ETV Bharat / offbeat

అద్దిరిపోయే "చీజ్​ ఆమ్లెట్​" - ఇలా చేస్తే సూపర్​ ఫ్లఫ్ఫిగా వస్తుంది! - CHEESE OMELETTE RECIPE

-రొటీన్ ఆమ్లెట్​ని మించిన టేస్ట్​ -సింపుల్​గా ఇలా చీజ్​ ఆమ్లెట్​ చేసేయండి!

How to Make Cheese Omelette Recipe
How to Make Cheese Omelette Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2025, 11:59 AM IST

How to Make Cheese Omelette Recipe : ఇంట్లో కోడిగుడ్లు ఉన్నాయంటే చాలు ఎక్కువ మంది ఆమ్లెట్ వేసుకునేందుకు ఇష్టపడతారు. అయితే, ఎప్పుడూ ఒకే విధంగా ఆమ్లెట్​ వేసుకుంటే తినాలని అనిపించదు. అందుకే మీ కోసం సూపర్​ ఫ్లఫ్ఫీ చీజ్​ ఆమ్లెట్ రెసిపీని పరిచయం చేయబోతున్నాం. ఈ స్టోరీలో చెప్పిన విధంగా చీజ్​ ఆమ్లెట్​ చేస్తే అచ్చం స్ట్రీట్​ ఫుడ్​ స్టైల్లో చేసిన విధంగా పర్ఫెక్ట్​గా వస్తుంది. ఈ ఆమ్లెట్​ పిల్లలకు ఈవెనింగ్​ స్నాక్స్​లా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. మరి సింపుల్​గా చీజ్​ ఆమ్లెట్​ ఎలా చేయాలి? దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • 6 గుడ్లు
  • రుచికి సరిపడా ఉప్పు
  • వెన్న - సరిపడా
  • సన్నని ఉల్లిపాయ తరుగు - అరకప్పు
  • సన్నని టమాటా తరుగు - పావు కప్పు
  • పచ్చిమిర్చి తరుగు - 3 టేబుల్​స్పూన్​
  • మిరియాల పొడి - సరిపడా
  • ప్రాసెస్​డు చీజ్​ స్లైసెస్​ - 9

తయారీ విధానం :

  • ముందుగా 2 గిన్నెలు తీసుకోవాలి. ఆపై గుడ్లను పగలగొట్టి ఒకదాంట్లో ఎల్లో, మరో దాంట్లో ఎగ్​వైట్​ వేసుకోవాలి.
  • ఆపై బీటర్​తో ఎగ్​వైట్​ నురగ వచ్చే వరకు బాగా బీట్​ చేయాలి. ఎగ్​వైట్​లో నురగ ఎంత వస్తే ఆమ్లెట్​ అంత ఫ్లఫ్ఫీగా వస్తుందని గుర్తుంచుకోండి.
  • అలాగే పచ్చసొన కూడా ఎగ్​ బీటర్​తో 5 నిమిషాలు బీట్ చేయండి.
  • తర్వాత ఎగ్​వైట్​ మిశ్రమంలో పచ్చసొన పోసి పైకి కిందకు కలపాలి.
  • ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్​స్టిక్​ పాన్ పెట్టండి. పాన్​ వేడయ్యాక బటర్​ వేసి కరిగించండి. ఇప్పుడు స్టవ్​ లో ఫ్లేమ్​లో అడ్జస్ట్​ చేసి ఎగ్​ మిశ్రమం పోసుకోండి. (ఈ కొలతలతో మూడు చీజ్​ ఆమ్లెట్లు చేసుకోవచ్చు.)
  • అనంతరం ఆమ్లెట్​పై టేబుల్​స్పూన్ సన్నని ఉల్లిపాయ, టమాటా తరుగు, కొద్దిగా పచ్చిమిర్చి తరుగు వేయండి. అలాగే కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లండి.
  • పాన్​లో ఆమ్లెట్​ సేపరేట్​ అవుతున్నప్పుడు కొద్దిగా బటర్​ పాన్​ అంచుల వెంబడి వేయాలి.
  • తర్వాత ఆమ్లెట్​లో ఓ వైపు 3 ప్రాసెస్​డ్​ చీజ్​ స్లైసెస్​ వేసి మరోవైపు తిప్పుకోవాలి.
  • అరనిమిషం తర్వాత ఆమ్లెట్​ని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే టేస్టీ చీజ్​ ఆమ్లెట్​ రెడీ!
  • ఈ చీజ్​ ఆమ్లెట్ టమాటా సాస్​తో తింటే టేస్ట్​ సూపర్​గా ఉంటుంది. ఈ ఆమ్లెట్​ రెసిపీ నచ్చితే మీరు ఓ సారి ఇంట్లో ట్రై చేయండి.

రొటీన్​ కాదు 'ప్రొటీన్'​గా చేసేద్దామా! - 'బరువు తగ్గించే దోశలు'

హోటల్ స్టైల్​లో రవ్వ ఊతప్పం - ఈజీగా అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.