ETV Bharat / state

ఐఎన్‌ఎస్‌ నిర్దేశక్‌ జాతికి అంకితం - వేగవంతమైన ప్రయాణం ఈ నౌక సొంతం - INS NIRDESHAK COMMISSIONED

ఐఎన్‌ఎస్‌ నిర్దేశక్‌ నౌకను జాతికి అంకితం చేసిన కేంద్రమంత్రి సంజయ్‌సేథ్‌ - అత్యాధునిక హైడ్రో, ఓషనోగ్రాఫిక్ సర్వే పరికరాలతో నిర్దేశక్ రూపకల్పన

INS Nirdeshak Commissioned
INS Nirdeshak Commissioned (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Updated : 2 hours ago

INS Nirdeshak Commissioned : ఐఎన్‌ఎస్‌ నిర్దేశక్‌ నౌకను కేంద్రమంత్రి సంజయ్‌సేథ్‌ జాతికి అంకితం చేశారు. విశాఖ నావల్‌ డాక్‌యార్డ్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి నౌకను జాతికి అంకితం చేశారు. అత్యాధునిక హైడ్రో, ఓషనోగ్రాఫిక్ సర్వే పరికరాలతో నిర్దేశక్‌ను రూపొందించారు. 18 నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం ఐఎన్‌ఎస్‌ నిర్దేశక్‌ సొంతమని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.

రక్షణ రంగం ఉత్పత్తులలో భారత్ స్వయం సమృద్ది దిశగా వడివడిగా అడుగులు వేస్తోందని రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ తెలిపారు. దీనికి నిదర్శనం ప్రస్తుతం తయారయ్యే యుద్ధ నౌకలు 80 నుంచి 90 శాతం దేశీయ పరికరాలతో రూపుదిద్దుకుని మంచి పని తీరును కనబర్చడమేనని అన్నారు. రక్షణ అవసరాలకు అనుగుణంగా పరికరాలు, సామగ్రి సిద్ధం చేయడంలోనే కాకుండా ఉత్పత్తుల ఎగుమతులలోనూ మంచి పురోగతి సాధిస్తున్న పరిశ్రమ వర్గాలను, రక్షణవర్గాలను ప్రశంసించారు.

రెండు ఇంజన్లతో రూపకల్పన: కాగా సముద్ర జలాల్లో హైడ్రో గ్రాఫిక్ సర్వేలకు అనువుగా నిర్దేశక్ నౌకను రూపొందించారు. దీనిని నేడు జాతికి అంకితం చేశారు. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ విశాఖ నావెల్ డాక్ యార్డ్​లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని దీనిని జాతికి అంకితమిచ్చారు. కోల్‌కతాలోనీ జీఆర్​ఎస్​ఈలో (Garden Reach Shipbuilders and Engineers) దేశీయంగా 80 శాతం పరికరాలతో ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక నిర్మాణం జరిగింది. 110 మీటర్ల పొడవు, 3,800 టన్నుల బరువైన ఈ నౌకను రెండు ఇంజన్లతో రూపకల్పన చేశారు. అత్యాధునిక హైడ్రో గ్రాఫిక్, సముద్ర అధ్యయనం కోసం నిర్దేశక్​ను తీర్చి దిద్దారు.

18 నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం: హైడ్రోగ్రాఫిక్ సర్వేలకు సంబందించిన రెండో నౌక ఐఎన్‌ఎస్‌ నిర్దేశక్‌. గతంలో 32 ఏళ్ల పాటు భారత నౌకాదళంలో సేవలందించి, 2014వ సంవత్సరంలో వీడ్కోలు తీసుకున్న నిర్దేశక్ స్ధానంలో దీనిని రూపొందించారు. 25 రోజుల పాటు నిరంతరాయంగా 18 నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణించడం ఈనౌక ప్రత్యేకతలతో ఒకటి. హిందూ మహా సముద్ర ప్రాంతంలో భారత్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించడం కోసం హైడ్రోగ్రాఫిక్ సర్వేలను చేపడుతుంది.

హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి పరిరక్షణలో భాగంగా సాంకేతిక అంశాలు, హైడ్రోగ్రాఫిక్, సీస్మోగ్రాఫిక్ సర్వేలు నిర్వహించడం, సునామి హెచ్చరికలు పంపడం వంటి ఆధునిక అంశాలను ఇది నిర్వహిస్తుందని మంత్రి వివరించారు. ఈ నౌకను జాతికి అంకితం చేసిన మంత్రి, అనంతరం నౌకాదళ ఉన్నతాధికార్లతో కలిసి దీనిని సందర్శించారు.

ఇటీవల నిర్దేశక్ నౌకకు కోల్‌కతాలో సీట్రయల్స్‌ సైతం విజయవంతంగా ముగించి బుధవారం జాతికి అంకితం చేశారు. భారత్​తో స్నేహపూర్వకంగా ఉన్న ఇతర దేశాల నౌకాదళాలతో సైతం అవసరమైన మేరకు సమాచారం పంచుకుంటుంది. భారత నౌకాదళంలో ఐఎన్ఎస్ సంధాయక్ తర్వాత ఈ నిర్దేశక్ నౌక హైడ్రో గ్రాఫిక్ సర్వే సమాచారం కోసం వినియోగంలోకి వచ్చిన రెండోది. ఫిబ్రవరి 3వ తేదీన ఐఎన్ఎస్ సంధాయక్​ని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అంకితం ఇచ్చారు.

విశాఖలో ఘనంగా తొలి జలాంతర్గామి వార్షికోత్సవం

భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం - 'INS అరిఘాత్‌' అణు జలాంతర్గామి జాతికి అంకితం - India Commissions INS Arighat

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.