తెలంగాణ

telangana

ETV Bharat / opinion

గుజరాత్​లో బీజేపీతో ఆప్, కాంగ్రెస్ ఢీ- మోదీ సొంత రాష్ట్రం మరోసారి క్లీన్​ స్వీప్​ కానుందా? - gujarat lok sabha elections 2024 - GUJARAT LOK SABHA ELECTIONS 2024

Gujarat Lok Sabha Elections 2024 : గుజరాత్‌లో అత్యంత బలంగా ఉన్న బీజేపీని ఢీకొనేందుకు కాంగ్రెస్-ఆప్‌ జట్టుకట్టాయి. ఒంటరిగా పోటీ చేయడం కన్నా, కలిసికట్టుగా కమలదళాన్ని ఢీకొనడమే మేలని నిర్ణయించాయి. మోదీ వేవ్ బలంగా ఉన్న ఈ రాష్ట్రంలో బీజేపీని ఢీకొనే సత్తా ఆ రెండు పార్టీలకు ఉందా? లేదా? రాష్ట్రంలోని కీలకమైన నాలుగు ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితేంటి?

Gujarat Lok Sabha Elections 2024
Gujarat Lok Sabha Elections 2024

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 6:36 AM IST

Gujarat Lok Sabha Elections 2024 :గుజరాత్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంతగడ్డ. అక్కడ జరిగే రాజకీయ పరిణామాలను ప్రధాని మోదీ నిత్యం నిశితంగా పరిశీలిస్తుంటారు. ఈ క్రమంలోనే గుజరాత్‌లో అత్యంత బలంగా ఉన్న బీజేపీని ఢీకొనేందుకు ఇండియా కూటమి పెద్ద స్కెచ్ గీసింది. ఒంటరిగా పోటీ చేయడం కన్నా, కలిసికట్టుగా కమలదళాన్ని ఢీకొనడమే మేలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించాయి. గుజరాత్‌లో బీజేపీపై ఉమ్మడిపోరుకు సమాయత్తం అయ్యాయి. మోదీ వేవ్ బలంగా ఉన్న ఈ రాష్ట్రంలో బీజేపీని ఢీకొనే సత్తా ఆ రెండు పార్టీలకు ఉందా ? లేదా ? ఇప్పుడు తెలుసుకుందాం.

కాంగ్రెస్ 24, ఆప్ 2 స్థానాల్లో
గుజరాత్‌లో మొత్తం 26 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో అన్ని లోక్‌సభ సీట్లను బీజేపీయే గెల్చుకుంది. ఈసారి కూడా అదే దూకుడుతో క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో కమలదళం ఉంది. ఇంత భారీ లక్ష్యాన్ని పెట్టుకున్న బీజేపీ, అంత ఈజీగా ఆప్, కాంగ్రెస్ కూటమికి గెలిచే ఛాన్స్ ఇస్తుందా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ లోక్‌సభ పోల్స్‌లో కాంగ్రెస్ 24 స్థానాల్లో పోటీ చేయనుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ బరూచ్, భావ్‌నగర్‌ స్థానాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపనుంది. చివరిగా 2009 లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లో కాంగ్రెస్ చక్కటి ఫలితాలను సాధించింది. అప్పట్లో రాష్ట్రంలోని 11 లోక్‌సభ స్థానాలు హస్తం పార్టీ హస్తగతం అయ్యాయి. ఇక 2022 సంవత్సరంలో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకుగానూ కాంగ్రెస్ పార్టీ కేవలం 17 చోట్ల గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ 5 సీట్లే గెలవగలిగింది. దీన్నిబట్టి గుజరాత్‌లో బీజేపీ ఎంత బలంగా పాగా వేసిందో అర్థం చేసుకోవచ్చు.

నాలుగు ప్రాంతాల్లో తీరొక్క సమీకరణాలు
గుజరాత్‌లో నాలుగు ప్రాంతాలు ఉన్నాయి. అవి సౌరాష్ట్ర, కఛ్, ఉత్తర గుజరాత్, దక్షిణ గుజరాత్, మధ్య గుజరాత్. బీజేపీ పూర్తి విశ్వాసంతో ఎన్నికల బరిలోకి దూకింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రతీ లోక్‌సభ స్థానంలో 5 లక్షలకు తగ్గకుండా మెజారిటీని సాధిస్తామని గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో స్ట్రాంగ్‌గా ఉన్న బీజేపీని ఢీకొట్టాలంటే, సామాజిక సమీకరణాలకు అనుగుణంగా టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్-ఆప్ కూటమి ఫోకస్ చేయాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. గుజరాత్‌లో మే 7న ఒకే దశలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎవరి వ్యూహం ఎంతలా ఫలిస్తుందో ఆ రోజే తేలుతుంది.

సౌరాష్ట్ర, కఛ్
గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కఛ్ ప్రాంతంలో 8 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం బీజేపీ చేతిలో ఉన్నాయి. కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పోర్‌బందర్‌ నుంచి, మరో కేంద్ర మంత్రి పర్షోత్తమ్ రూపాలా రాజ్‌కోట్‌ నుంచి పోటీ చేయనున్నారు. ఇంతకుముందు వీరిద్దరు రాజ్యసభ ద్వారా కేంద్ర మంత్రులయ్యారు. ఈదఫా వారు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఉత్తర గుజరాత్
ఉత్తర గుజరాత్ ప్రాంతంలో 7 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. బీజేపీ దిగ్గజ నేత అమిత్ షా ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీనగర్ ఈ ప్రాంతంలోనే ఉంది. రాష్ట్రంలోని ప్రధాన నగరమైన అహ్మదాబాద్‌లోని రెండు లోక్‌సభ స్థానాలు కూడా ఉత్తర గుజరాత్ పరిధిలోకే వస్తాయి. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలను సాధించింది. అయితే 2014 నుంచి మోదీవేవ్‌తో డీలా పడింది.

మధ్య గుజరాత్
మధ్య గుజరాత్ ప్రాంతంలో 6 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వడోదరతో పాటు గిరిజనులు ఎక్కువగా ఉండే దాహోద్, పంచమహల్, ఛోటా ఉదయపుర్ స్థానాలు ఈ ప్రాంతంలోనివే. 2014, 2019 ఎన్నికల్లో గుజరాత్‌లో బీజేపీ క్లీన్ స్వీప్‌ చేయడం వెనుక బలమైన శక్తిగా ఈ ప్రాంతం అవతరించింది. ఇక్కడ బలమైన పట్టు కలిగిన కాంగ్రెస్ కూడా అప్పట్లో మోదీ వేవ్ ఎదుట నిలువలేకపోయింది. ఈసారి ఇక్కడి ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి గుజరాత్‌లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.

దక్షిణ గుజరాత్
దక్షిణ గుజరాత్ ప్రాంతంలో 5 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. డైమండ్ పాలిషింగ్ హబ్ సూరత్, భరూచ్, నవ్​సారి వంటి కీలకమైన సీట్లు ఈ ప్రాంతంలోనివే. ఇవన్నీ వాణిజ్యపరంగా చాలా ముఖ్యమైనవి. భరూచ్ స్థానం నుంచి కాంగ్రెస్ మద్దతుతో ఆప్ అభ్యర్ధి బరిలోకి దిగబోతున్నారు. ఆప్ ఎమ్మెల్యే చైతర్ వాస్తవ ఈసారి భరూచ్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి మన్సుఖ్ వాసవ బరిలోకి దిగారు. గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ నవ్సారి నుంచి పోటీ చేయనున్నారు.

టార్గెట్ 370పై BJP ఫోకస్- దక్షిణాదిలో ఆ పని చేస్తే లైన్ క్లియర్?- బలాలు, బలహీనతలివే!

రామమందిరం టు డిజిటల్ ఇండియా- ఈ '10' అస్త్రాలపైనే మోదీసేన గంపెడాశలు!

ABOUT THE AUTHOR

...view details