తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

అందంగా కనిపించాలంటే - ఈ అలవాట్లకు దూరంగా ఉండాలట! - AVOID THESE SKINCARE MISTAKES

చర్మం కాంతివంతంగా నిగనిగలాడాలంటే - ఈ పొరపాట్లు చేయొద్దంటున్న నిపుణులు!

AVOID THESE SKINCARE MISTAKES
These Habits to Avoid for Skin Care (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2024, 3:36 PM IST

These Habits to Avoid for Skin Care : అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఈ క్రమంలోనే చర్మ సౌందర్యం కోసం నిత్యం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయినప్పటికీ కొందరిలో పలు చర్మ సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే, అందుకు కారణం మనం పాటించే కొన్ని అలవాట్లే అని సూచిస్తున్నారు నిపుణులు. ఇంతకీ, అందాన్ని దెబ్బతీసే ఆ అలవాట్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పదే పదే ముఖాన్ని తాకుతున్నారా?

మనం డైలీ వివిధ పనులు చేసే క్రమంలో చేతులతో తలుపులు, డోర్ నాబ్స్, పెన్స్, టేబుల్స్.. ఇలా ఎన్నో రకాల వస్తువులను తాకుతుంటాం. ఫలితంగా వాటిపై ఉండే దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా మొదలైనవన్నీ హ్యాండ్స్​కు అంటుకుంటాయి. మళ్లీ అవే చేతులతో ఫేస్​ని కూడా తాకుతుంటాం. దాంతో చేతికి ఉన్న మురికి, బ్యాక్టీరియా వంటివి చర్మ రంధ్రాల్లోకి చేరి చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయంటున్నారు నిపుణులు. అందుకే, చేతితో పదే పదే ముఖాన్ని తాకకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు. అదేవిధంగా ఫేస్ వాష్చేసుకునే ముందు చేతుల్ని శుభ్రం చేసుకోవడమూ ముఖ్యమే అంటున్నారు.

మొబైల్ ద్వారా..

స్క్రీన్ పెద్దదిగా ఉండే మొబైల్స్ వల్ల కూడా చర్మ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా ఫోన్ మాట్లాడేటప్పుడు చెవి దగ్గర నుంచి బుగ్గల వరకు చర్మానికి మొబైల్ స్క్రీన్ టచ్ అవుతుంటుంది. అప్పుడు ముఖానికి ఉన్న మేకప్ ఫోన్ స్క్రీన్‌కు అంటుకుంటుంది. ఆ టైమ్​లో దానిని శుభ్రం చేయకపోతే కొన్ని వేల సంఖ్యలో సూక్ష్మ క్రిములు దానిపై చేరతాయి. తిరిగి అదే ఫోన్ చర్మాన్ని తాకినప్పుడు అవన్నీ చర్మరంధ్రాల్లోకి చేరి మొటిమలు, మృతకణాలకు కారణమవుతాయంటున్నారు నిపుణులు. అందుకే ఫోన్‌ స్క్రీన్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండడంతో పాటు మాట్లాడేటప్పుడు కూడా ఫోన్ చర్మానికి తాకకుండా జాగ్రత్త పడడం మంచిదంటున్నారు.

మేకప్ తొలగించుకోకపోయినా..

నేటి రోజుల్లో చాలా మంది వాటర్​ప్రూఫ్ మేకప్ ప్రొడక్ట్స్​ను వినియోగించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, ఇవి స్కిన్ కింద ఒక పల్చని పొరను ఏర్పరచి మేకప్ఎక్కువ టైమ్ నిలిచి ఉండేలా చేస్తాయి. కాబట్టి, ఇలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ వాడినప్పుడు వీలైనంత త్వరగా తొలగించుకునేలా జాగ్రత్త పడాలి. లేదంటే మొటిమలు రావడం, స్కిన్ నిర్జీవంగా మారడం మరికొన్ని చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుందంటున్నారు. అదేవిధంగా నైట్ పడుకునే ముందు కూడా మేకప్ తొలగించుకోవడం ముఖ్యమంటున్నారు.

ఇవి కూడా..

  • కొందరు ముఖంపై ఉన్న మొటిమల్ని పదే పదే తాకడం చేస్తుంటారు. కానీ, అలా చేయడం ద్వారా బ్యాక్టీరియా చర్మమంతా వ్యాపించే ఛాన్స్ ఉంటుంది. ఫలితంగా చర్మ ఆరోగ్యం మరింత దెబ్బ తినే అవకాశం ఉంటుందంటున్నారు.
  • అదేవిధంగా మాసిపోయిన దుప్పట్లు, పిల్లో కవర్లపై నిద్రించడం వల్ల వాటిపై ఉన్న బ్యాక్టీరియా చర్మరంధ్రాల్లోకి చేరి హాని కలిగించవచ్చు. కాబట్టి, వాటిని ఎప్పటికప్పుడూ మార్చడం మంచిదని గుర్తుంచుకోవాలి.
  • ఆయిల్ ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలు అధికంగా తీసుకున్నా చర్మ ఆరోగ్యం దెబ్బతినే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు.

ఇవీ చదవండి :

గ్లోయింగ్ స్కిన్​ కావాలా? మీ డైట్​లో ఈ చిన్న మార్పులు చేస్తే సరి!

"చలికాలం మెడ చుట్టూ నలుపు - ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతుంది!"

ABOUT THE AUTHOR

...view details