Prathidwani:సూపర్ సిక్స్ వర్సెస్ నవరత్నాలు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇప్పుడిదే చర్చ. ఐదు సంవత్సరాల క్రితం నవరత్నాల పేరు చెప్పి జనంతో ఓట్లు వేయించుకున్నారు జగన్. అధికారంలోకి వచ్చారు. నవరత్నాల పేరుతోనే కాలం గడిపేశారు. ఇప్పుడు తెలుగుదేశం సారథ్యంలోని ఎన్డీయే కూటమి సూపర్ సిక్స్‌తో ప్రజల ముందుకొచ్చింది. ఐదు సంవత్సరాలుగా నవరత్నాలను చూసిన జనం ఇప్పుడు సూపర్ సిక్స్‌తో వాటిని పోల్చుకుంటున్నారు. ఈ రెండింట్లో ఏది ఎక్కువ లబ్ధి చేకూర్చుతుంది? ఆయా పథకాలతో వివిధ వర్గాలకు కలిగే ప్రయోజనమెంత? సమాజంలో వాస్తవ మార్పు కోసం ప్రయత్నిస్తున్నదెవరు? ఈ అంశాలపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం. ప్రతిధ్వని చర్చలో సామాజిక కార్యకర్త ఎం.శారద, రాజకీయ విశ్లేషకులు నూర్ మహ్మద్ పాల్గొన్నారు.
జగన్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకొంటున్న నవరత్నాలతో ప్రజలకు జరిగిన మేలేంత? ఇందులో ప్రధానమైన పేదలందరికీ ఇళ్ల పథకం కింద రాష్ట్రంలో ఎన్ని గృహాలు నిర్మించారు? తెలుగుదేశం కూటమి హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలతో ఏయే వర్గాలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? నవరత్నాల్లో భాగంగా జలయజ్ఞం కింద ఎన్ని ప్రాజెక్టులు కట్టారు? కొత్తగా ఎంత భూమిని సాగులోకి తెచ్చారు? రైతు భరోసా రైతుల్లో ఎంతమేర భరోసా నింపింది?
అన్నదాతలకు జగనన్న చేసిందేమిటి? - ఇచ్చిన హామీలు నెరవేర్చారా? - What CM Jagan done for farmers