Prathidwani:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల ముందు ఇప్పుడు రెండే మార్గాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు చేతిలో పెట్టడమా? జగన్‌కు వదిలేయటామా? ఎవరి గత చరిత్ర ఏంటి? రాష్ట్రానికి వాళ్లు చేసిన సేవలేంటి? సీఎం అవటానికి ఎవరికి ఏవేం అర్హతలు ఉన్నాయి? మన జీవితాలతో పాటు భావితరాల భవిష్యత్తును వారి చేతుల్లో పెట్టాలంటే వారి సమర్థతపై ఎంత నమ్మకం ఉండాలి? పెళ్లికొడుకు మంచివాడు కాడని తెలిస్తే మన ఆడబిడ్డకు అలాంటి వాడిని ఇచ్చి పెళ్లి చేస్తామా? డ్రైవింగ్ సరిగ్గా చేయలేని వాడి చేతికి స్టీరింగ్ అప్పచెప్పి మనం ప్రయాణించగలమా? అలాంటిది రాష్ట్రాన్ని, ప్రజాసంపదనను అప్పగించాలంటే ఓటర్లు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి? ఎవరికి అప్పగించాలి? జనం ముందున్న మార్గాలేంటి? ఈ అంశాలపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.
ఇతర రాష్ట్రాలకు వలస పోతున్న ఐటీ యువత - ఏన్డీఏ కూటమికి ఓటు వేసేందుకు ఆసక్తి? - ETV Bharat Prathidwani
ఈరోజు ఏపీ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? ఈ సమయంలో రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెడితే ప్రజల జీవితాలు బాగుపడతాయి? దేశంలోనే చెత్త పాలనలో ఒక చెడు నమూనాగా ఉన్న ఏపీని తిరిగి పట్టాలెక్కించాలంటే ప్రజల ముందు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా మీ ఛాయిస్ ఏంటి? చంద్రబాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా పనిచేసినప్పుడు ఆయన రాష్ట్రానికి చేసిన సేవలేంటి? వాటి ప్రభావాన్ని మీరెలా విశ్లేషిస్తారు? 2014 నుంచి 2019 మధ్య విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు చంద్రబాబు ఎటువంటి ప్రయత్నాలు చేశారు? జగన్ రాజకీయ చరిత్ర ఎలా మొదలైంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆయన చేసిన సేవలేంటి? 2019లో సీఎం అయ్యాక జగన్ ఈ రాష్ట్రానికి ఏం మేలు చేశారు?