Government Delay in Paying Compensation to Farmers :ధాన్యం రైతుకు అండగా ఉంటాం, రైతు పండించిన ప్రతి గింజను కొంటాం, సకాలంలో నగదు జమ చేస్తాం, ఇవి నాలుగు నెలల క్రితం ప్రభుత్వం చెప్పిన మాటలు. కానీ క్షేత్రస్థాయిలో హామీల అమలు ఊసే లేకపోవటంతో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ధ్యానం విక్రయించి నెలలు గడుస్తున్నా తమకు ఇంత వరకు డబ్బులు చెల్లించ లేదని కృష్ణా జిల్లా రైతులు (krishna District) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రం (Rythu Bharosa Centres) అధికారుల నుంచి స్పందన కరవైందని పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియటం లేదని రైతులు వాపోతున్నారు.
సంక్రాంతి వెళ్లిపోయింది - పెట్టుబడి రాయితీ ఎప్పుడు జగనన్నా
Krishna District :రైతులను ప్రభుత్వం ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఖరీఫ్ (kharif) ప్రారంభంలో నీటి కోసం అవస్థలు పడి పంటను సాగుచేస్తే మిగ్‌జాం (michaung cyclone) ముంచేసింది. అయినా పంటను కాపాడుకుంటే ధాన్యం కొనుగోలు పేరుతో ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోంది. ధాన్యం కొనుగోలుకు విధిస్తున్న నిబంధనలు చూసి రైతులు బెంబేలెత్తుతున్నారు. తేమ శాతం, గన్నీ సంచుల పేరుతో రైతులను దోచేస్తున్నారు. అన్ని ఆటంకాలను దాటుకుని ధాన్యం విక్రయించిన రైతుకు సకాలంలో నగదు జమచేయటంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. ధాన్యం కొనుగోళ్ల ఆరంభంలో డబ్బులు సకాలంలోనే జమ చేసినా క్రమేపీ జాప్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.