హింసిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? సొంత చిన్నాన్నను హత్య చేసిన కేసులో సీఎం సోదరుడు, వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయటానికి వచ్చిన సీబీఐని కర్నూలులో ఏం చేశారో చూశాం. సీబీఐ పేరు చెబితే దేశంలో చాలామంది ఉలిక్కిపడతారు. అలాంటి సీబీఐకే ఇలాంటి దుర్గతి పడితే రేపు వీళ్లకి మళ్లీ అధికారం ఇస్తే జనం పరిస్థితి ఏంటి? ఇదే అంశంపై నేటి ‘ప్రతిధ్వని’ లో పాల్గొన్న వక్తలు వారి అభిప్రాయాలను వెల్లడించారు.
ప్రజాసేవ గాలికొదిలి అధికార పార్టీ సేవలో తరిస్తున్న ఆర్టీసీ
కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు:సీఎంగా జగన్ వచ్చిన తర్వాత అసమ్మతి స్వరాలు వినిపించకూడదనే కొత్త సంస్కృతిని తీసుకొచ్చారని సీనియర్ పాత్రికేయుడు కందుల రమేష్ అభిప్రాయపడ్డారు. వ్యవస్థలన్నీ తన చేతిలో ఉన్నాయని, తాను చెప్పిందే జరగాలని, చేసిందే విధానం అనే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయడం, కేసులు పెట్టడం ప్రారంభించారని, ఎవరైనా వ్యతిరేక స్వరం వినిపిస్తే జైలే గతి అని పేర్కొన్నారు.
భౌతికదాడుల నుంచి తప్పించుకోలేరనే భయానక వాతావరణం రాష్ట్రమంతటా వ్యాప్తి చేశారని, ఈ తరహా రాజకీయ సంస్కృతి గతంలో ఎన్నడూ లేదన్నారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఆధారాలున్నా వారిపై నేటికీ చర్యలు లేవని గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకు వెళ్లి తలుపులు పగలకొట్టేందుకు నాయకత్వం వహించిన ఎమ్మెల్యేకు నజరానాగా మంత్రి పదవిని కట్టబెట్టారని అన్నారు.
పోలీసు వ్యవస్థ మొత్తం ఆయన పాదాక్రాంతమైంది: డజన్ల కొద్దీ కేసులు, ఏడాదిన్నర జైలులో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రవృత్తికి తగ్గట్లుగానే మాట్లాడుతున్నారని అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ‘చంద్రబాబును కాల్చి చంపాలి’, ‘నడిరోడ్డుపై ఉరి తీయాలి’ అంటూ హింసను ప్రేరేపించారని కందుల రమేష్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అభిమానులకు బీపీ వచ్చి దాడులు చేశారంటూ రాజ్యాంగ పదవిలో ఉండి మాట్లాడడం సరికాదని, జగన్ ప్రభుత్వంలో విచిత్రాలు, అకృత్యాలు, ఘోరాలు, నేరాలు అనేకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
సొంత చిన్నాన్నను హత్య చేసిన కేసులో సీఎం సోదరుడు, వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయటానికి కర్నూలు వచ్చిన సీబీఐ ఆ పని చేయలేకపోయిందని, దేశ చరిత్రలో సీబీఐకి అలాంటి పరిస్థితి రావడం ఇదే ప్రథమం అని తెలిపారు. జగన్ అండతో పోలీసు వ్యవస్థ మొత్తం ఆయన పాదాక్రాంతమైందని, ప్రజల ఓట్లతో అపరిమితమైన అధికారాన్ని జగన్‌కు కల్పించారని కందుల రమేష్ పేర్కొన్నారు.
మీడియా సంస్థలపై జగన్ యుద్ధం - విలేకరులపై వైఎస్సార్సీపీ శ్రేణుల దాడి
మళ్లీ వస్తే మాఫియా రాజ్యం ప్రత్యక్షంగా చూపిస్తారు:తనకు అధికారం ఇస్తే ఏం చేస్తాననేది ఇప్పటికే జగన్ ప్రజలకు రుచి చూపారన్న కందుల రమేష్, మళ్లీ అధికారంలోకి వస్తే ఇంతకు మించి నియంతృత్వంలో కొత్త పోకడలు, మాఫియా రాజ్యం ప్రత్యక్షంగా చూపిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. తమది హింసా ప్రవృత్తి, మాఫియా మనస్తత్వం, రక్తపిపాసి భావన అని చాటుతారని, 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం ఇలాంటి వ్యవహారాలను ప్రోత్సహించకపోవడం వల్లే జగన్ స్వేచ్ఛగా పాదయాత్ర చేశారని తెలిపారు.
అప్పటి ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేశారన్న రమేష్, ఇప్పుడు ఎవరు విమర్శించినా వ్యక్తిగతంగా దాడులు చేయిస్తున్నారని అన్నారు. గతంలో ప్రభుత్వాలు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి, సంప్రదాయాలను గౌరవించాయని, వాటికి జగన్ వల్ల తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షాలను నాశనం చేయాలి, ఇష్టంలేని శక్తులను, వర్గాలను అణచివేయాలి, ఇందుకు అధికారాన్ని తీవ్రంగా ఉపయోగించుకోవాలి అనే కొత్త ప్రజాస్వామ్య వ్యతిరేక భావనలను జగన్ పాలన నేర్పిస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రమంతటా ఫ్యాక్షన్ సంస్కృతి:ప్రభుత్వం మారితే వైసీపీ నేతల అరాచకాలపై కేసులు నమోదు చేస్తే వారంతా తీవ్రమైన శిక్షలకు గురికావాల్సి ఉంటుందని, మరోసారి జగన్‌కు ఓటు వేసి గెలిపిస్తే ఎన్నికల ద్వారా విజయం సాధించి నియంతగా వ్యవహరించడం ఎలా? అనే విషయంలో సీఎం పీహెచ్‌డీ పొందినట్లే అనుకోవాలని తెలిపారు. పోలీసులపై ఫిర్యాదులు చేసేందుకు ఉన్న పోలీసు కంప్లయింట్ అథారిటీ నిర్వీర్యమైందన్న రమేష్, అంతా కోర్టుల మీద ఆధారపడుతున్నారని అన్నారు.