Top Searched Recipes : మనకు ఏదైనా డౌట్ వస్తే వెంటనే స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి గూగుల్లో సెర్చ్ చేసేస్తుంటాం. ఇలా టైప్ చేయగానే చిటికెలో మనకు సమాధానం సమాచారం మొత్తం వచ్చేస్తుంది. ఇక ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత వంటలు చేయడం కూడా చాలా ఈజీ అయిపోయింది. ఏదైనా రెసిపీ కోసం సెర్చ్ చేయగానే దాని తయారీకి సంబంధించిన వీడియోలు ఇలా యూట్యూబ్‌లో ప్రత్యక్షమైపోతాయి. అయితే, ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఈ ఏడాది భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన టాపిక్ లిస్ట్‌లను రిలీజ్ చేసింది. ఇందులో ఎక్కువ మంది ఏ వంటల గురించి వెతికారో తెలిస్తే మీరు ఆశ్యర్యపోతారు. మరి ఆ రెసిపీలు ఏంటో ఓ లుక్కేయండి..
ఆవకాయ :
'ఆవకాయ' ఈ పదం వింటేనే చాలా మందికి నోరూరుతుంది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఎర్రెర్రని ఆవకాయ పచ్చడితో తింటే అమృతమే! ప్రతి వేసవిలో తెలుగు వారి ఇళ్లలో సంవత్సరానికి సరిపడా ఆవకాయ పచ్చడి తప్పకుండా పెడుతుంటారు. పచ్చి మామిడికాయ ముక్కల్లో కారం, ఆవపిండి, నువ్వులనూనె, ఉప్పు జోడించి చేసే ఆవకాయ రుచికి తిరుగులేదు. ఎందుకంటే, 2024 సంవత్సరంలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వంటకాల్లో ఆవకాయ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది మరి!
ధనియా పంజిరి :
ధనియా పంజిరి అనేది ప్రధానంగా నార్త్ ఇండియాలో, ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో ఎక్కువగా తయారు చేసే ఒక ప్రత్యేకమైన వంటకం. ఈ పంజిరిని జన్మాష్టమి వంటి పండుగల సమయంలో ప్రసాదంగా కూడా పంచిపెడతారు. దీనిని బాదం, జీడిపప్పు, ఎండుకొబ్బరి, ఫూల్‌మఖానా, ధనియాలపొడి, పంచదార, నెయ్యిలతో తయారు చేస్తారు. ధనియా పంజిరి ఎంతో రుచిగా ఉండడమే కాదు.. దీనిని తినడం వల్ల జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.