ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

మైదా అవసరం లేకుండా రుచికరమైన 'రవ్వ పరోటాలు' - తయారీ చాలా సింపుల్! - RAVA PARATHA RECIPE IN TELUGU

రవ్వతో ఉప్మా మాత్రమే కాదు పరోటాలు కూడా చేసుకోవచ్చు - ఈ పద్ధతి ఫాలో అయితే చాలు

rava_paratha_recipe
rava_paratha_recipe (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2025, 5:18 PM IST

Rava Paratha Recipe : పరోటా ఎంతో ఇష్టమైన వంటకమైనప్పటికీ 'మైదా'తో తయారు చేస్తారన్న ఏకైక కారణంతో కోరికను అణచుకుంటాం. చాలా మంది మైదాతో తయారు చేసిన వంటకాలను ఇష్టపడరు. కానీ, ఇప్పుడా అవసరం లేదు. పరోటా తినకుండా మీ కోరికను చంపుకోవాల్సిన అవసరం లేదు. మైదా అవసరం లేకుండానే ఉప్మా రవ్వతో దూదిలాగా, మెత్తని మృదువైన పరోటాలు చేసుకునే రెసిపీ తీసుకొచ్చాం మీకోసం. ఇంకెందుకు ఆలస్యం. పదండి వంటింట్లోకి!

పక్కా కొలతలతో 'చికెన్ పచ్చడి' ఇలా పెట్టండి - 3 నెలలు నిల్వ పెట్టుకోవచ్చు!

బొంబాయి రవ్వతో ఉప్మా మాత్రమే కాదు. ఉదయం టిఫిన్లలోకి, మీ వారి ఆఫీస్ లంచ్ బాక్సులోకి రవ్వ పరోటాలు చేస్తే సరి. గంటల తరువాత కూడా ఇవి మృదువుగా ఉండడం విశేషం. రవ్వ పరోటాలు మెత్తగా ఉంటాయి. చూడముచ్చటైన రంగులో దూదిలా కనిపించే ఈ పరోటాలు వెన్నలా కరిగిపోతాయి. కుర్మా, లేదా చట్నీలతో చాలా రుచిగా ఆరగించొచ్చు.

రవ్వ పరోటాల తయారీకి కావాల్సిన పదార్థాలు :

  • బొంబాయి రవ్వ/ఉప్మా రవ్వ - 1 కప్పు
  • నీళ్ళు 1 3/4 కప్పులు
  • మైదా లేదా గోధుమ పిండి
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నెయ్యి - పరాటాలు కాల్చడానికి సరిపడా

రవ్వ పరోటాల తయారీ విధానం

  • ముందుగా రవ్వని మిక్సీ లో వేసి ఓ నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి.
  • కడాయిలో నీళ్లు పోసుకుని ఉప్పు కలిపి మరిగించాలి.
  • నీళ్లు మసులుతున్న సమయంలో రవ్వ కొద్ది కొద్దిగా వేస్తూ గరిటతో కలుపుకోవాలి. మీడియం ఫ్లేం మీద గట్టి ముద్ద అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి.
  • ఉప్మా మాదిరిగా గట్టి ముద్దయ్యాక ప్లేట్ లోకి తీసుకుని గోరు వెచ్చగా చల్లార్చుకోవాలి.
  • ఇపుడు పిండి ముద్దలోకి కొద్దిగా మైదా లేదా గోధుమ పిండి చల్లుకోవాలి. అదే వేడి మీద నీళ్లు కలపకుండా పిండి ముద్దని వత్తుకోవాలి
  • వేడిని మీరు భరించలేకపోతే ఒక పలుచని వస్త్రాన్ని కప్పి వత్తుకోవచ్చు.
  • పిండి ముద్దలో మైదా చల్లుకుంటూ ఎక్కడా పగుళ్లు రాకుండా చూసుకోవాలి. మైదా ఎక్కువ కాకుండా చూసుకోవాలి.
  • ఇపుడు చపాతీల మాదిరిగా పొడి మైదా చల్లుకుని పిండి ముద్దని ఉంచి అప్పడాల కర్రతో నిదానంగా అంచులు పల్చగా వత్తుకోవాలి.
  • మరోవైపు పొయ్యిపై పెనం పెట్టి బాగా వేడెక్కాక పరోటాను రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక వైపు కాలిన తర్వాత మరో వైపు ఇలా నెయ్యి వేసుకుని ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది.
  • పరోటా కోసం నెయ్యి లేకపోతే నూనె కూడా వాడుకోవచ్చు. మరింత రుచిగా ఉండాలంటే నెయ్యి వాడుకుంటే సరిపోతుంది.
  • కాల్చుకున్న పరోటాని హాట్ బాక్సులో లేదా క్లాత్ తో కప్పితే సరిపోతుంది.

'గ్యాస్ ట్రబుల్' నుంచి బయటపడేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? - నిపుణులు ఏమంటున్నారంటే!

బాలీవుడ్ బ్యూటీ కొత్త రెసిపీ - నెట్టింట వైరల్​గా మారిన 'కొబ్బరి చిప్పల్లో ఇడ్లీ'

ABOUT THE AUTHOR

...view details